YS Sharmila : జగన్ బెయిల్ రద్దు కుట్ర ఈ శతాబ్దపు పెద్ద జోక్, వైసీపీ ఆరోపణలకు వైఎస్ షర్మిల కౌంటర్-ys sharmila counter to ysrcp allegations on jagan bail cancellation conspiracy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila : జగన్ బెయిల్ రద్దు కుట్ర ఈ శతాబ్దపు పెద్ద జోక్, వైసీపీ ఆరోపణలకు వైఎస్ షర్మిల కౌంటర్

YS Sharmila : జగన్ బెయిల్ రద్దు కుట్ర ఈ శతాబ్దపు పెద్ద జోక్, వైసీపీ ఆరోపణలకు వైఎస్ షర్మిల కౌంటర్

Bandaru Satyaprasad HT Telugu
Updated Oct 30, 2024 02:52 PM IST

YS Sharmila : వైఎస్ఆర్ ఆస్తుల వివాదంపై వైఎస్ షర్మిల మరోసారి స్పందించారు. జగన్ బెయిల్ రద్దు కుట్ర అంటూ వైసీపీ చెప్పడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అన్నారు. ఈడీ కంపెనీ స్థిరాస్తిని అటాచ్ చేసింది కానీ, షేర్లు కాదని తెలిపారు. షేర్ల బదలాయింపుపై ఎలాంటి ఆంక్షలు విధించలేదన్నారు.

జగన్ బెయిల్ రద్దు కుట్ర ఈ శతాబ్దపు పెద్ద జోక్, వైసీపీ ఆరోపణలపై వైఎస్ షర్మిల కౌంటర్
జగన్ బెయిల్ రద్దు కుట్ర ఈ శతాబ్దపు పెద్ద జోక్, వైసీపీ ఆరోపణలపై వైఎస్ షర్మిల కౌంటర్

వైఎస్ జగన్ బెయిల్ రద్దుకు కుట్ర జరుగుతోందని వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర అని వైసీపీ నేతలు చెప్పడం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్ అని వైఎస్ షర్మిల అన్నారు. ఆస్తుల వివాదంపై స్పందిస్తూ... ఈడీ అటాచ్ చేసింది రూ.32 కోట్ల విలువైన స్థిరాస్తి అని, షేర్లు కాదని తెలిపారు. కంపెనీల షేర్ల బదలాయింపుపై ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలు విధించలేదన్నారు. షేర్లపై ఈడీ స్టేటస్‌కో విధించలేదన్నారు. గతంలో ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసిందని, వాటిని స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌, షేర్ల బదిలీలు మాత్రం ఆపలేదని గుర్తుచేశారు. ఈడీ అటాచ్‌ చేసిన కారణంగా షేర్లు బదిలీ చేయకూడదనడం పెద్ద జోక్ అన్నారు. తనకు 100 శాతం వాటాలు బదలాయిస్తామని జగన్ ఎంవోయూపై సంతకాలు చేశారన్నారు. బెయిల్‌ రద్దవుతుందని ఎంవోయూపై సంతకం చేసినప్పుడు తెలియదా? అని షర్మిల ప్రశ్నించారు.

విజయమ్మకు రూ.42 కోట్ల షేర్లు ఎలా బదిలీ చేశారు?

2021లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్‌, సరస్వతి షేర్లను రూ. 42 కోట్లకు విజయమ్మకు ఎలా విక్రయించారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అప్పుడు స్టేటస్ కో ఉల్లంఘించలేదా? అని నిలదీశారు. వైఎస్ జగన్, భారతి రెడ్డి తమ షేర్లను విజయమ్మకు గిఫ్ట్ డీడ్ గా రాశారన్నారు. షేర్ల బదిలీలకు, బెయిల్ రద్దుకు ఎలాంటి సంబధం లేదని తెలిసే అప్పుడు జగన్ అలా చేశారన్నారు. ఇప్పుడు షేర్ల బదిలీ చేయకూడదంటూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్సీఎల్‌టీలో కేసు ఉంది కాబట్టి, షేర్ల గురించి మాట్లాడితే సబ్ జుడీస్ అవుతుందని, జగన్ బెయిల్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని విజయమ్మకు తెలుసన్నారు. విజయమ్మే స్వయంగా లేఖ రాశాన్నారు. ఆమె లేఖ రాయకపోతే...స్వయంగా ఖండించేవారు కదా? అన్నారు.

విజయమ్మ లేఖ

వైఎస్ఆర్ కుటుంబ ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ మంగళవారం ఓ లేఖ విడుదల చేశారు. వైఎస్ఆర్ ఆస్తుల వివాదంపై జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే తన మనసుకి చాలా బాధేస్తుందన్నారు.

"వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ఇతరులు... వాళ్లు మాట్లాడుతున్నది వైఎస్ఆర్ గురించి అని మరిచి, ఆయన కుటుంబ పరువు తీస్తున్నారన్న స్పృహ లేకుండా.. ఎన్నో అసత్యాలు చెప్పారు. వైఎస్ఆర్ బతికి ఉండగానే ఆస్తులు పంచేశారని అన్నారు. ఇది అవాస్తవం. వైఎస్ఆర్ పిల్లలు ఇద్దరు పెరుగుతున్న రోజుల నుంచి, కొన్ని ఆస్తులు షర్మిల పేరు మీద.. అలాగే కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు. అది ఆస్తులు పంచడం ముమ్మాటికీ కాదు. వైఎస్ఆర్ బతికి ఉండగానే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారు, జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్ట్ అంటూ కొందరు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ చేసింది పంపకం కాదు. కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేరు మీద పెట్టారు అంతే.జన్మనిచ్చిన తల్లిదండ్రులకు బిడ్డలు అందరూ సమానమే. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే, చూసి తట్టుకోవడం చాలా కష్టం. తల్లిగా, అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటం నా విధి, నా ధర్మం." - విజయమ్మ

Whats_app_banner

సంబంధిత కథనం