Vizag Woman Issue : సాయిప్రియపై పోలీస్‌ కేసు నమోదు....-vizag police registered case on married woman who left with lover ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Vizag Police Registered Case On Married Woman Who Left With Lover

Vizag Woman Issue : సాయిప్రియపై పోలీస్‌ కేసు నమోదు....

HT Telugu Desk HT Telugu
Aug 29, 2022 12:20 PM IST

విశాఖపట్నం బీచ్‌లో మాయమై బెంగుళూరులో ప్రియుడితో ప్రత్యక్షమైన యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో సాయిప్రియతో పాటు ఆమె ప్రియుడు రవితేజలపై త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

విశాఖ ఆర్కే బీచ్ యువతి మిస్సింగ్ కేసు
విశాఖ ఆర్కే బీచ్ యువతి మిస్సింగ్ కేసు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖపట్నం సాయిప్రియపై పోలీసులు కేసు నమోదు చేశారు. జులై 25న భర్తతో కలిసి బీచ్‌కు వెళ్లిన సాయిప్రియ, భర్త ఏమరపాటుగా ఉన్న సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోయింది. భర్తతో కలిసి ఉండటం ఇష్టంలేక ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. భార్య సముద్రంలో గల్లంతై ఉంటుందని అనుమానించిన భర్త పోలీసుల్ని ఆశ్రయించాడు.ఆర్కే బీచ్‌ ఒడ్డున ఉన్న సమయంలో సమయంలో సముద్రంలో కాళ్లు కడుగుతున్న సమయంలో, ఫోన్ కాల్ రావడంతో భర్త పక్కకు వెళ్లడంతో ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

విశాఖపట్నం నుంచి నెల్లూరు మీదుగా బెంగుళూరు వెళ్లిన యువతి అక్కడ ప్రియుడిని పెళ్లి చేసుకుంది. తన గురించి వెదకొద్దని తండ్రికి ఫోన్‌లో మెసేజ్ పంపింది. దీంతో ఆమె కోసం గాలింపు చేపట్టిన పోలీసులు అవాక్కయ్యారు. పెళ్లి రోజు సందర్భంగా భర్త కొనిచ్చిన బంగారు గాజుల్ని అమ్మేసి ఇద్దరు బెంగుళూరులో గడిపినట్లు పోలీసులకు వివరించారు.

తొలుత ఈ ఘటనపై సాయిప్రియ తండ్రి పోలీసులకు ఫిర్యాదునివ్వడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా 48గంటల పాటు సముద్రంలో తీవ్ర స్థాయిలో గాలించారు. చివరకు సాయిప్రియ అచూకీని బెంగుళూరులో గుర్తించారు.

సాయిప్రియ ముందస్తు ప్రణాళికలో భాగంగానే ప్రియుడు రవితేజతో కలిసి బీచ్‌ నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. తన గురించి పెద్ద ఎత్తున గాలింపు జరుగుతున్నట్లు తెలిసినా , క్షేమ సమాచారం పోలీసులను తప్పుదోవ పట్టించడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్‌ వారి విలువైన సమయాన్ని వృధా చేయడంతో పాటు రక్షణశాక ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్‌ హెలికాఫ్టర్ల ద్వారా గాలింపు చేపట్టడానికి భారీగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది.

సాయిప్రియ భర్తను ఉద్దేశపూర్వకంగా బాధించేలా వంచించడం, భర్త బతికి ఉండగానే మరొకరిని పెళ్లి చేసుకోవడంపై కోర్టుకు ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో సాయిప్రియతో పాటు ఆమె ప్రియుడు రవితేజలపై ఐపిసి సెక్షన్లు 417, 494, 202 రెడ్ విత్ 34 కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు నిందితులు ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందితుల్ని అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరు పరుస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

IPL_Entry_Point

టాపిక్