Srikakulam : ఏపీ రాజకీయాల్లో బసవ రమణ బాంబ్.. ఆర్మీ ఉద్యోగాల పేరుతో గలీజ్ దందాలు : వైఎస్సార్సీపీ-ysrcp made sensational allegations against indian army calling founder basava ramana ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Srikakulam : ఏపీ రాజకీయాల్లో బసవ రమణ బాంబ్.. ఆర్మీ ఉద్యోగాల పేరుతో గలీజ్ దందాలు : వైఎస్సార్సీపీ

Srikakulam : ఏపీ రాజకీయాల్లో బసవ రమణ బాంబ్.. ఆర్మీ ఉద్యోగాల పేరుతో గలీజ్ దందాలు : వైఎస్సార్సీపీ

Basani Shiva Kumar HT Telugu
Dec 06, 2024 02:21 PM IST

Srikakulam : ఆంధ్రా రాజకీయాల్లో మరో అంశం సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ వ్యవస్థాపకుడి ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ సంచలన ఆరోపణలు చేసింది. బసవ రమణ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి అనుచరుడని ఆరోపించింది.

రామ్మోహన్ నాయుడుతో బసవ రమణ
రామ్మోహన్ నాయుడుతో బసవ రమణ

ఇండియన్ ఆర్మీ కాలింగ్ వ్యవస్థాపకుడు బసవ రమణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఆర్మీ కాలింగ్ సెంటర్ పేరుతో విద్యార్థులను చిత్ర హింసలకు గురిచేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. తాజాగా ఈ అంశంపై వైఎస్సార్సీపీ సంచలన ఆరోపణలు చేసింది.

yearly horoscope entry point

వైసీపీ ట్వీట్ ఇలా..

'శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలు. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్‌ను స్థాపించి.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ.. ఒక్కొకరి దగ్గర నుంచి రూ.5-10 లక్షల వరకూ బసవ రమణ వసూళ్లకు పాల్పడ్డాడు. శిక్షణ పేరుతో సెంటర్‌కి వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేశాడు. వాటిని అడ్డుపెట్టుకుని స్నేహితులతో కలిసి అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తున్నాడు' అని వైసీపీ ఆరోపించింది.

'బసవ రమణ వీడియోలు తీస్తున్న విషయాన్ని అమ్మాయిల ఇంట్లో చెప్పిన నలుగురు కుర్రాళ్లని బంధించి.. చిత్రహంసలకు గురిచేశాడు. శ్రీకాకుళంలో మంత్రి రామ్మోహన్ నాయుడు పేరు చెప్పి.. బసవ రమణ దందాలు చేస్తున్నాడు. షాపింగ్ మాల్స్‌, బార్స్‌కి వెళ్లి బిల్లులు చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఇలా దుర్మార్గాలకి పాల్పడుతున్నాడు. అయినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్‌‌కి సన్నిహితుడు. పాలన చేతగాకపోతే.. ఊరూరా ఇలాంటి దుర్మార్గులే రాజ్యమేలుతారు.. అనే దానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా చంద్రబాబు?' అని వైసీపీ ట్వీట్ చేసింది.

నిరుద్యోగ యువతను కోచింగ్ సెంటర్‌లో జాయిన్ చేయించుకొని.. వేధింపులకు గురిచేస్తున్న రమణ అరాచకాలు వెలుగులోకి చూస్తున్నాయి. ఉచితంగా ట్రైనింగ్ ఇస్తామని చెప్పి అభ్యర్థులను ఇబ్బందులు పెడుతున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వెంకట రమణ పేరుకే కోచింగ్ ఉచితమని ప్రకటనలు చేస్తారని.. అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తారని టాక్ ఉంది. తన సొంత పనులు అభ్యర్థులతో చేయించుకుంటారని అంటున్నారు.

Whats_app_banner