Muhurat Trading : ముహురత్​ ట్రేడింగ్​ అంటే ఏంటి? ఈసారి టైమింగ్స్​ ఎప్పుడు?-2022 stock market to open for muhurat trading tomorrow check timings ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Muhurat Trading : ముహురత్​ ట్రేడింగ్​ అంటే ఏంటి? ఈసారి టైమింగ్స్​ ఎప్పుడు?

Muhurat Trading : ముహురత్​ ట్రేడింగ్​ అంటే ఏంటి? ఈసారి టైమింగ్స్​ ఎప్పుడు?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 23, 2022 06:19 PM IST

Muhurat Trading 2022 time : దీపావళి సందర్భంగా సోమవారం ముహురత్​ ట్రేడింగ్​ జరగనుంది. ఇంతకి అసలు ముహురత్​ ట్రేడింగ్​ అంటే ఏంటి? ఈసారి టైమింగ్స్​ ఏంటి?

ముహురత్​ ట్రేడింగ్​ అంటే ఏంటి? ఈసారి టైమింగ్స్​ ఏంటి?
ముహురత్​ ట్రేడింగ్​ అంటే ఏంటి? ఈసారి టైమింగ్స్​ ఏంటి?

Muhurat Trading 2022 time : సాధారణంగా పండుగ వేళ.. దేశీయ స్టాక్​ మార్కెట్లకు సెలవు ఉంటుంది. కానీ దీపావళికి అలా కాదు. ప్రతి దీపావళికి ముహురత్​ ట్రేడింగ్​ జరుగుతుంది. ముహురత్​ ట్రేడింగ్​ కోసం మదుపర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈరోజు కొన్న స్టాక్స్​.. తమకు మంచి లాభాలను తెచ్చిపెడతాయని భావిస్తారు. అయితే ముహురత్​ ట్రేడింగ్​ టైమింగ్స్​ వేరుగా ఉంటాయి. ఆ వివరాలు తెలుసుకుందాము..

ముహురత్​ ట్రేడింగ్​ అంటే ఏంటి?

ముహురత్​ ట్రేడింగ్​తో కొత్త 'సంవత్​' ప్రారంభమవుతుంది. భారత దేశ పురాణాల ప్రకారం.. సంవత్​ రోజు నుంచి కొత్త క్యాలెండర్​ మొదలవుతుంది. సాధారణ క్యాలెండర్​ కన్నా ఈ సంవత్​ క్యాలెండర్​ 56.7ఏళ్లు ముందు ఉంటుంది. అందుకే ఈసారి 2079 సంవత్​ వస్తోంది. ఈరోజున ఏదైనా మంచి పని చేస్తే అద్భుతమైన ప్రతిఫలం ఉంటుంది. అందుకే.. సంవత్​ రోజున వ్యాపారులు తమ అకౌంట్​ బుక్స్​ను తీస్తారు.

what is Muhurat trading : దీపావళి రోజున లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు రావాలని ప్రార్థిస్తారు. ట్రేడింగ్​లో కూడా ఇంతే! అందుకే.. ముహురత్​ ట్రేడింగ్​కు ముందు.. లక్ష్మీదేవికి పూజలు చేసి, స్టాక్స్​ కొంటూ ఉంటారు.

బీఎస్​ఈలో ముహురత్​ ట్రేడింగ్​ ఆనవాయితీ 1957లో మొదలైంది. ఇక ఎన్​ఎస్​ఈలో 1992 నుంచి ముహురత్​ ట్రేడింగ్​ జరుగుతోంది.

ముహురత్​ ట్రేడింగ్​ సందర్భంగా.. వివిధ బ్రోకరేజీ సంస్థలు తమ ‘స్టాక్స్​ టు బై’ లిస్ట్​ను ప్రకటిస్తూ ఉంటాయి. వచ్చే దీపావళి వరకు ఏ స్టాక్స్​ రాణించే అవకాశం ఉంటుంది అనేది ఈ లిస్ట్​ ద్వారా తెలుసుకోవచ్చు.

ముహురత్​ ట్రేడింగ్​లో కొనుగోలు చేసేందుకు.. నిపుణులు సూచిస్తున్న బ్యాంకింగ్​ స్టాక్స్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సోమవారంతో సంవత్​ 2079 ప్రారంభమవుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంవైపు పరుగులు పెడుతుండటంతో.. స్టాక్​ మార్కెట్లు కూడా దీర్ఘకాలంలో రాణిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ముహురత్​ ట్రేడింగ్​ ఎప్పుడు?

Muhurat trading 2022 : దీపావళి రోజున.. ఈక్విటీ, డెరివేటివ్​ సెగ్మెంట్​లు సాయంత్రం 6:15 నుంచి ప్రారంభమవుతుంది. గంట తర్వాత 7:15తో ముగుస్తుంది. అయితే.. 6-6:08 వరకు ప్రీ మార్కెట్​ సెషన్​ ఉంటుంది.

సాధారణంగా ముహురత్​ ట్రేడింగ్​లో ఎఫ్​ఐఐలు పాల్గొనరు. ఫలితంగా స్టాక్స్​ కదలికలు చాలా తక్కువగా ఉంటాయి.

2078 సంవత్​..

2078 సంవత్​లో స్టాక్​ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. చివరికి నష్టాల్లో ముగిశాయి. తొలుత జనవరిలో ఒమిక్రాన్​ వేవ్​ భయపెట్టింది. ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్​ యుద్ధంతో మార్కెట్లు డీలాపడ్డాయి. అప్పటి నుంచి ద్రవ్యోల్బణం ప్రమాదకరంగా మారింది. భయాలు మదుపర్లను వెంటాడాయి. ఆ తర్వాత.. వడ్డీ రేట్ల పెంపు వార్తలు స్టాక్​ మార్కెట్లను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

అయితే ప్రపంచ స్టాక్​ మార్కెట్లతో పోల్చుకుంటే దేశీయ మార్కెట్ల పరిస్థితి మెరుగ్గానే ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం