Rain Alert To AP : అల్పపీడనం.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు-weather update rain alert to andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Weather Update Rain Alert To Andhra Pradesh

Rain Alert To AP : అల్పపీడనం.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

HT Telugu Desk HT Telugu
Oct 20, 2022 06:23 AM IST

Andhra Pradesh Weather Update : అండమాన్ సముద్రతీరంలో ఉపరితల ఆవర్తనం బలపడుతోంది. ఈ కారణంగా కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

మరికొన్ని రోజులు వర్షాలు
మరికొన్ని రోజులు వర్షాలు

మరికొన్ని గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22వ తేదీ నాటికి మరింతగా బలపడి వాయుగుండంగా మారుతుందని ఐఎండీ(IMD) పేర్కొంది. ఆ తర్వాత తుపానుగా బలపడేందుకు అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తుంది. ప్రస్తుతం అండమాన్ సముద్రం నుంచి తమిళనాడు వరకూ కోస్తా తీరంపై ఆవరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో చాలాచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

అయితే బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ, తెలంగాణ(Telangana)లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి.

తీరంలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వేగం 55 కిలోమీటర్లు దాటే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. శ్రీకాకుళం(Srikakulam), విజయనగరం, విశాఖపట్నం(Visakhapatnam)లో నేడు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వానలు పడనున్నాయి. అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది.

అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని ఐఎండీ(IMD) పేర్కొంది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది. అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడనున్నాయి.

తెలంగాణలోనూ వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ(Nalgonda), నాగర్ కర్నూలు, యాదాద్రి భువనగిరి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్(Hyderabad), రంగారెడ్డి జిల్లాల్లోనూ వర్షాలు ఉన్నాయి. ఇప్పటికే భాగ్యనగరంలో చాలా రోజులు వర్షాలు పడుతున్నాయి.

IPL_Entry_Point