YCP Challenges Waqf Act: సుప్రీం కోర్టులో వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేసిన వైసీపీ, రద్దు చేయాలని పిటిషన్
YCP Challenges Waqf Act: వక్ఫ్ చట్టానికి పార్లమెంటులో చేసిన సవరణల్ని వైఎస్సార్సీపీ సవాలు చేసింది. ఈ మేరకు వైసీపీ తరఫున పిటిషన్ దాఖలు చేసినట్టు ఆ పార్టీ ప్రకటించింది.
YCP Challenges Waqf Act: వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తూ పార్లమెంటు చట్టసవరణను సవాలు చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వక్ఫ్ చట్ట సవరణలో తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయని, ఇది ముస్లిం సమాజం ఆందోళనలను పరిష్కరించడంలో విఫలమైందని వైసీపీ పేర్కొంది.
వైసీపీ తరఫున సీనియర్ న్యాయవాది మహ్ఫూజ్ అహ్సాన్ నజ్కీ ఈ పిటిషన్ దాఖలు చేశారని, ఈ కేసును మంగళవారం విచారించే అవకాశం ఉందని పార్టీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
వక్ఫ్ చట్టం-1995కు సవరణలతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సవరణల రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ... మతం ఆధారంగా వివక్ష చూపేలా కొత్త చట్టం ఉందని పిటిషన్‌లో పేర్కొంది.
ఆర్టికల్ 14, 15లను ఉల్లంఘిస్తున్న తాజా చట్ట సవరణలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వక్స్ నిర్వహణ సక్రమంగా లేకుంటే జోక్యం చేసుకోవచ్చే తప్ప, మత విశ్వాసాలకు విరుద్దంగా ప్రభుత్వాలు వ్యవహరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
వక్ఫ్ బోర్డు సీఈవోగా ముస్లిం వ్యక్తే ఉండాలన్న నిబంధనను కొత్త చట్టంలో తొలగించారని తెలిపిం ది. సెంట్రల్ వక్స్ కౌన్సిల్, వక్స్ బోర్డుల్లో ముస్లిమేతరులకు అవకాశం కల్పించడం, మౌలిక సూత్రాలకు విరుద్ధమని.. ఇది తరాలుగా వస్తున్న హక్కులకు విఘాతం కలిగించడమేనని పేర్కొంది. కీలక వ్యక్తులను తొలగించేందుకు కూడా కొత్త సవరణలు. అవకాశం కల్పిస్తున్నాయంది.
పాత చట్టానికి విరుద్ధంగా సవరణ..
- ఏ చట్టమైనా దాని మాతృ చట్టం స్పూర్తికి అనుగుణంగా ఉండాలని సుప్రీంకోర్టు గతంలో పేర్కొందని, ముస్లిం ధార్మిక సంస్థల వ్యవహారాల్లో ప్రభుత్వం పెద్దఎత్తున జోక్యం చేసుకునే అవకాశం ఇస్తూ, పాత చట్టం ఉద్దేశాలకు విరుద్ధంగా సవరణల వల్ల వక్ఫ్ బోర్డు పాలన బలహీనం అవుతుందని పేర్కొంది.
- వక్స్ ఆస్తుల నిర్వహణ, పునర్విభజన విషయం లో జోక్యం చేసుకునేందుకు అధికారులకు అపరిమిత అధికారాలు ఇచ్చారని వైఎస్సార్సీపీ పిటిషన్‌లో అభ్యంతరం త తెలిపింది. ఒకసారి వక్ఫ్ అయితే అది ఎప్పటికీ వక్ఫ్ అవుతుందన్న సూత్రాన్ని న్యాయస్థానాలు కూడా గుర్తిం చాయని, కొత్త చట్టంలో అలాంటి రక్షణ లేదని అభ్యంతరం తెలిపారు.
- మైనారిటీ ఆస్తులకు రాజ్యాంగ రక్షణ ఉందని, కొత్త చట్టంతో అన్ని రక్షణలు పోతున్నాయని పేర్కొంది. ఇది అత్యం త ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. రక్షిత స్మారక చిహ్నాలు, రక్షణ ప్రాంతాల ప్రకటనను చెల్లనివిగా తేల్చే ప్రమాదం ఉందని వైసీపీ పేర్కొంది.
- ఏ వక్ఫ్ ఆస్తినైనా ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించే అధికారాన్ని అధికారులకు కొత్త చట్టం కట్టబెట్టిందని, గతంలో ఉన్న రక్షణలేవీ కొత్త చట్టం లేకుండా చేస్తోందని, అందువల్ల ఈ సవరణ చట్టం విషయంలో జోక్యం చేసుకోవాలని వైసీపీ పిటిషన్‌లో కోరింది.
- ఇస్లామిక్ చట్టాలు, కట్టుబాట్లకు అనుగుణంగా వక్ఫ్ నిర్వహణ ఉంటుందని, కానీ, సవరణలు అందుకు విరుద్ధంగా ఉన్నాయంది. ముస్లిం సంస్థల్లో ముస్లింల ప్రాబల్యాన్ని తగ్గిం చడానికి తీసుకొచ్చిన ఈ సవరణలను కొట్టేయాలని వైఎస్సార్సీపీ పిటిషన్‌లో సుప్రీంకోర్టును అభ్యర్థించింది.
- కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 13, 14, 25, 26లను ఉల్లంఘిస్తుందని, ప్రాథమిక హక్కులు, చట్టం ముందు సమానత్వం, మత స్వేచ్ఛ, మత వర్గాలు తమ సొంత వ్యవహారాలను నిర్వహించుకునే స్వయంప్రతిపత్తికి హామీ ఇస్తుందని పేర్కొంది.
- సెక్షన్ 9, 14 కింద ముస్లిమేతరులను చేర్చడం వక్ఫ్ సంస్థల అంతర్గత కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడమేనన్నారు. ఈ నిబంధన బోర్డుల మతపరమైన స్వభావాన్ని, పరిపాలనా స్వేచ్ఛను దెబ్బతీస్తుందని పేర్కొంది.
సంబంధిత కథనం