YSRCP : తడిగుడ్డతో గొంతులు కోసే రకం చంద్రబాబు.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు-ysrcp leader ambati rambabu sensational comments on chief minister chandrababu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp : తడిగుడ్డతో గొంతులు కోసే రకం చంద్రబాబు.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

YSRCP : తడిగుడ్డతో గొంతులు కోసే రకం చంద్రబాబు.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

Basani Shiva Kumar HT Telugu
Jan 02, 2025 09:24 PM IST

YSRCP : సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు తడిగుడ్డతో గొంతులు కోసే రకం అని వ్యాఖ్యానించారు. జగన్‌పై తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో.. కక్ష సాధింపు తప్ప అభివృద్ధి, సంక్షేమం లేదని విమర్శలు గుప్పించారు.

అంబటి రాంబాబు
అంబటి రాంబాబు

జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పు చేసిందని చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు చెప్పారని.. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల అప్పు కూడా చేయలేదని తేలిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ పైనా ఇదే తప్పుడు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ భవనాల రంగులకు రూ.4 వేల కోట్లు అని ప్రచారం చేశారని.. ఇప్పుడు వంద కోట్లు మాత్రమే ఖర్చు అయిందని లెక్క చెబుతున్నారని అన్నారు.

yearly horoscope entry point

జగన్‌‌పై అభాండాలు..

'అప్పులు చేసి రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని జగన్‌‌పై అభాండాలు వేశారు. వచ్చిన ఆరు నెలల్లోనే లక్ష కోట్లు పైన అప్పు చేశారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా.. తాను మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో ఒక్కటి కూడా ఆచరించని విశ్వాసఘాతకుడు చంద్రబాబు. విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. చంద్రబాబు మాటలకు అర్థాలే వేరు' అని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

బ్రీఫ్డ్‌ మీ అంటూ..

'కక్షసాధింపు లేదని చంద్రబాబు అన్నాడంటే కక్ష ఉందని అర్థం. విశ్వసనీయత అని చంద్రబాబు నాయుడు అన్నాడంటే.. బాబు లాంటి విశ్వాసఘాతకుడు ఈ దేశ రాజకీయాల్లో ఎవ్వరూ లేరని అర్థం. ఒక్క ఎమ్మెల్సీని కొనడానికి బ్రీఫ్డ్‌ మీ అంటూ లైవ్‌లో దొరికిపోయారు చంద్రబాబు. అయినా బుకాయించి, వ్యవస్థలను మేనేజ్ చేసి బయటకు వచ్చాడు' అని అంబటి రాంబాబు ఆరోపించారు.

ఐపీఎస్‌ల మీద కక్ష..

'చంద్రబాబు ఆరు మాసాల పాలనలో.. కక్ష సాధింపు తప్ప అభివృద్ధి, సంక్షేమమే లేదు. పూర్తయిన మంగళగిరి వైసీపీ ఆఫీసును అర్థరాత్రి కూలగొట్టడం కక్ష సాధింపు కాదా? అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు ఉన్న జగన్ పేరును అర్థరాత్రి వెళ్లి ధ్వంసం చేశారు. వైసీపీ కార్యకర్తలపై దాడులతో, తప్పుడు కేసులతో కక్ష సాధింపులకు పాల్పడ్డారు. ఐపీఎస్‌ల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇదేం పాలన. తడిగుడ్డతో గొంతులు కోసే రకం చంద్రబాబు' అని మాజీమంత్రి ప్రశ్నించారు.

లడ్డూలా దొరికిందా..

'జగన్‌పై చర్య తీసుకునేందుకు సెకీ వ్యవహారం లడ్డూలా దొరికింది అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. నిజంగా అలా అవకాశం దొరికితే వదిలిపెట్టే వ్యక్తి చంద్రబాబేనా? దీనిలో ఏమీ లేదని తెలిసి, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఆదానీపై ఏం చర్య తీసుకోలేను అంటున్నారు. అమెరికాలో తేలితే కానీ ఏం చేయలేను అంటున్నారు. అంటే అసలు ఈ వ్యవహారంలోనే ఏం లేదు అని అర్థమవుతోంది. జగన్‌పై యాక్షన్ తీసుకోవాలని అనుకుంటే, సెకీ మీకు లడ్డూలా దొరికితే ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు. ఆదానీ మీద చర్య తీసుకునే ప్రశ్నే లేదంటున్నారు. ఆదానీ ఒప్పందంలో లంచాల ఆరోపణలు ఉన్నాయి కదా.. వాటిని రద్దు చేస్తారా' అని రాంబాబు ప్రశ్నించారు.

Whats_app_banner