150cc To 200cc Bikes : దేశంలో 150సీసీ నుంచి 200సీసీ బైకులకు డిమాండ్.. నవంబర్‌లో ఇందులో ఏది టాప్?
150cc To 200cc Bikes : దేశంలో ద్విచక్ర వాహన విభాగంలో అత్యధిక డిమాండ్ ఉన్న మోటార్ సైకిళ్లలో 150 సీసీ నుంచి 200 సీసీ వరకు మోడళ్లు ఉన్నాయి. గత నెలలో అంటే నవంబర్ 2024లో ఈ విభాగంలో అత్యధిక డిమాండ్ ఉన్న మోడళ్ల జాబితాను వెల్లడించింది.
భారత్‌లో 150 సీసీ నుంచి 200 సీసీ మోడళ్లకు ఎక్కువగా డిమాడ్ ఉన్నాయి. నవంబర్ 2024లో ఈ విభాగంలో అత్యధిక డిమాండ్ ఉన్న మోడళ్ల లిస్ట్ వచ్చింది. టాప్ -15 మోడళ్లలో టీవీఎస్ అపాచీ అగ్రస్థానంలో ఉంది. అయితే ఈ మోటార్ సైకిల్ వార్షిక ప్రాతిపదికన క్షీణతను ఎదుర్కొంది. వీటితో పాటు బజాజ్ పల్సర్, హోండా యూనికార్న్ వంటి మోడళ్లు కూడా ఆధిపత్యం చెలాయించాయి.
టీవీఎస్ అపాచీ 2024 నవంబర్‌లో 35,610 యూనిట్లను విక్రయించింది. 2023 నవంబర్‌లో 41,025 యూనిట్లను విక్రయించింది. అంటే 5,415 యూనిట్లు తక్కువగా విక్రయించి 13.2 శాతం క్షీణతను సాధించింది. బజాజ్ పల్సర్ 2024 నవంబర్‌లో 32,997 యూనిట్లను విక్రయించింది. 2023 నవంబర్‌లో 47,320 యూనిట్ల అమ్మకాలు చేసింది. అంటే 14,323 యూనిట్లు తక్కువగా విక్రయించి 30.27 శాతం క్షీణించింది. హోండా యూనికార్న్ 2024 నవంబర్‌లో 30,678 యూనిట్లను విక్రయించగా.. 2023 నవంబర్లో 20,146 యూనిట్లను అమ్మకాలు చేసింది. అంటే 10,532 యూనిట్లు అధికంగా విక్రయించి 52.28 శాతం వార్షిక వృద్ధిని సాధించింది.
యమహా ఎఫ్‌జెడ్ 2024 నవంబర్‌లో 14,406 యూనిట్లను విక్రయించింది. 2023 నవంబర్‌లో 16,233 యూనిట్లను విక్రయించింది. 1,827 యూనిట్లు తక్కువగా విక్రయించి 11.25 శాతం వార్షిక క్షీణతను ఎదుర్కోంది. యమహా ఎమ్‌టీ 15 నవంబర్ 2024లో 9,894 యూనిట్లను విక్రయించగా.. 2023 నవంబర్లో 9,140 యూనిట్లను విక్రయించింది. 754 యూనిట్లు అధికంగా విక్రయించి 8.25 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. యమహా ఆర్ 15 నవంబర్ 2024లో 7,105 యూనిట్లను విక్రయించగా.. అదే సమయంలో 2023 నవంబర్‌లో 11,270 యూనిట్లను అమ్మకాలు చేసింది. 4,165 యూనిట్లు తక్కువగా విక్రయించి 36.96 శాతం వార్షిక క్షీణతను సాధించింది.
హోండా ఎస్‌పీ 160 నవంబర్ 2024లో 4,453 యూనిట్లను విక్రయించింది. 2023 నవంబర్‌లో 7,310 యూనిట్లను అమ్మకాలు చేసింది. ఏడాదిలో చూసుకుంటే.. 2,857 యూనిట్లు తక్కువగా విక్రయించి 39.08 శాతం క్షీణించింది. కేటీఎమ్ 200 నవంబర్ 2024లో 2,726 యూనిట్లను విక్రయించింది. 2023 నవంబర్‌లో 2,777 యూనిట్లను విక్రయించింది. అంటే 51 యూనిట్లు తక్కువగా విక్రయించి వార్షికంగా 1.84 శాతం క్షీణతను సాధించింది. హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 2024 నవంబర్‌లో 2,493 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023 నవంబర్లో 2,655 యూనిట్లను విక్రయించింది. అంటే 162 యూనిట్లు అధికంగా విక్రయించి 6.1 శాతం వార్షిక వృద్ధిని సాధించింది.
హీరో ఎక్స్ పల్స్ 200 నవంబర్ 2024లో 1,933 యూనిట్లను అమ్మింది. 2023 నవంబర్లో 1,453 యూనిట్లను విక్రయించింది. 480 యూనిట్లు అధికంగా విక్రయించి 33.04 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. బజాజ్ అవెంజర్ 2024 నవంబర్‌లో 1,024 యూనిట్లను విక్రయించగా.. 2023 నవంబర్లో 1,369 యూనిట్లను విక్రయించింది. 345 యూనిట్లు తక్కువగా విక్రయించి వార్షికంగా 25.2 శాతం క్షీణతను సాధించింది. హోండా సీబీ200 ఎక్స్ నవంబర్ 2024లో 941 యూనిట్లను విక్రయించింది. 2023 నవంబర్‌లో 1,240 యూనిట్లు అమ్ముడయ్యాయి. 299 యూనిట్లు తక్కువగా విక్రయించి 24.11 శాతం క్షీణించింది.
హోండా హార్నెట్ 2.0 2024 నవంబర్‌లో 910 యూనిట్లను విక్రయించగా.. 2023 నవంబర్లో 3,214 యూనిట్లను విక్రయించింది. 2,304 యూనిట్లు తక్కువగా విక్రయించి 71.69 శాతం క్షీణించింది. సుజుకి జిక్సర్ 2024 నవంబర్‌లో 728 యూనిట్లను విక్రయించింది. 2023 నవంబర్‌లో 1,648 యూనిట్ల అమ్మకాలు చేసింది. 920 యూనిట్లు తక్కువగా విక్రయించి 55.83 శాతం క్షీణత ఎదుర్కోంది. కవాసాకి డబ్ల్యూ 175 నవంబర్ 2024లో 70 యూనిట్లను విక్రయించింది. 2023 నవంబర్‌లో 3 యూనిట్లను విక్రయించింది. 67 యూనిట్లు అధికంగా అమ్మకాలు చేసింది.