2023 Kawasaki Z H2, Z H2 SE: 2023 కవాసాకి జెడ్ హెచ్‍2, జెడ్ హెచ్‍2 ఎస్ఈ బైక్‍లు లాంచ్.. ధరలు ఎలా ఉన్నాయంటే!-2023 kawasaki z h2 2023 kawasaki z h2 se launched in india know price other full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  2023 Kawasaki Z H2 2023 Kawasaki Z H2 Se Launched In India Know Price Other Full Details

2023 Kawasaki Z H2, Z H2 SE: 2023 కవాసాకి జెడ్ హెచ్‍2, జెడ్ హెచ్‍2 ఎస్ఈ బైక్‍లు లాంచ్.. ధరలు ఎలా ఉన్నాయంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 11, 2023 08:04 AM IST

2023 Kawasaki Z H2, Z H2 SE: 2023 కవాసాకి జెడ్ హెచ్2, 2023 జెడ్ హెచ్2 ఎస్ఈ బైక్‍లు ఇండియాలో లాంచ్ అయ్యాయి. ప్రీమియమ్ రేంజ్‍లో ఈ ఫ్లాగ్‍షిప్ బైక్‍లు ఉన్నాయి.

2023 Kawasaki Z H2, Z H2 SE: 2023 కవాసాకి జెడ్ హెచ్‍2, జెడ్ హెచ్‍2 ఎస్ఈ  బైక్‍లు లాంచ్
2023 Kawasaki Z H2, Z H2 SE: 2023 కవాసాకి జెడ్ హెచ్‍2, జెడ్ హెచ్‍2 ఎస్ఈ బైక్‍లు లాంచ్

2023 Kawasaki Z H2, Z H2 SE: జెడ్ హెచ్2, జెడ్ హెచ్2 ఎస్ఈ బైక్‍లకు 2023 ఎడిషన్‍ను కవాసాకి (Kawasaki) లాంచ్ చేసింది. 2023 కవాసాకి జెడ్ హెచ్2 (2023 Kawasaki Z H2), 2023 కవాసాకి జెడ్ హెచ్2 ఎస్ఈ (2023 Kawasaki Z H2 SE) ఫ్లాగ్‍షిప్ నేక్డ్ బైక్‍లు భారత మార్కెట్‍లో అందుబాటులోకి వచ్చాయి. మెటాలిక్ మ్యాట్ గ్రాఫైట్ గ్రే కలర్‌లో ఈ బైక్‍లు విడుదలయ్యాయి. ప్రస్తుత మోడళ్లతో పోలిస్తే 2023 వెర్షన్ బైక్‍లకు ఇది మేజర్ మార్పుగా ఉంది. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

పవర్‌ఫుల్ ఇంజిన్‍తో..

2023 Kawasaki Z H2, Z H2 SE: ఇంజిన్, పర్ఫార్మెన్స్ పరంగా ప్రస్తుత వెర్షన్‍లాగే 2023 కవాసాకి జెడ్ హెచ్2, కవాసాకి జెడ్ హెచ్2 ఎస్ఈ బైక్‍లు ఉన్నాయి. 998cc ఇన్‍లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, సూపర్ చార్జ్డ్ ఇంజిన్‍ను ఈ బైక్‍లు కలిగి ఉన్నాయి. 11,000 rpm వద్ద 197 బీహెచ్‍పీ గరిష్ఠ పవర్‌ను, 8,500 rpm వద్ద 137 Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ జనరేట్ చేస్తుంది. 0 నుంచి 100 kmph వేగానికి ఈ బైక్‍లు 3 సెకన్లలోనే యాక్సలరేట్ అవుతాయి.

హార్డ్‌వేర్ పరంగానూ ఈ బైక్‍లు ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లతోనే ఉన్నాయి. జెడ్ హెచ్‍2 బైక్‍కు బ్రెంబో ఎం.432 ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్, జెడ్ హెచ్‍2 ఎస్ఈ బైక్‍కు బ్రెంబో స్టైలెమా ఫ్రంట్ బ్రేక్స్ ప్రత్యేకతగా ఉన్నాయి.

2023 Kawasaki Z H2, 2023 Kawasaki Z H2 SE: ఫీచర్లు

ఎలక్ట్రానిక్ క్రూజ్ కంట్రోల్, థ్రాటిల్ వాల్వ్స్, రైడింగ్ మోడ్స్, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఉండే డిజిటల్ ఇన్‍స్ట్రుమెంట్ కన్సోల్‍ను ఈ 2023 కవాసాకి జెడ్ హెచ్2, కవాసాకి జెడ్ హెచ్2 ఎస్ఈ బైక్‍లు కలిగి ఉన్నాయి. రైడియాలజీ యాప్ ద్వారా ఫోన్‍ను ఈ బైక్‍లకు కనెక్ట్ చేసుకోవచ్చు. క్విక్ షిఫ్టర్, ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్, లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ మెజర్‌మెంట్ ఫంక్షన్, ట్రాక్షన్ కంట్రోల్, కవాసాకి ఇంటెలిజెంట్ యాంటీ లాక్ బ్రేక్స్ సదుపాయాలను 2023 కవాసాకి జెడ్ హెచ్2 కలిగి ఉంది. ఈ ఫీచర్లకు అదనంగా షైహూక్ టెక్నాలతో కూడిన కవాసాకి ఎలక్ట్రానిక్ కంట్రోల్ సస్పెన్షన్‍తో జెడ్ హెచ్‍2 ఎస్ఈ వస్తోంది. ట్విన్ ఎల్ఈడీ హెచ్‍ల్యాంప్స్ ఉంటాయి.

2023 కవాసాకి జెడ్ హెచ్2, జెడ్ హెచ్2 ఎస్ఈ ధర

2023 Kawasaki Z H2, Z H2 SE: 2023 కవాసాకి జెడ్ హెచ్2 బైక్ ధర రూ.23.02లక్షలుగా ఉంది. 2023 కవాసాకి జెడ్ హెచ్2 ఎస్ఈ ధర రూ.27.22 లక్షలుగా ఉంది. ఇండియాలో ఇప్పటికే ఈ బైక్‍ల బుకింగ్స్ మొదలయ్యాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్