Trains Information : వాల్తేర్, గుంటూరు డివిజన్ లో పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు, ప్రత్యేక రైళ్లు కొన‌సాగింపు-visakhapatnam waltair guntur division trains short terminated some diverted ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Trains Information : వాల్తేర్, గుంటూరు డివిజన్ లో పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు, ప్రత్యేక రైళ్లు కొన‌సాగింపు

Trains Information : వాల్తేర్, గుంటూరు డివిజన్ లో పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు, ప్రత్యేక రైళ్లు కొన‌సాగింపు

HT Telugu Desk HT Telugu

Trains Information : వాల్తేరు డివిజన్ లో భద్రతాపరమైన పనులతో పలు దారి మళ్లించగా, మరికొన్ని రైళ్లు తాత్కాలికంగా రద్దు చేశారు.

వాల్తేర్, గుంటూరు డివిజన్ లో పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు

Trains Information : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను కొనసాగించాలని రైల్వే నిర్ణయించింది. అలాగే వివిధ ప్రాంతాల్లో భ‌ద్రతాప‌ర‌మైన ప‌నుల వ‌ల్ల కొన్ని రైళ్లు దారి మ‌ళ్లింపు, మ‌రికొన్ని రైళ్లు షార్ట్ టెర్మినేట్ చేయ‌నున్నట్లు వాల్తేర్ డివిజ‌న్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు.

ప్రత్యేక రైళ్లు

ఆగస్టు 15 వ‌ర‌కు హౌరా-య‌శ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (02863) రైలు, ఆగ‌స్టు 17 వ‌ర‌కు య‌శ్వంత్‌పూర్‌-హౌరా స్పెష‌ల్ ఎక్స్‌ప్రెస్ (02864) రైలు స‌ర్వీసు కొన‌సాగుతుంది.

రైళ్లు మ‌ళ్లింపు

గుంటూరు డివిజన్‌లోని విష్ణుపురం - కొండ్రపోల్ మధ్య ట్రాఫిక్ బ్లాక్ కారణంగా రైళ్లు దారి మళ్లిస్తామ‌ని, రెగ్యులేష‌న్ చేస్తున్నట్లు తెలిపారు. ఆగ‌స్టు 11న సంత్రాగచ్చి నుంచి బయలుదేరే సంత్రాగచ్చి - సికింద్రాబాద్ (07222) రైలు విజయవాడ, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్ మీదుగా నడుస్తుంది. ఆగ‌స్టు 13న సికింద్రాబాద్‌లో బయలుదేరే సికింద్రాబాద్ - సంత్రాగచ్చి (07221) సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, విజయవాడ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

ఈ రైళ్లకు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లె, గుంటూరు స్టాప్‌లు తొల‌గించారు. అలాగే విశాఖపట్నం - లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805) రైలు విశాఖపట్నం నుంచి ఆగ‌స్టు 12, ఆగ‌స్టు 13 తేదీలలో 45 నిమిషాల పాటు ఆల‌స్యంగా బయలుదేరుతుంది.

రైళ్ల షార్ట్ టెర్మినేట్‌

కిరండూల్ లైన్‌లోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా, ప్రయాణికుల సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఈ విభాగంలోని కోచింగ్ రైళ్లను షార్ట్ టెర్మినేట్, షార్ట్ ఆరిజినేట్, మళ్లించాలని నిర్ణయించారు.

విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ స్పెష‌ల్ (08551) రైలు దంతెవాడలో షార్ట్ టర్మినేట్ చేయబడుతుంది. జులై 28 నుంచి జులై 31 వ‌ర‌కు ఉంటుంది. కిరండూల్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08552) రైలు కిరండూల్‌కు బదులుగా దంతెవాడ నుంచి ప్రారంభమవుతుంది. జులై 28 నుంచి ఆగ‌స్టు 1 వరకు ఉంటుంది. అందువల్ల కిరండూల్-దంతెవాడ మధ్య ఈ రైలు సర్వీసు ఉండదు.

విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం-కిరండూల్ ఎక్స్‌ప్రెస్ (18514 ) రైలు దంతెవాడలో షార్ట్ టర్మినేట్ చేయబడుతుంది. జులై 28 నుంచి జులై 31 వ‌ర‌కు ఉంటుంది. కిరండూల్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18513) రైలు కిరండూల్‌కు బదులుగా దంతెవాడ నుంచి బయలుదేరుతుంది. జులై 28 నుంచి ఆగ‌స్టు 1 వరకు ఉంటుంది. అందువల్ల పైన పేర్కొన్న తేదీల్లో కిరండూల్-దంతెవాడ మధ్య ఈ రైలు సేవలు ఉండవు. ప్రజలు ఈ మార్పులను గమనించి తదనుగుణంగా ప్రయాణాలు చేసుకోవాల‌ని వాల్తేర్ డివిజ‌న్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ సూచించారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం