Prakasam Crime: వివాహేతర సంబంధంతో ప్రియుడితో కలిసి భర్తను చంపి బావిలో పడేసిన భార్య-wife kills husband and throws him into well after having extramarital affair with lover ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Prakasam Crime: వివాహేతర సంబంధంతో ప్రియుడితో కలిసి భర్తను చంపి బావిలో పడేసిన భార్య

Prakasam Crime: వివాహేతర సంబంధంతో ప్రియుడితో కలిసి భర్తను చంపి బావిలో పడేసిన భార్య

HT Telugu Desk HT Telugu

Prakasam Crime: ప్ర‌కాశం జిల్లాలో ఘోర‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. భార్య వేరొక వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. విష‌యం తెలుసుకున్న భార్త ఆమెను ప‌లుమార్లు హెచ్చ‌రించాడు. దీంతో ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను భార్య హ‌త‌మార్చింది. బండ‌రాయితో కొట్టి హ‌త్య చేసి, బావిలో ప‌డేశారు.

వివాహేతర సంబంధంతో ప్రియుడితో కలిసి భర్త హత్య

Prakasam Crime: వివాహేతర సంబంధం తొలిత మిస్సింగ్ కేసుగా భావించిన స్థానికులు, చివ‌రికి గురువారం హ‌త్య కేసుగా పోలీసులు బ‌య‌ట‌పెట్టారు. నిందితులిద్ద‌రూ ప‌రారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

ఈ ఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లా ఒంగోలు రూర‌ల్‌ మండ‌లం పాత‌పాడు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా గురువారం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం పాత‌పాడు గ్రామంలో మోర‌బోయిన అర్జున్ రెడ్డి (55), ఆ భార్య సుశీల నివాసం ఉంటున్నారు. అయితే అర్జున్ రెడ్డి భార్య అదే గ్రామానికి చెందిన కాపూరి ర‌మేష్ రెడ్డితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. ఈ క్ర‌మంలో ర‌మేష్ రెడ్డి త‌ర‌చూ అర్జున్ రెడ్డి ఇంటికి వెళ్లి వ‌స్తుండేవాడు.

వివాహేతర సంబంధం

చాలా కాలంగా వీరిద్ద‌రి మ‌ధ్య వివాహేత‌ర సంబంధం కొన‌సాగుతోంది. ఈ విష‌యం తెలుసుకున్న అర్జున్ రెడ్డి భార్యను ప‌లుమార్లు హెచ్చ‌రించాడు. ర‌మేష్ రెడ్డి ఇంటికి రాకూడ‌ద‌ని స్ప‌ష్టం చేశాడు. దీంతో భార్య, భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ సాగింది. త‌మ అక్ర‌మ సంబంధానికి భ‌ర్త అడ్డుగా ఉన్నాడ‌ని భావించిన భార్య‌, ఆమె ప్రియుడు ర‌మేష్ రెడ్డి అత‌న్ని అంత‌మొందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుకు ప‌థ‌కం రచించారు. గ‌త నెల 19న అర్జున్ రెడ్డిని మ‌ద్య తాగేందుకు ర‌మ్మ‌ని చెప్పి పొలాల వైపు పిలుచుకుని ర‌మేష్ రెడ్డి వెళ్లాడు.

అక్క‌డ అర్జున్ రెడ్డిని మాట‌ల్లో పెట్టి ఫుల్లుగా మ‌ద్యం తాగించాడు. మ‌ద్యం మ‌త్తులో ఉన్న అత‌డిని బండ‌రాయితో కొట్టి చంపారు. అర్జున్ రెడ్డి మ‌ర‌ణించాడ‌ని నిర్ధారించుకున్న త‌రువాత సుశీల‌తో క‌లిసి మృత‌దేహాన్ని ప‌క్క‌నే ఉన్న బావిలో ర‌మేష్ రెడ్డి, సుశీల క‌లిసి ప‌డేశారు. ఆ త‌రువాత ఏమీ తెలియ‌న‌ట్లుగా ఎవ‌రి దారిన వారు వెళ్లిపోయారు.

మార్చి 19 నుంచి అర్జున్ రెడ్డి క‌నిపించ‌టం లేదు. దీంతో కుటుంబ స‌భ్యులు అర్జున్ రెడ్డి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న భార్య కూడా అదృశ్యం అయింది. ర‌మేష్ రెడ్డి కూడా క‌నిపించ‌కుండా పోయాడు. దీంతో అర్జున్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌కు అనుమానం వ‌చ్చింది.

మృతుడి సోదరుడి ఫిర్యాదు..

మార్చి 29న అర్జున్ రెడ్డి సోద‌రుడు వెంక‌టేశ్వ‌ర రెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రిపారు. కీల‌క అనుమానితుల‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా అస‌లు విషయం బ‌య‌ప‌డ‌టంతో గురువారం కేసు మిస్ట‌రీ వీడింది. మిస్సింగ్ కాద‌ని, హ‌త్య కేసు అని తేలింది. దీంతో పోలీసులు అనుమానితుల‌ను తీసుకుని హ‌త్య జ‌రిగిన ప్ర‌దేశానికి వెళ్లారు. ఈ ప్రాంతాన్ని ఒంగోలు రూర‌ల్ సీఐ కె. అజ‌య్ కుమార్‌, ఎస్ఐ అనిత ఆధ్వ‌ర్యంలోని బృందం ప‌రిశీలించింది.

బావిలో శవం..

బావిలో ఉన్న కుళ్లిపోయిన మృత‌దేహాన్ని అధికారులు, గ్రామ‌స్థులు, కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో బ‌య‌ట‌కు తీయించారు. అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాన్ని ఒంగోలు జీజీహెచ్‌కు త‌ర‌లించారు. పోస్టుమార్టం అనంత‌రం మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. ఈ కేసులో నిందితులు ప‌రారీలో ఉన్నార‌ని, వారిని త్వ‌ర‌లో ప‌ట్టుకుంటామ‌ని పోలీసులు వెల్లడించారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం