Ys Sharmila: అసెంబ్లీకి వెళ్లకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న వైఎస్‌ షర్మిల..-ys sharmila wants ycp mlas to resign if they do not go to the assembly ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila: అసెంబ్లీకి వెళ్లకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న వైఎస్‌ షర్మిల..

Ys Sharmila: అసెంబ్లీకి వెళ్లకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న వైఎస్‌ షర్మిల..

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 12, 2024 01:45 PM IST

Ys Sharmila: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను బహిష్కరించడాన్ని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తప్పు పట్టారు. సభకు వెళ్లకపోతే పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. గెలిస్తే సభకు వెళ్లనని చెప్పి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాలు చేశారు.

వైసీపీ ఎమ్మెల్యేలకు లేఖ రాసిన షర్మిల
వైసీపీ ఎమ్మెల్యేలకు లేఖ రాసిన షర్మిల

Ys Sharmila: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను బహిష్కరించిన  వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ పదవిలో కొనసాగే నైతికత లేదని పీసీసీ అధ్యక్షురాలు విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతే అసెంబ్లీకి వెళ్లమని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు ముందు చెప్ప లేదు కదా అని ప్రశ్నించారు. 151 ఎమ్మెల్యేల నుంచి 11మందికి పరిమితం కావడానికి జగన్ స్వయంకృతమే  కారణమని విమర్శించారు.

ఎమ్మెల్యేలు  అసెంబ్లీకి వెళ్లకపోతే ప్రజల్ని మోసం చేసినట్టు అని విమర్శించారు. సభకు వెళ్లకపోవడానికి వారికి  ఏ హక్కు ఉందని ,జగన్మోహన్‌ రెడ్డికి అహంకారంతో ఉన్నారని, మిగిలిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా పోరాటాలు చేయడం ఏమిటన్నారు. ప్రజలు ఎన్నుకున్నదే అసెంబ్లీలో పోరాటం చేయడానికి అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్నది సరికాదన్నారు. బడ్జెట్‌ ప్రవేశపెడితే దానికి హాజరు కాలేదని, దానిలో తప్పుఒప్పులు మాట్లాడటానికి ఎవరు లేరని, ఇది సరికాదన్నారు. అన్య

అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామాలు చేయాలని, ఈసారి పోటీ చేసినపుడు మేము గెలిస్తే అసెంబ్లీకి వెళ్లమని చెప్పాలని, ధైర్యం లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేలకు లేఖ రాస్తున్నట్టు ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా కొనసాగితే అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు.

 బడ్జెట్ లో స్పష్టత లేదు…

బడ్జెట్ అంటే కేటాయింపులు అని, ఏపీలో  కేటాయింపులు లేని బడ్జెట్ ప్రకటించారని,  ఇది మరో మ్యానిఫెస్టో అని షర్మిల విమర్శించారు.  సూపర్ సిక్స్ అమలు చేయాలి అంటే ప్రతి ఏడాది లక్షా 20 వేల కోట్లు కావాలని, చంద్రబాబు ఈ బడ్జెట్ లో కనీసం పావు వంతు కూడా కేటాయింపు చేయలేదన్నారు. 

మహిళా శక్తి కింద ప్రతి నెల 15 వందలు ఇస్తా అన్నాడని,  కోటి మంది మహిళలు రాష్ట్రంలో ఉన్నారని,  ఈ పథకం కింద వచ్చే 5 నెలల్లో 7500 కోట్లు ఇవ్వాల్సి ఉందని,   కానీ ఈ పథకానికి నిధులు రూపాయి కూడా కేటాయించలేదన్నారు.  తల్లికి వందనం కింద 15 వేలు ప్రతి బిడ్డకు ఇస్తాం అన్నాడని, దానికి దాదాపు 10 వేల కోట్లు ఇవ్వాలని,   రాష్ట్రంలో 80 లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్పారు. బడ్జెట్ లో నిధులు కేవలం 2 వేల కోట్లు కేటాయించాని,   అంటే సగం మంది పిల్లలకు నిధులు ఇవ్వరా ? అని ప్రశ్నించారు.  ఉచిత బస్సు పథకానికి నిధులు ఒక్క రూపాయి ఇవ్వలేదని,   దాదాపు 2 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.  ఈ ప్రభుత్వానికి ఉచిత బస్సు పథకాన్ని ఇచ్చే ఉద్దేశ్యం లేదని ఆరోపించారు. 

అన్నదాత సుఖీభవ కింద అరకొర నిధులు ఇచ్చారని,   ప్రతి రైతుకి 20 వేలు ఏడాదికి ఇవ్వాలని,  ఈ లెక్కన 10400 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. బడ్జెట్ లో 4500 కోట్లు కేటాయించారని,  పక్కా ఇండ్లు 8 లక్షల ఇండ్లు కట్టిస్తామన్నారని,   ఈ పథకానికి దాదాపు 32 వేల కోట్లు కావాలన్నారు.  ఇచ్చింది కేవలం 4 వేల కొట్లేనని, నిరుద్యోగ భృతి 18 వేల కోట్లు కావాలని,  యువతకు రూ. 3 వేలు ఇస్తామని చెప్పారని ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ భృతికి నిధులు ఇవ్వలేదన్నారు. 

Whats_app_banner