Yamaha MT 15 vs KTM 125 Duke : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో టూ వీలర్ బైక్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్ సంస్థలు కొత్త కొత్త లాంచ్‌లు, అప్డేటెడ్ వర్షెన్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో యమహా ఎంటీ 15, కేటీఎం 125 డ్యూక్ బైక్స్‌ను పోల్చి.. ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాము..
యమహా ఎంటీ 15 లుక్స్ చాలా యునీక్‌గా ఉంటాయి. ఇందుకు కారణంగా ఈ బైక్ స్టైలింగ్. బైక్ ఫ్రెంట్లో.. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో కూడిన సింగిల్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ సెటప్ ఉంటుంది. సింగిల్ ఎగ్జాస్ట్, మస్క్యులర్ ట్రాంక్ ష్రౌడ్స్ ఉన్నాయి. ఇక కేటీఎం 125 డ్యూక్.. 390 డ్యూక్‌కు మిని వర్షెన్లాగా కనిపిస్తుంది. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో కూడిన ఫ్లాట్ హాలిజెన్ హెడ్‌ల్యాంప్, షార్ప్ లుకింగ్ రేర్ ఎండ్ ఎగ్జాస్ట్ వంటివి ఉంటాయి.
Yamaha MT 15 on road price in Hyderabad : యమహా ఎంటీ 15లో 155 సీసీ, సింగిల్ సిలిండర్ లిక్వ్‌డ్ కూల్డ్ వీవీఏ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 10,000 ఆర్పీఎం వద్ద 18.4 బీహెచ్పీ పవర్‌ను, 7,500 ఆర్పీఎం వద్ద 14.1 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.
KTM 125 Duke on road price : ఇక కేటీఎం 125 డ్యూక్‌లో 124.7 సీసీ, సింగిల్ సిలిండర్, లిక్వ్‌డ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 9,250 ఆర్పీఎం వద్ద 14.3 బీహెచ్పీ పవర్‌ను, 8,000 ఆర్పీఎం వద్ద 12 బీహెచ్పీ పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.
Yamaha MT 15 features : యమహా ఎంటీ 15లో ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ కలస్టర్ ఉంటుంది. ఫ్యూయెల్ కన్జమ్షన్ ఇండికేటర్‌తో పాటు వివిధ ఆప్షన్స్ ఇందులో కనిపిస్తాయి. వీవీఏ ఇండికేటర్, షిఫ్ట్ టైమింగ్ లైట్, గేర్ పొజిషన్ ఇండికేటర్, టాకోమీడర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆల్ ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ సైతం దీని సొంతం.
ఇక కేటీఎం 125 డ్యూక్‌లో ఎల్సీడీ డిజిటల్ క్లస్టర్ ఉంటుంది. ఇందులోనూ వివిధ సమాచారాలు తెలుసుకోవచ్చు.
KTM 125 Duke on road price in Hyderabad : ఇండియా మార్కెట్లో యమహా ఎంటీ 15 ఎక్స్‌షోరూం ధర రూ. 1,68,400గా ఉంది. ఇక కేటీఎం 125 డ్యూక్ ఎక్స్‌షోరూం ధర రూ. 1,75,942గా ఉంది.