Multibagger penny stock : రెండేళ్లల్లో.. రూ. 1లక్షను రూ. 3.4కోట్లుగా మార్చిన స్టాక్!
Multibagger penny stock : రాజ్ రేయన్ ఇండస్ట్రీస్ షేరు.. రెండేళ్లల్లో రూ. 1లక్షను ఏకంగా రూ. 3.46కోట్లుగా మార్చేసింది. పూర్తి వివరాలు..
Multibagger penny stock : స్టాక్ మార్కెట్లో మల్టీబ్యాగర్ స్టాక్స్‌కు మంచి డిమాండ్ ఉంటుంది! అనేకమంది మదుపర్లు మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ఒక్క స్టాక్ తగిలినా.. లైఫ్ సెట్ అని భావిస్తుంటారు. ఈ విషయంలో కాస్త రిస్క్ ఎక్కువగా ఉన్నా.. మదుపర్ల ఆలోచనలు నిజమే! అందుకు ఉదాహరణ.. రాజ్ రేయన్ ఇండస్ట్రీస్ స్టాక్. ఈ పెన్నీ స్టాక్.. రూ. 1లక్షను రెండేళ్లల్లోనే ఏకంగా రూ. 3.46కోట్లుగా మార్చేసింది.
ట్రెండింగ్ వార్తలు
రాజ్ రేయన్ ఇండస్ట్రీస్ షేర్లు..
Raj Rayon share price history : రెండేళ్లల్లో ఈ రాజ్ రేయన్ ఇండస్ట్రీస్ పెన్నీ షేరు ధర రూ. 0.20 నుంచి రూ. 69.20కు పెరిగింది. అంటే మదుపర్లకు ఏకంగా 3,45,000శాతం రిటర్నులు తెచ్చిపెట్టినట్టు!
గత నెల రోజులుగా ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ ధర 10శాతం పడింది. కానీ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 85శాతం రిటర్నులు ఇచ్చింది. రూ. 36.9 నుంచి రూ. 69.2కు పెరిగింది. ఇక గత ఆరు నెలల్లో ఈ రాజ్ రేయన్ ఇండస్ట్రీస్ స్టాక్ రూ. 16.20 నుంచి రూ. 69.20కి చేరింది. అంటే మదుపర్లు ఏకంగా 325శాతం రిటర్నులు అందుకున్నట్టు. ఏడాది కాలంలో ఈ స్టాక్ రూ. 1.65 నుంచి రూ. 69.20కి వృద్ధిచెందడం విశేషం. 4,100శాతం పెరిగినట్టు! ఇక రెండేళ్ల క్రితం రూ. 0.20 వద్ద ఉన్న స్టాక్.. 3,45,000శాతం పెరిగి రూ. 69.20కి చేరింది. రెండేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసిన వారికి సంతోషాన్నిచ్చింది.
Raj Rayon Industries share price : వాస్తవానికి ఈ స్టాక్ 52 వీక్ హై రూ. 89.75. ఈ ఏడాది మార్చ్‌లో ఆల్ టైమ్ హైని తాకింది. అక్కడి నుంచి రూ. 69.20 (శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగింపు)కి చేరింది.
రూ. 1లక్ష = రూ. 3.46కోట్లు..!
రాజ్ రేయన్ ఇండస్ట్రీస్ పెన్నీ స్టాక్‌లో నెల రోజుల ముందు రూ. 1లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. దాని విలువ ఇప్పుడు రూ. 90వేలుగా ఉండేది. కానీ ఈ ఏడాది తొలినాళ్లల్లో రూ. 1లక్ష పెట్టి ఉంటే, దాని విలువ ఇప్పుడు రూ. 1.85లక్షలుగా మారేది. మరోవైపు ఆరు నెలల క్రితం చేసిన రూ. 1లక్ష ఇన్వెస్ట్మెంట్.. ఇప్పుడు రూ. 4.25లక్షలకు చేరేది. రాజ్ రేయన్ ఇండస్ట్రీస్ షేరులో ఏడాది క్రితం రూ. 1లక్ష పెట్టి ఉంటే.. దాని విలువ ఇప్పుడు రూ. 42లక్షలకు పెరిగేది.
Raj Rayon Industries stock news : అదే విధంగా.. రెండేళ్ల క్రితం ఈరాజ్ రేయన్ ఇండస్ట్రీస్ పెన్నీ స్టాక్‌లో రూ. 1లక్ష పెట్టి ఉంటే.. అది కాస్త ఇప్పుడు రూ. 3.46కోట్లుగా మారేది.
(ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. పెన్నీ స్టాక్స్ అంటే అత్యంత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు మీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్‌ను సంప్రదించడం శ్రేయస్కరం.)