2023 Hyundai i20 : హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర ఎంతంటే..!-2023 hyundai i20 launched check latest features price and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2023 Hyundai I20 : హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర ఎంతంటే..!

2023 Hyundai i20 : హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర ఎంతంటే..!

Sharath Chitturi HT Telugu
Published Sep 08, 2023 12:23 PM IST

2023 Hyundai i20 : హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ లాంచ్​ అయ్యింది. ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2023 హ్యుందాయ్​ ఐ20 లాంచ్​..
2023 హ్యుందాయ్​ ఐ20 లాంచ్​..

2023 Hyundai i20 : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో హ్యుందాయ్​ ఐ20కి డీసెంట్​ డిమాండ్​ ఉంది. ఇక ఇప్పుడు.. ఈ హ్యాచ్​బ్యాక్​ మోడల్​కు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను తీసుకొచ్చింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. 2023 హ్యుందాయ్​ ఐ20ని తాజాగా లాంచ్​ చేసింది. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఫీచర్స్​, సేఫ్టీ వివరాలు..

హ్యందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో సేఫ్టీకి పెద్దపీట వేసింది సంస్థ. ఇందులో 6 ఎయిర్​బ్యాగ్స్​, ఎలక్ట్రానిక్​ స్టెబులిటీ కంట్రోల్​, హిల్​ అసిస్ట్​ కంట్రోల్​, వెహికిల్​ స్టెబులిటీ మేనేజ్​మెంట్​, యాంటీలాక్​ బ్రేకింగ్​ సిస్టెమ్​, ఎలక్ట్రానిక్​ బ్రేక్​ డిస్ట్రిబ్యూషన్​ వంటివి అన్ని వేరియంట్లకు స్టాండర్డ్​గా వస్తున్నాయి.

Hyundai i20 facelift price : ఇక ఈ హ్యాచ్​బ్యాక్​ మోడల్​ కేబిన్​ విషయానికొస్తే.. డ్యూయెల్​ టోన్​ గ్రే- బ్లాక్​ కలర్​ వస్తోంది. యాంబియెంట్​ లైటింగ్​, బాస్​ సౌండ్​ సిస్టెమ్​, రీడిజైన్డ్​ కీ, సెమీ-లెథరెట్​ సీట్స్​, లెథరెట్​ డోర్​ ఆర్మ్​రెస్ట్స్​, లెథర్​ వ్రాప్​డ్​ డీ-కట్​ స్టీరింగ్​ వీల్​ వంటివి లభిస్తున్నాయి. ఈ మోడల్​లోని ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​లో 60కిపైగా కెనెక్టెడ్​ కార్​ ఫీచర్స్​, 127 ఎంబెడెడ్​ వీఆర్​ కమండ్స్​, 52 హింగ్లీష్​ వాయిస్​ కమాండ్స్​​, ఒవర్​-ది-ఎయిర్​ అప్డేట్స్​, టైప్​-సీ ఛార్జర్​లు ఉంటాయి.

ఇదీ చూడండి:- Tata Nexon EV facelift : సరికొత్తగా టాటా నెక్సాన్​ ఈవీ- ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో భారీ మార్పులు..

ఇక ఈ 2023 హ్యందాయ్​ ఐ20లో 1.2 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 82 బీహెచ్​పీ పవర్​ను జనరట్​ చస్తుంది. మేన్యువల్​, ఐవీటీ ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ సెటప్​ ఉంటుంది. ఐడిల్​ స్టాప్​-గో ఫీచర్​ కూడా లభిస్తోంది. అయితే.. ఈసారి టర్బో-పెట్రోల్​ వేరియంట్​ను సంస్థ డిస్కంటిన్యూ చేసేసింది.

2023 Hyundai i20 facelift : ఇక కాస్మొటిక్స్​ విషయానికొస్తే.. ఈ హ్యాచ్​బ్యాక్​లో బంపర్​ను పూర్తిగా రీడిజైన్​ చేసింది హ్యుందాయ్​ సంస్థ. ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ ల్యాంప్స్​తో కూడిన ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​ వస్తున్నాయి. 16ఇంచ్​ అలాయ్​ వీల్స్​ కొత్తగా ఉన్నాయి.

ఈ మోడల్​ ధర ఎంత..?

ఈ హ్యందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ ఎక్స్​షోరూం ధర రూ. 6.99లక్షలు- రూ. 11.1లక్షల మధ్యలో ఉంటుంది. బుకింగ్స్​ ఓపెన్​ అయ్యాయి. అంతేకాకుండా.. 1లక్ష కి.మీలు లేదా 3ఏళ్ల ఎక్స్​టెండెడ్​ వారెంటీని కూడా ఇస్తోంది హ్యుందాయ్​ మోటార్స్​.

Whats_app_banner

సంబంధిత కథనం