Best safety sedan : ధర మాత్రమే కాదు సేఫ్టీ కూడా ముఖ్యమే! ఈ 3 సెడాన్స్​లో ఏది బెస్ట్​?-2024 honda amaze vs tata tigor vs hyundai aura safety feature comparison ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Safety Sedan : ధర మాత్రమే కాదు సేఫ్టీ కూడా ముఖ్యమే! ఈ 3 సెడాన్స్​లో ఏది బెస్ట్​?

Best safety sedan : ధర మాత్రమే కాదు సేఫ్టీ కూడా ముఖ్యమే! ఈ 3 సెడాన్స్​లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Dec 10, 2024 01:30 PM IST

Best safety sedan : 2024 హోండా అమేజ్​ వర్సెస్​ టాటా టిగోర్​ వర్సెస్​ హ్యుందాయ్​ ఆరా.. ఈ 3 సెడాన్స్​లో సేఫ్టీ పరంగా ఏది బెస్ట్​? ఏది కొనొచ్చు? ఇక్కడ తెలుసుకోండి..

ఈ 3 బెస్ట్​ సెల్లింగ్​ సెడాన్​ కార్లలో సేఫ్టీలో ఏది బెస్ట్​?
ఈ 3 బెస్ట్​ సెల్లింగ్​ సెడాన్​ కార్లలో సేఫ్టీలో ఏది బెస్ట్​?

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ సెడాన్​గా ఉన్న అమేజ్​కి అప్డేటెడ్​ వర్షెన్​ని విడుదల చేసింది హోండా సంస్థ. గత వర్షెన్​తో పోలిస్తే కొత్త హోండా అమేజ్​లో భారీ మార్పులే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సేఫ్టీ పరంగా ఈ మోడల్​ కస్టమర్స్​ని అట్రాక్ట్​ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీరు సబ్​ కాంపాక్ట్​ సెడాన్​ కోసం చూస్తుంటే, ఈ స్పేస్​లో ఉన్న ఇతర మోడల్స్​ టాటా టిగోర్​, హ్యుందాయ్​ ఆరాలతో హోండా అమేజ్​ని పోల్చి, సేఫ్టీ పరంగా ఏది బెస్ట్​? ఏది కొనొచ్చు? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

yearly horoscope entry point

2024 హోండా అమేజ్ వర్సెస్ టాటా టిగోర్ వర్సెస్ హ్యుందాయ్ ఆరా: సేఫ్టీ..

కొత్త హోండా అమేజ్ అనేక క్లాస్-లీడింగ్ సేఫ్టీ ఫీచర్లతో లోడ్ అయ్యింది. డ్యూయల్ ఫ్రంట్, సైడ్- కర్టెన్ ఎయిర్ బ్యాగులతో సహా ఆరు ఎయిర్ బ్యాగులు ఇందులో ఉన్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్, లేన్ కీపింగ్ అసిస్ట్ సిస్టమ్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్ సిస్టమ్, ఆటో హై-బీమ్, లీడ్ కార్ డిపార్చర్ నోటిఫికేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. లేన్ వాచ్ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, మల్టీ యాంగిల్ రేర్ కెమెరా విత్ గైడ్ లైన్స్, ఐసోఫిక్స్ యాంకరేజ్ వంటి సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు కూడా కొత్త అమేజ్​ సెడాన్​లో ఉన్నాయి. ఈ సెడాన్ 46% హై-టెన్సిల్ స్టీల్​తో రూపొందించిన ఛాసిస్​పై తయారైంది.

టాటా టిగోర్ సైతం అనేక భద్రతా ఫీచర్లతో వస్తుంది. ఇది స్టాండర్డ్ ఫిట్మెంట్​గా డ్రైవర్, కో-డ్రైవర్ ఎయిర్​బ్యాగులను పొందుతుంది. ఇతర ప్రామాణిక ఫీచర్లలో ఏబీఎస్ విత్ ఈబీడీ, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్, ప్రీ-టెన్షన్స్, లోడ్ లిమిటర్లతో సీట్ బెల్ట్​, 3 పాయింట్ ఈఎల్ఆర్ సీట్ బెల్ట్​లు ఉన్నాయి. టాటా టిగోర్​లో రేర్ పార్కింగ్ సెన్సార్, డే అండ్ నైట్ ఐఆర్​వీఎమ్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్, ఫాలో మీ హోమ్ ల్యాంప్స్, రేర్ డీఫాగర్, రేర్ పార్కింగ్ అసిస్ట్ కెమెరా, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మరోవైపు, హ్యుందాయ్ ఆరా సబ్ కాంపాక్ట్ సెడాన్​లో డ్యూయెల్ ఫ్రంట్ సైడ్, కర్టెన్ ఎయిర్​బ్యాగ్​లతో సహా ఆరు ఎయిర్​బ్యాగులు ఉన్నాయి. అలాగే, ఇది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్​మెంట్​ పొందుతుంది. డిస్​ప్లేతో రేర్ కెమెరా, అలారం, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ మొదలైనవి.

హోండా అమేజ్​ ఫేస్​లిఫ్ట్​కి క్రాష్​ టెస్ట్​ చేయాల్సి ఉంది. ఇక గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో టాటా టిగోర్​కి 4 స్టార్​ రేటింగ్​ లభించింది.

Whats_app_banner

సంబంధిత కథనం