ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా వందేభారత్(Vande Bharath Train) రైలు ఏపీకి త్వరలో రానుంది. ఈ మైరకు వాల్తేర్(waltair division) రైల్వే డివిజనల్ మేనేజర్ అనుప్ సత్పతి తెలిపారు. ఇప్పుడున్న సమాచారం ప్రకారం విశాఖపట్నం-తిరుపతి లేదా విశాఖపట్నం-విజయవాడ(Tirupati To Vijayawada) మధ్య రైలు నడపనున్నట్లు చెప్పారు. అయితే వైజాగ్-విజయవాడ(Vizag To Vijayawada)లో వందేభారత్ నడిపేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.,స్టేషన్ రీడెవలప్ మెంట్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, దానికి సంబంధించిన భూసార పరీక్ష పూర్తయిందని అనుప్ తెలిపారు. స్టేషన్‌లో మరికొన్ని ప్లాట్‌ఫారమ్‌లు రానున్నాయి. రూ.456 కోట్లతో విశాఖపట్నం రైల్వే స్టేషన్(Visakhapatnam)ను ప్రపంచ స్థాయి స్టేషన్‌గా తీర్చిదిద్దాలని రైల్వే మంత్రిత్వ శాఖ భావించింది. 36 నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుందని అనుప్ అన్నారు.,ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు వందే భారత్ రైలును కేటాయిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విశాఖ పర్యటనలో ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే పలు మార్గాల్లో వందేభారత్ రైలును నడిపేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించిన రైల్వే అధికారులు సికింద్రాబాద్-విజయవాడ(secunderabad to vijayawada) మధ్య వందేభారత్ రైలును నడపాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రానికి వందే భారత్ రైలును కానుకగా ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.,హైదరాబాద్-విజయవాడ(Hyderabad To Vijayawada) మధ‌్య ఎన్ని రైళ్లు నడిచినా వాటికి డిమాండ్ ఉంటుంది. డిమాండ్‌కు తగ్గట్లుగా ఖాళీలు లేకపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నయాలు వెదుక్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో హై స్పీడ్ రైలు(High Speed Rail) త్వరలో అందుబాటులోకి రానుంది. తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)ల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేలా హై స్పీడ్ రైలును అందబాటులోకి తీసుకురావాలని రైల్వే వర్గాలు యోచిస్తున్నాయి.,విజయవాడ-సికింద్రాబాద్(Vijayawada To secunderabad) మధ్య వందే భారత్ రైలును నడిపేందుకు సిద్ధమవుతున్నారు. దక్షిణాదిన ఇటీవల బెంగుళూరు(Bengaluru)లో వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరో రైలును విజయవాడ-సికింద్రాబాద్ మధ్య నడపాలని యోచిస్తున్నారు. ఉత్తరాదిలో పరుగులు తీస్తున్న వందేభారత్ రైళ్లు ఇటీవల చెన్నై-మైసూర్(Chennai to mysore) మార్గంలో దక్షిణాదిలోకి ప్రవేశించాయి. కొత్త ఏడాది కానుకగా దక్షిణమధ్య రైల్వేలో పరిధిలో వందేభారత్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది.