Visakha Fishing Harbour Incident : మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది, నేను ఏ తప్పూ చేయలేదు - లోకల్ బాయ్ నాని
Visakha Fishing Harbour Incident: విశాఖ హార్బర్ లో చోటు చేసుకున్న ప్రమాదంలో తనది ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశాడు లోకల్ బాయ్ నాని. తాను ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ… పోలీసులు బెదిరించారని ఆరోపించాడు. కోర్టులోనే తనకు న్యాయం జరుగుతుందని… గంగపుత్రులు నిజాలు తెలుసుకోవాలని కోరారు.
YouTuber local boy Nani: విశాఖ హార్బర్ లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో యూట్యాబర్ లోకల్ బాయ్ నాని పాత్రపై అనేక అనుమానాలు వచ్చిన సంగతి తెలిసిందే. పోలీసులు కూడా అతడిని సుదీర్ఘంగా విచారించారు. అయితే ఈ ఘటనపై లోకల్ బాయ్ నాని శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.
"నవంబరు 19 రాత్రీ నేను వేరే ప్లేస్ లొ ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చాను. 9:46 నిమిషాలకు నాకు ఫోన్ వచ్చి యాక్సిండెంట్ స్పాట్ కు వెళ్ళాను. మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. నేను పార్టీ లో డ్రింక్ చేసి ఉన్న. డ్రింక్ చేసి నేను సేవ్ చెయ్యలేకపోయాను. గంగ పుత్రులకు సహాయం అందుతుంది అని విడియో తీసి పెట్టాను. 22 సెకండ్స్ తీశాను నాకు డబ్బులు వస్తాయని నేను వీడియో తియ్యలేదు. తీసిన విడియో 10 గంటలకు పోస్ట్ చేశాను. క్రైమ్ పోలీసులు ఫోన్ చేసి విచారణకు పిలిచారు. చిన్న ఎంక్వైరీ అని తీసుకుని వెళ్ళి నా దగ్గర ఉన్నవన్నీ తీసేసుకున్నారు. ఎందుకు ఆ పని చేశావ్ అని కొట్టారు. బోట్లు నువ్వే తగల పెట్టావ్ అని కొట్టారు. నేను చేయ్యలేదని ఏడ్చాను. నువ్వే చేశావ్ అని తిట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో నేను ఎక్కడ ఉన్నానో కుడా సీసీ కెమెరాలో రికార్డు అయింది. అన్ని చూసిన తర్వాత కూడా పోలీసులు నీ ఫ్రెండ్స్ తో నువ్వే చేశావ్ అని పోలీసులు అంటున్నారు. మరో 4 గురు అమయకులను కూడా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు." అని నాని ఆరోపించారు.
నేను కోర్టుకి రాకపోతే నన్ను ఏదో చేసేసే వారని ఆరోపించాడు లోకల్ బాయ్ నాని. తాను చెయ్యకుండానే చేసినట్లు క్రియేట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హై కోర్ట్ లో పిటిషన్ వెయ్యగానే నన్ను బెదిరించారని చెప్పారు. కోర్టులోనే తనకు న్యాయం జరుగుతుందని... వైజాగ్ వెళ్ళాక నాపై ఎటాక్ కుడా చెయ్యొచ్చన్నారు. మా అన్న పై దాడి చేశారు రాళ్లతో కొట్టారని... నాకు నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చాడు. గంగ పుత్రులు నిజా నిజాలు తెలుసుకోవాలని కోరాడు.
సంబంధిత కథనం