Liquor Scam Magunta :తన కొడుకు తప్పు చేయలేదంటున్న ఎంపీ మాగుంట-ysrcp mp magunta srinivasulu reddy says his son raghav didnt done any wrong in liquor scam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ysrcp Mp Magunta Srinivasulu Reddy Says His Son Raghav Didnt Done Any Wrong In Liquor Scam

Liquor Scam Magunta :తన కొడుకు తప్పు చేయలేదంటున్న ఎంపీ మాగుంట

HT Telugu Desk HT Telugu
Feb 24, 2023 01:24 PM IST

Liquor Scam Magunta ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టైన మాగుంట రాఘవ్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని, న్యాయస్థానంలో నిర్దోషిగా బయటకు వస్తారనే విశ్వాసం తమకుందని వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి చెప్పారు.

లిక్కర్ స్కాం వ్యవహారంలో తన పాత్ర లేదంటున్న ఎంపీ మాగుంట
లిక్కర్ స్కాం వ్యవహారంలో తన పాత్ర లేదంటున్న ఎంపీ మాగుంట

Liquor Scam Magunta ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదని ఎంపీ మాగుంట చెప్పారు. 70ఏళ్లుగా తమ కుటుంబం వ్యాపారాల్లో ఉందని, తాను 50ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నానని, తమ కుటుంబ వ్యాపారాలు దేశంలోని పది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

మద్యం పాలసీ వ్యవహారంలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి స్పష్టం చేశారు. తన తండ్రి స్థాపించిన వ్యాపారం 70 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇదే తరహా వ్యాపారాలను పది రాష్ట్రాల్లో చేస్తూ నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఏ రాష్ట్రంలో కూడా వ్యాపారాలు చేసే క్రమంలో ఎలాంటి తప్పులు తాము చేయలేదని చెప్పారు. ఢిల్లీలో కూడా తప్పు చేయలేదన్నారు. రాఘవరెడ్డిని కోర్టులో కలిసినప్పుడు, పెదనాన్న సుబ్బరామిరెడ్డి పేరుకు అప్రతిష్ట పాలు చేయనని, తనకు తలవంపులు వచ్చే పని కూడా చేయనని కుమారుడు చెప్పాడన్నారు. తన కుమారుడు మీద నమ్మకం ఉందని, రాఘవరెడ్డి ఎక్కడా తప్పు చేయలేదన్నారు.

అతను ధైర్యంగా ఉన్నాడని, తమను కూడా ధైర్యంగా ఉండమని చెప్పాడని, భరోసాతో గట్టిగా చెబుతున్నప్పుడు అనిపించిందన్నారు. తాను రాజకీయాలలోకి వచ్చి 32 సంవత్సరాలని, ుబ్బారామరెడ్డి గారు నాకు రాజకీయ జీవితం ప్రసాదించిన తర్వాత,ఎటువంటి తప్పులు రాజకీయంలో కూడా చేయకుండా సజావుగా సాగిపోతున్నామన్నారు.

ఫిబ్రవరి 11న అరెస్ట్….

ఢిల్లీ లిక్కర్ కేసులో రోజుకో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు ఛార్జ్ షీట్లలో పలువురి పేర్లను ప్రస్తావించిన ఈడీ… మరోవైపు అరెస్ట్ ల పర్వం కొసాగిస్తోంది. ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఫిబ్రవరి 11 అరెస్ట్ చేసింది. ఈ కేసులో బాలాజీ గ్రూప్ కూడా పేరు ఉండగా.. దీనికి రాఘవ యజమానిగా ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత చార్టెడ్ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చి బాబును కూడా అరెస్ట్ చేసింది ఈడీ. తాజాగా ఎంపీ కుమారుడిని అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది.

గత ఏడాది ఆగష్టు చివర్లో ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం వెలుగు చూసిన తర్వాత సిబిఐ ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో పలువురిని ప్రశ్నించే క్రమంలో హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే కవితకు వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేస్తున్న గోరంట్ల బుచ్చిబాబు పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసింది ఈడీ.

ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో గత వారంలో సిబిఐ దాఖలు చేసిన అభియోగాల్లో ఎమ్మెల్సీ కవితతో పాటు ఏపీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పేరిట చక్రం తిప్పడంలో పలువురు ప్రముఖులు కీలక పాత్ర పోషించారని, వ్యాపార ప్రయోజనాలు పొందడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జీషీట్లలో పలువురి పేర్లను ప్రధానంగా ప్రస్తావించింది.

ఇదే కేసుకు సంబంధించి తాజాగా ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం గురించి ప్రస్తావించింది. ఇక నిందితుల జాబితాలో మాత్రం 17 మంది పేర్లను పేర్కొంది. ఇందులో అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా, విజయ్ నాయర్, బినోయ్ బాబుతో పాటు పలువురి పేర్లను వెల్లడించింది.ఈడీ దాఖలు చేసిన ఈ సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. ఈ కేసులోని నిందితులకు నోటీసులు కూడా జారీ చేసింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్