Boy Friend Wedding : ముందు జైలుకు పంపి.. తర్వాత పెళ్లివేడుకకు పెట్రోల్‌తో వచ్చింది-woman with petrol bottle in ex boyfriend wedding in gajuwaka ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Woman With Petrol Bottle In Ex Boyfriend Wedding In Gajuwaka

Boy Friend Wedding : ముందు జైలుకు పంపి.. తర్వాత పెళ్లివేడుకకు పెట్రోల్‌తో వచ్చింది

HT Telugu Desk HT Telugu
Dec 04, 2022 05:19 PM IST

Gajuwaka Wedding : ఓ యువతి తనను మోసం చేసిన ప్రియుడిపై కేసు పెట్టి జైలుకు పంపింది. జైలు నుంచి విడుదలైన యువకుడు మళ్లీ పెళ్లి చేసుకుంటుండగా అదే యువతి పెళ్లి వేడుక దగ్గరకు పెట్రోల్ తో వచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT telugu)

మాజీ ప్రియుడి(Ex Lover) పెళ్లి వేడుకలో ఓ యువతి హంగామా చేసింది. కొన్నిరోజుల కిందట తనను మోసం చేశాడని చెప్పి పోలీసు కేసు(Police Case) పెట్టింది. ఆ తర్వాత కొన్ని రోజులకు అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. తాజాగా మరో యువతితో పెళ్లి చేసుకుంటుండగా.. పెట్రోల్ బాటిల్(Petrol Bottle) తీసుకుని వచ్చింది. పోలీసులకు తెలిసి వచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

విశాఖపట్నం.. జీవీఎంసీ 69వ వార్డు తుంగ్లాం గ్రామానికి చెందిన ఎం.విజయ్ భగత్ ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. పార్వతీపురానికి(Parvathipuram) చెందిన ప్రియాంక అనే యువతిని ప్రేమించాడు. కొంతకాలం ఇద్దరు సంతోషంగానే ఉన్నారు. కానీ మెల్లమెల్లగా మనస్పర్థాలు రావడం మెుదలయ్యాయి. దీంతో ప్రియాంకను విజయ్ విడిచిపెట్టాడు. ఎలాగైనా ఇక పట్టించుకోవద్దనుకున్నాడు. కానీ ఈ విషయాన్ని ప్రియాంక అంత తేలిగ్గా తీసుకోలేదు.

మే నెలలో నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మోసం చేశాడని కేసు పెట్టింది. దీంతో యువకుడికి కొన్ని రోజులు జైలు శిక్ష పడింది. జైలు నుంచి బయటకు వచ్చాడు విజయ్. మరో మహిళతో వివాహానికి(Marriage) సిద్ధమయ్యాడు. శనివారం నాతియాపాలెంలో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం ప్రియాంకకు తెలిసింది.

తన బంధువులు, స్నేహితులతో కలిసి పెళ్లి మండపం వద్దకు వెళ్లింది. తన వెంట అప్పటికే తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ తో బెదిరించింది. దీంతో అక్కడ వాతావరణం మారిపోయింది. ఈ విషయం గాజువాక(Gajuwaka) పోలీసులకు తెలిసి.. ఘటన స్థలానికి వచ్చారు. సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కోర్టు పరిధిలోని వ్యవహారంలో ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. ఎలాంటి చర్యలు పాల్పడవద్దని సూచించారు.

IPL_Entry_Point