Visakhapatnam : లోన్‌ యాప్‌ వేధింపులకు యువకుడు బలి.. నెల రోజుల కిందటే వివాహం!-youth commits suicide in visakhapatnam due to loan app harassment ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakhapatnam : లోన్‌ యాప్‌ వేధింపులకు యువకుడు బలి.. నెల రోజుల కిందటే వివాహం!

Visakhapatnam : లోన్‌ యాప్‌ వేధింపులకు యువకుడు బలి.. నెల రోజుల కిందటే వివాహం!

Basani Shiva Kumar HT Telugu
Dec 10, 2024 12:07 PM IST

Visakhapatnam : లోన్ యాప్ మరో యువకుడిని బలి తీసుకుంది. నెల రోజుల కిందటే వివాహం చేసుకున్న యువకుడు.. ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో జరిగింది. మార్ఫింగ్ ఫొటోల కారణంగానే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

లోన్‌ యాప్‌ వేధింపులకు యువకుడు బలి
లోన్‌ యాప్‌ వేధింపులకు యువకుడు బలి (X)

లోన్‌ యాప్‌ వేధింపులకు యువకుడి బలయ్యాడు. విశాఖపట్నంలో ఇంట్లో ఉరివేసుకుని నరేంద్ర అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నరేంద్రకు నెల రోజుల కిందటే వివాహం అయ్యింది. నరేంద్ర లోన్ యాప్‌లో రూ.2వేలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చలేదని మార్ఫింగ్‌ ఫొటోలతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఫొటోలను బంధువులకు పంపి వేధింపులకు గురిచేశారు. దీంతో వేధింపులు భరించలేక నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు.

yearly horoscope entry point

ఇటీవల ఆన్‌ లైన్‌లో చేసిన అప్పులు ప్రాణాలు తీస్తున్నాయి. అవసరం కోసం చేసిన రుణం చివరికి కన్నవారి, కట్టుకున్నవారి నుంచి శాశ్వతంగా దూరం చేస్తోంది. లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోన్‌ యాప్స్‌ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు ప్రారంభించింది.

లోన్ యాప్‌ల కారణంగా ఎంతోమంది చనిపోతున్నారు. కొన్నిసార్లు చనిపోయినవారి బంధువులను కూడా వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బెదిరింపు కాల్స్‌పై ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది. 1930 కాల్ సెంటర్ ఫోన్ చేసి.. బాధితులు కంప్లైంట్ చేయవచ్చని స్పష్టం చేసింది. కాల్‌ సెంటర్‌ను సంప్రదిస్తే వెంటనే స్పందిస్తామని వెల్లడించింది.

ఆకర్షించే లోన్ మెసేజ్‌ల లింక్‌లు ఓపెన్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఫోన్లలోని కాంటాక్ట్‌, అడ్రస్‌, లొకేషన్ల పర్మిషన్లు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. అదిరే ఆఫర్స్ అంటూ ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తారని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచించారు. విలువైన జీవితాలను ఇలాంటి విషయాల కోసం బలి చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

మార్ఫింగ్‌ల పట్ల జాగ్రత్త..

చాలా లోనే యాప్‌లు ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాయి. దీంతో పరువు పోతుందని చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. మరికొంతమంది ఎదోలా ఇబ్బందిపడి.. అప్పులు చేసి రుణాలు తీరుస్తున్నారు. అయితే.. లోన్ యాప్‌లలో అప్పు తీసుకున్న సమయంలో.. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఫోటొలకు యాక్సెస్ ఇవ్వొద్దని స్పష్టం చేస్తున్నారు. ఏమైనా సమస్యలు వస్తే.. తమను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Whats_app_banner