Borewell Water : పనికిరాదనుకున్న బోరుబావి నుంచి పాతాళగంగ-water flows from borewell without motor in sri satya sai district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Water Flows From Borewell Without Motor In Sri Satya Sai District

Borewell Water : పనికిరాదనుకున్న బోరుబావి నుంచి పాతాళగంగ

HT Telugu Desk HT Telugu
Nov 13, 2022 07:31 PM IST

Sri Sathyasai District News : కరువు సీమలో భూగర్భ జలాలు పొంగిపొర్లుతున్నాయి. ఓ చోట బోరుకు మోటారు లేకున్నా.. పైపైకి నీరు పొంగివస్తోంది.

బోరు నుంచి బయటకు వస్తున్న నీరు
బోరు నుంచి బయటకు వస్తున్న నీరు

శ్రీ సత్యసాయి(Sri Sathyasai District) జిల్లా ఓడీ చెరువు మండలం గాజుకుంటపల్లిలో వింత ఘటన జరిగింది. చాలా కాలంగా ఖాళీగా పక్కనే పడి ఉన్న బోరు(Borewell) బావి నుంచి నీరు ప్రవహిస్తోంది. మోటారు(Motor) లేకుండా పొంగిపొర్లుతోంది. గాజుకుంటపల్లిలో బోరు తవ్విన సమయంలో నీరు పడినా.. తక్కువే వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం.. నీరు పైపైకి ఉబికివస్తోంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన షానవాజ్ ఖాన్ రెండున్నరేళ్ల క్రితం 600 అడుగుల లోతు బోరుబావి తవ్వారు. బోరు తవ్వితే వచ్చే కొద్దిపాటి నీటితో పంటలు విత్తేందుకు మోటార్ బిగించాడు.

ట్రెండింగ్ వార్తలు

అయితే కొద్దిరోజులకే బోరులో నీరు ఎండిపోయింది. దీంతో మోటారు తొలగించి విక్రయించాడు. ఇటీవల కురిసిన వర్షాలకు భూగర్భజలాలు(Ground Water) పెరిగి బోరుబావిలో నీరు పొంగిపొర్లుతోంది. వందల అడుగుల లోతు తవ్వినా చుక్క నీరు రాని ఈ కరువు ప్రాంతంలో బోరు బావి నుంచి దానంతట అదే నీరు(Water) వస్తుండటంతో రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మోటారు బిగించి పంటలు పండిస్తానని రైతు(Farmer) సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

కిందటి నెలలో సీమలో భారీ వర్షాలు(Heavy Rains) పడ్డాయి. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. అనంతపురం(Anantapur)లో కురిసన వానలకు చాలామంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎప్పుడూ లేని విధంగా వాగులు, వంకలు పొంగిపోర్లాయి. చిత్రావతి నది ఉప్పొంగింది.

అనంతపురం జిల్లాలో వర్షాలకు(Rains) జనాలు అల్లాడిపోయారు. వందల ఏళ్లనాటి రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఉమ్మడి జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లాయి. అనేక ప్రాంతాల్లో వేరుశనగ, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. చిత్రావతి నది(Chitravati River)కి వరదతో బుక్కపట్నం చెరువు నిండిపోయింది. ధర్మవరం చెరువులోనూ భారీగా నీరు వచ్చి చేరింది. వర్షాలతో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. దీంతో బోరు బావుల నుంచి నీరు ఉబికివస్తోంది.

ఎగువన ఉన్న ప్రాజెక్టులు, కృష్ణా(Krishna River), పెన్నార్ బేసిన్‌ల నుంచి తక్కువ పరిమాణంలో నీటిని విడుదల చేసినా.. భారీ ప్రవాహాల నేపథ్యంలో రాయలసీమ ప్రాజెక్టులకు భారీగా నీరు వచ్చింది. చిత్రావతి, పెన్నార్, తుంగభద్ర నదులకు అనుసంధానించే ఛానళ్లు నిరంతరం ఆ సమయంలో పొంగి పొర్లాయి. హిందూపూర్ ప్రాంతంలో పెన్నార్(Pennar), దాని అనుబంధ నదులు జయమంగళి, చిత్రావతి(Chitravathi River) పొంగిపొర్లాయి.

WhatsApp channel