Attack On lover: సహజీవనం, మరో పెళ్లికి సిద్ధమైన వ్యక్తిపై యువతి దాడికి యత్నం, ఎదురుదాడిలో తీవ్ర గాయాలు
Attack On lover: యువతితో సహజీవనం చేసిన ఓ వ్యక్తి ఆమెకు తెలియకుండా మరో పెళ్లికి సిద్ధమయ్యాడు.విషయం తెలిసిన యువతి పెళ్లి జరుగుతున్న చోటుకు వెళ్లి హల్చల్ చేసింది. అక్కడున్న వారిపై దాడికి యత్నించింది.ఈ క్రమంలో ఆమె తెచ్చుకున్న యాసిడ్ మీద పడటంతో ఓ మహిళ గాయపడింది. ఆపై యువకుడు యువతిపై కత్తితో దాడి చేశాడు.
Attack On lover: ఓ యువతితో కొన్నాళ్లు సహజీవనం చేసిన యువకుడు ఆమెకు తెలియకుండా మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యా డు. ఆ సంగతి తెలిసిన యువతి పెళ్లి జరుగుతున్న షాదీఖానా వద్ద ఆందోళనకు దిగింది. అప్పటి వరకు బంధువులు, అతిథులతో ఉత్సాహంగా ఉన్న షాదీఖానాలో యువతి ఆందోళనతో గందరగోళం చెలరేగింది. పెళ్లికొడుకు తనను మోసం చేశాడంటూ బాధితురాలు ఓ చేత్తో కత్తి మరో చేతితో యాసిడ్ పట్టుకుని హంగామా సృష్టించింది.
తనతో సహజీవనం చేసి తనకు తెలియకుండా మరో అమ్మాయిని పెళ్ల చేసుకుంటున్నాడని ఆరోపిస్తూ దాడికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమెను అడ్డుకునే ప్రయత్నించిన యువకుడి తరపు బంధువు గాయపడింది. పెళ్లి కొడుకుపై యాసిడ్ పోసేందుకు ప్రయత్నించడంతో అడ్డుకున్న మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లిలో ఆదివారం జరిగింది. పరస్పర దాడులతో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది.
నందలూరుకు చెందిన ఓ యువతితో రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ భాషాతో ఆదివారం స్థానిక షాదీఖానాలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. వివాహం జరగుతున్న సమయంలో అతని ప్రియురాలు జయ అక్కడకు వచ్చింది. సయ్యద్ భాషా తనతో కాపురం చేశాడని ఆరోపించారు.
తిరుపతికి చెందిన జయతో భాషా కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగించినట్లు ఆరోపించింది. తనతో సహజీవనం చేస్తూ సయ్యద్ భాషా వేరే అమ్మాయినీ వివాహం చేసుకోవడానికి సిద్దపడడంతో జయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
షాది ఖానాలో సయ్యద్ బాషాపై కత్తి, యాసిడ్‌లతో దాడి యత్నించింది. ఈ క్రమంలో ఆమెను అడ్డుకోడానికి ఇతరులు ప్రయత్నించారు. వారి మధ్య జరిగిన తోపులాటలో యాసిడ్ పడి అక్కడ ఉన్న మహిళలకు గాయలయ్యాయి. తనపై దాడి చేయడంతో యాసిడ్ పడిందని జయ ఆరోపించింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ పరిణామంతో అక్కడ ఉన్నవారంతా తలోదిక్కుకు పారిపోయారు. రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ బాషా, పదేళ్లుగా తనతో సన్నిహితంగా ఉంటున్నాడని ఆమె ఆరోపించింది.తిరుపతిలో తనతో కలిసి ఉన్నాడని, కొంత కాలం కిందట స్వగ్రామానికి వచ్చేసి మరో యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడని ఆరోపింిచంది. .
ఆదివారం వివాహం జరుగుతోందని తెలుసుకుని వచ్చిన తనపై భాషా బంధువులు దాడి చేశారని ఆరోపించింది. ఈ క్రమంలో కరిష్మా అనే మహిళపై యాసిడ్ పడిందని చెబుతోంది. తన బంధువు గాయపడటంతో ఆగ్రహించిన బాషా.. కత్తితో జయపై దాడి చేయడంతో ఆమె కూడా తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనతో వధువు తరఫు బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెళ్లి అర్థాంతరంగా ఆగిపోవడంతో విచారం వ్యక్తం చేశారు. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాలు పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ అబ్దుల్ జహీర్ తెలిపారు.