AP Jobs : పశ్చిమగోదావరి డీసీహెచ్ఎస్ లో పోస్టుల భర్తీ, దరఖాస్తుకు ఈ నెల 31 లాస్ట్!-west godavari news in telugu jobs in dchs 8 posts filled with contract basis ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Jobs : పశ్చిమగోదావరి డీసీహెచ్ఎస్ లో పోస్టుల భర్తీ, దరఖాస్తుకు ఈ నెల 31 లాస్ట్!

AP Jobs : పశ్చిమగోదావరి డీసీహెచ్ఎస్ లో పోస్టుల భర్తీ, దరఖాస్తుకు ఈ నెల 31 లాస్ట్!

Bandaru Satyaprasad HT Telugu
Jan 14, 2024 09:43 PM IST

AP Jobs : పశ్చిమగోదారవి జిల్లా డీసీహెచ్ఎస్ లో డాక్టర్, సోషల్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 31లోపు ఆఫ్ లైన్ లో ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్యోగాలు
పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్యోగాలు

AP Jobs : పశ్చిమగోదావరి జిల్లాలో వైద్య ఆరోగ్య పరిషత్ పరిధిలోని పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిస్ట్రిక్ట్ కోఆర్టినేటర్ హెల్త్ సర్వీసెస్(డీసీహెచ్ఎస్)లో వైద్యులు, సోషల్ వర్కర్ పోస్టుల కోసం ఆఫ్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానించారు. మొత్తం 8 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 31వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి 42 ఏళ్లుగా నిర్ణయించారు.

పోస్టుల వివరాలు- జీతాభత్యాలు

  • వైద్యుడు-1 పోస్టు- రూ.60 వేలు
  • కౌన్సెలర్/సోషల్ వర్కర్/సైకాలజిస్ట్- 2 పోస్టులు- రూ.17,500
  • నర్సు-1 పోస్టు-రూ.15 వేలు
  • యోగా థెరపిస్టు/డ్యాన్స్ టీచర్/ టీచర్(పార్ట్ టైమ్)-1 పోస్టు-రూ.5 వేలు
  • వార్డ్ బాయ్స్ - 2 పోస్టు -రూ.13 వేలు

అప్లికేషన్లు https://westgodavari.ap.gov.in/ లేదా https://eluru.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకుని అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తులను హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్టినేటర్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం ఆవరణలో,, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా..చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. పోస్టులకు సంబంధించిన విద్యార్హతలను నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దరఖాస్తుకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

విద్యార్హతలు

  • వైద్యుడు(పూర్తి సమయం) - మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌తో ఎంబీబీఎస్, వైద్య కమిషన్ లో చేరిన మూడు నెలల్లో MOSJE/NISD శిక్షణ
  • కౌన్సెలర్/సోషల్ వర్కర్/సైకాలజిస్ట్- సోషల్ వర్క్ గ్రాడ్యుయేట్, సైకాలజీలో 1-2 సంవత్సరాల అనుభవంతో పాటు ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండాలి.
  • యోగా థెరపిస్ట్/ డాన్స్ మాస్టర్/టీచర్(పార్ట్ టైమ్)- కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి
  • నర్స్(పూర్తి సమయం)- GNM/B.Sc నర్సింగ్ డిగ్రీతో అర్హత కలిగిన నర్సు, ఏజెన్సీ ద్వారా శిక్షణ పొందేందుకు సిద్ధంగా ఉండాలి.
  • వార్డ్ బాయ్స్ - 8వ తరగతి ఉత్తీర్ణతతో పాటు హాస్పిటల్స్/హెల్త్‌కేర్‌లో అనుభవం కలిగి ఉండాలి.

సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర జ్యుడీషియల్‌ సర్వీసెస్‌లో భాగంగా 39 సివిల్‌ జడ్జి పోస్టుల(జూనియర్‌ డివిజన్‌)ను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

ముఖ్య వివరాలు:

  • రిక్రూట్ మెంట్ ప్రకటన - ఏపీ హైకోర్టు (ఏపీ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీసు).
  • ఉద్యోగాలు - సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌)
  • మొత్తం ఖాళీలు - 39 పోస్టులు( ఇందులో 32 ఖాళీలు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. మరో 7 ఖాళీలు ట్రాన్స్‌ఫర్‌ ద్వారా అవుతాయి)
  • అర్హత -లా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
  • వయోపరిమితి - 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు అయిదేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల మినహాయింపు ఉంటుంది.
  • దరఖాస్తు -ఆన్ లైన్ విధానంలో చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు - రూ.1500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి.
  • దరఖాస్తులు ప్రారంభం - 31 జనవరి 2024.
  • దరఖాస్తులకు తుది గడువు 01 మార్చి 2024.
  • స్క్రీనింగ్ టెస్ట్ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్ - 15 మార్చి 2024.
  • స్క్రీనింగ్ పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష)- 13 ఏప్రిల్ 2024.
  • ప్రాథమిక కీ విడుదల/ అభ్యంతరాల స్వీకరణ: 18 ఏప్రిల్ 2024.
  • ఎంపిక ప్రక్రియ - స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా తుది జాబితా ఉంటుంది.
  • ఎగ్జామ్ టైం - 2 గంటలు
  • స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష కేంద్రాలు - గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖ.

Whats_app_banner