Best base variant car : పేరుకే బేస్​ వేరియంట్​- కానీ ఈ సెడాన్​లో తక్కువ ధరకే అన్ని ఫీచర్స్​!-2024 honda amaze base variant is it packed with enough value ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Base Variant Car : పేరుకే బేస్​ వేరియంట్​- కానీ ఈ సెడాన్​లో తక్కువ ధరకే అన్ని ఫీచర్స్​!

Best base variant car : పేరుకే బేస్​ వేరియంట్​- కానీ ఈ సెడాన్​లో తక్కువ ధరకే అన్ని ఫీచర్స్​!

Sharath Chitturi HT Telugu
Dec 08, 2024 10:31 AM IST

Honda Amaze base model features : తక్కువ బడ్జెట్​లో మంచి కారు కొనాలని చూస్తున్నారు? ఫీచర్స్​ మాత్రం ఎక్కువగా ఉండాలని భావిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హోండా అమేజ్​ ఫేస్​లిఫ్ట్​లోని వీ వేరియంట్​ ఫీచర్స్​, ధరతో పాటు మరిన్ని వివరాలను ఇక్కడ చూసేయండి..

హండా అమేజ్​ ఫేస్​లిఫ్ట్​..
హండా అమేజ్​ ఫేస్​లిఫ్ట్​..

హోండా కార్స్ ఇండియా తన సబ్ కాంపాక్ట్ సెడాన్ అమేజ్ ఫేస్​లిఫ్ట్​ని ఇటీవలే విడుదల చేసింది. 2024 హోండా అమేజ్ అప్డేటెడ్​ డిజైన్​తో పాటు పాత వర్షెన్​ కంటే మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుతుంది. ఈ మార్పులతో పాటు హోండా అమేజ్ ధర కూడా పెరిగింది. మునుపటి మోడల్ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ .7.19 లక్షలు కాగా, ఇప్పుడది రూ .8 లక్షలకు చేరింది. అయితే, ధర పెరుగుదలతో, కొత్త అమేజ్ కూడా చాలా అప్​గ్రేడ్​లను పొందుతుంది. అయితే హోండా అమేజ్​ బేస్​ వేరియంట్​ వాల్యూ ఫర్​ మనీ అవుతుందా? ఇందులో ఫీచర్స్​ ఏంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

yearly horoscope entry point

హోండా అమేజ్ వీ- ఫీచర్లు..

హోండా అమేజ్​ ఫేస్​లిఫ్ట్​ బేస్ వీ వేరియంట్​లో ప్లాస్టిక్ కవర్లతో కూడిన 14 ఇంచ్​ స్టీల్ వీల్స్, డీఆర్​ఎల్​తో కూడిన ఎల్​ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లైట్లు, ఎల్​ఈడీ టెయిల్ లైట్లు, షార్క్ ఫిన్ యాంటీనా, బాడీ కలర్ ఓఆర్​వీఎమ్​లు వంటి ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.

కొత్త మోడల్ లోపలి భాగంలో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్​ప్లే కూడిన 8-ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4 స్పీకర్ల సెట్, 7-ఇంచ్​ సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్​ప్లే, ఫ్యాబ్రిక్ అప్​హోలిస్టరీ, కప్ హోల్డర్లతో రేర్ ఆర్మ్​స్ట్, మాన్యువల్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, టిల్ట్ అడ్జెస్టెబుల్ స్టీరింగ్, ప్యాడిల్ షిఫ్టర్లు (సీవీటీలో మాత్రమే) ఉన్నాయి. కీలెస్ ఎంట్రీ, కీలెస్ రిలీజ్​తో ఎలక్ట్రిక్ ట్రంక్ లాక్, ప్రయాణీకులందరికీ ఎలక్ట్రిక్ పవర్ విండోస్ 6 ఎయిర్ బ్యాగులుస ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్​లు వంటివి ఉన్నాయి.

సేఫ్టీ కిట్​లో ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, డే/నైట్ ఐఆర్​వీఎమ్, రేర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

హోండా అమేజ్ వీ: ఇంజిన్..

2024 హోండా అమేజ్ అన్ని వేరియంట్లు 5-స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ గేర్ బాక్స్​తో కూడిన 1.2-లీటర్, 4-సిలిండర్ ఇంజిన్​ను ఉపయోగిస్తాయి. ఈ ఇంజిన్ గరిష్టంగా 89బీహెచ్​పీ పవర్, 110ఎన్ఎమ్ టార్క్​ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆసక్తికరంగా, 2024 అమేజ్ అన్ని ట్రిమ్ స్థాయిలలో మాన్యువల్ ట్రాన్స్​షన్, సీవీటీ రెండింటిని ఇస్తోంది.

మాన్యువల్ ట్రాన్స్​మిషన్ కలిగిన హోండా అమేజ్ విీ ధర రూ .8 లక్షలు (ఎక్స్-షోరూమ్). సీవీటీని కలిగి ఉన్న అమేజ్​ ధర రూ .9.2 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఇది.. పేరుకే బేస్​ వేరియంట్​! కానీ ఈ హోండా అమేజ్​ వీ వేరియంట్​ ఒక ఫీచర్​ లోడెడ్​ సెడాన్​ అని దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం