Ysrcp : వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి నియామకం-ysrcp appointed pudi srihari as media spokesperson as ys jagan orders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp : వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి నియామకం

Ysrcp : వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి నియామకం

Bandaru Satyaprasad HT Telugu
Updated Feb 18, 2025 10:47 PM IST

Ysrcp : వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(మీడియా)గా సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో ఈ నియామకం చేపట్టినట్లు వైసీపీ ప్రకటించింది.

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పూడి శ్రీహరి నియామకం
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పూడి శ్రీహరి నియామకం

Ysrcp : సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరిని వైసీపీ..రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(మీడియా)గా నియమించింది. వైసీపీ అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో పూడి శ్రీహరిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియమించినట్లు ప్రకటించింది. శ్రీహారి గతంలో సీఎంకు సీపీఆర్వోగా పనిచేశారు.

సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి(సీపీఆర్వో)గా పనిచేశారు. ఆయనకు రెండు దశాబ్దాలుగా మీడియాలో అనుభవం ఉంది. గతంలో ఈయన వైఎస్ జగన్ మీడియా వ్యవహారాలు చూశారు. అలాగే వైఎస్ జగన్ రాజకీయ జీవితం, ప్రజాసంకల్ప పాదయాత్ర విశేషాలతో 'అడుగడుగునా అంతరంగం' పేరుతో శ్రీహరి ఓ పుస్తకాన్ని రాశారు.

శ్రీహరి అనేక ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. చీఫ్‌ న్యూస్‌ కోఆర్డినేటర్‌, ఇన్‌పుట్‌ ఎడిటర్‌ సహా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. యాంకర్‌గా అనేక చర్చా కార్యక్రమాలను నిర్వహించిన అనుభవం ఉంది. క్షేత్రస్థాయి సమాచార సేకరణ, విశ్లేషణలో పూడి శ్రీహరికి విశేష అనుభవం ఉంది.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం