Weather Update : మరో ఐదు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు-weather update rain alert in andhra pradesh for coming five days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Weather Update Rain Alert In Andhra Pradesh For Coming Five Days

Weather Update : మరో ఐదు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

HT Telugu Desk HT Telugu
Jun 22, 2022 04:19 PM IST

ఏపీలో మరో ఐదు రోజులు వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో ఆకాశం మేఘావృతమై ఉంది. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల రాత్రిళ్లు వర్షాలు కురుస్తున్నాయి. విశాఖతో పాటుగా అనకాపల్లి, కాకినాడ జిల్లాలోని కొన్ని భాగాలు, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కొనసీమ​, కాకినాడ​, అనకాపల్లి, విశాఖ​, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో వర్షాలు నేడు పెరుగుతాయి.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

కాకినాడ నగరంతో పాటుగా యానం, పిఠాపురం, అన్నవరంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాజమండ్రిలో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

కోస్తాంధ్రలో వర్షాలు మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రాయలసీమ జిల్లాల్లో వర్షాలు తగ్గే ఛాన్స్ ఉందని.. ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. గుంటూరు, పల్నాడు, విజయవాడ​ కడప​, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడనున్నాయి. రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి.

ఇవాళ అర్ధరాత్రి కూడ రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉంది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరో ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. ఉరుములు మెరుపులతో వానలు పడే అవకాశం ఉంది.

WhatsApp channel

టాపిక్