AP Tourism : విశాఖ నగరంపై పర్యాటక శాఖ స్పెషల్ ఫోకస్ ఎందుకు? 10 ముఖ్యమైన అంశాలు
AP Tourism : ఏపీలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కానీ.. టూరిజం డిపార్ట్‌మెంట్ మాత్రం విశాఖపై స్పెషల్ ఫోకస్ పెటడుతోంది. అందుకు కారణాలు అనేకం ఉన్నాయి. విశాఖపట్నం ఎక్కువమంది పర్యాటకులను ఆకర్షిస్తుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఏపీ పర్యాటక శాఖ ఈ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్లాన్ చేస్తోంది.
విశాఖపట్నం.. ఏపీలోని ప్రముఖ పారిశ్రామిక నగరం మాత్రమే కాదు.. అద్భుతమైన పర్యాటక ప్రదేశం కూడా. ఇక్కడ సహజ సిద్ధమైన అందాలు, సాంస్కృతిక వైభవం, ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. అందుకే ఏపీ పర్యాటక శాఖ ఈ నగరాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి.. ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
10 ముఖ్యాంశాలు..
1.విశాఖపట్నం నగరం తీర ప్రాంతంలో ఉండటంతో ఇక్కడ అద్భుతమైన బీచ్‌లు ఉన్నాయి. రుషికొండ, ఆర్‌కే బీచ్, యారాడ బీచ్ వంటి బీచ్‌లు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.
2.విశాఖపట్నం చరిత్రాత్మకంగా చాలా ప్రాముఖ్యత కలిగిన నగరం. ఇక్కడ కొన్ని ప్రాచీన ఆలయాలు, కోటలు ఉన్నాయి. సింహాచలం ఆలయం, కైలాసగిరి వంటి ప్రదేశాలు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.
3.విశాఖపట్నం ఒక ఆధునిక నగరం. ఇక్కడ మంచి రోడ్లు, హోటళ్లు, మాల్స్, వినోద కేంద్రాలు ఉన్నాయి. పర్యాటకులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
4.విశాఖపట్నం అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సర్ఫింగ్, స్కూబా డైవింగ్, ట్రెక్కింగ్ వంటి అడ్వెంచర్ కార్యకలాపాలు జోరుగా సాగుతాయి. ఇవి టూరిస్టులను మరింతగా ఆకర్షిస్తున్నాయి.
5.విశాఖపట్నం ఒక పారిశ్రామిక నగరం. ఇక్కడ వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలను చూసేందుకు పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే వివిధ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు టూరిస్టులు ఆసక్తి చూపిస్తారు.
6.విశాఖపట్నంలో మెట్రోపాలిటన్ కల్చర్ ఉంటుంది. ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తారు. భిన్నమైన సంస్కృతి కనిపిస్తుంది. ఇక్కడ వివిధ రకాల సంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
7.విశాఖపట్నంలో వివిధ రకాల ఆహారం లభిస్తుంది. ముఖ్యంగా సీ ఫుడ్ చాలా స్పెషల్. ఆంధ్రా భోజనం ఇక్కడ ప్రసిద్ధి. ఎవరికి ఎలాంటి ఫుడ్ కావాలన్నా.. ఇక్కడ లభిస్తుంది. నగరానికి సమీపంలో పాడేరు, అరకు వంటి అడవి ప్రాంతాల్లో వెరైటీ నాన్ వెజ్ ఫుడ్ ఐటెమ్స్ లభిస్తాయి.
8.విశాఖపట్నం వెళ్లడానికి అన్ని రకాల రవాణా వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. రైలు, రోడ్డు మార్గాలు బాగుంటాయి. ఇక్కడ విమానాశ్రయం కూడా ఉంది. అటు సముద్రం ద్వారా కూడా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి నౌకలు వస్తాయి.
9.ఏపీ పర్యాటక శాఖ విశాఖపట్నాన్ని ప్రమోట్ చేయడానికి.. వివిధ రకాల ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది. ఇక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి.. తొందరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
10. పర్యాటకం ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తుంది. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడం ద్వారా.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు విశాఖపట్నం దన్నుగా నిలుస్తోంది. అటు ప్రముఖ సంస్థలు విశాఖ హోటళ్లు నిర్మించేందుకు ఇంకా ముందుకొస్తున్నాయి. అందుకే ఏపీ టూరిజం డిపార్ట్‌మెంట్ విశాఖపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది.