Vizag Steel Plant : స్టీల్ ప్లాంట్ క్రెడిట్ గేమ్ లో తొందరపడ్డ BRS..! ఏపీలో ఎంట్రీకి బీజేపీ షాకిచ్చిందా? -visakhapatnam steel plant politics central government twist on privatization to check brs entry into ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Visakhapatnam Steel Plant Politics Central Government Twist On Privatization To Check Brs Entry Into Ap

Vizag Steel Plant : స్టీల్ ప్లాంట్ క్రెడిట్ గేమ్ లో తొందరపడ్డ BRS..! ఏపీలో ఎంట్రీకి బీజేపీ షాకిచ్చిందా?

HT Telugu Desk HT Telugu
Apr 15, 2023 11:15 AM IST

Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ క్రెడిట్ గేమ్ లో ప్రతిపక్ష పార్టీలకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి కేంద్రం చెక్ పెట్టిందనే ప్రచారం జరుగుతోంది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్
వైజాగ్ స్టీల్ ప్లాంట్

Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదే లే అని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగన్ సింగ్ కులస్తే ప్రైవేటీకరణపై చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో క్రెడిట్ గేమ్ కు తెరలేపాయి. మా పార్టీ ఎంటర్ అవ్వడం వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందని బీఆర్ఎస్ చెప్పుకుంది. కేంద్ర మంత్రులను కలిసింది మేము అని ఏపీ బీజేపీ నేతలు క్రెడిట్ గేమ్ లో జతకలిశారు. అధికార వైసీపీ అది మా పోరాటం వల్లే అంటూ బరిలోకి దిగింది. ఇంతలో కేంద్రం ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. ప్రైవేటీకరణపై ముందుకే వెళ్తున్నామని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ కులస్తే కూడా మాట మార్చారు. కేబినెట్ నిర్ణయాన్ని తానేలా మార్చగలనని చెప్పుకొచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

బీఆర్ఎస్ ఎంట్రీతో గేమ్ ఛేంజ్

విశాఖ స్టీల్ ప్లాంట్ కు మూలధనం సమకూర్చేందుకు ఈవోఐ బిడ్డింగ్ లో పాల్గొంటామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సింగరేణి అధికారులు విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులతో భేటీ కూడా అయ్యారు. ఏపీలో ఎంట్రీకి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కీలకంగా మార్చుకోవాలని బీఆర్ఎస్ భావించింది. ఇప్పటికే ఉక్కు పరిశ్రమ కార్మికుల ఆందోళనకు ఆ పార్టీ మద్దతు తెలిపింది. ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ విశాఖలో పర్యటించి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మద్దతు తెలిపారు. తెలంగాణ బిడ్డింగ్ లో పాల్గొంటుందని ప్రకటన రాగానే కేంద్ర ఉక్కు సహాయ మంత్రి విశాఖ పర్యటన రావడం, ప్రైవేటీకరణపై ఉదయం ఒకలా, సాయంత్రం మరోలా కామెంట్స్ చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేందుకే కేంద్రం ఇలా ట్విస్ట్ ఇచ్చిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గితే ఆ క్రెడిట్ బీఆర్ఎస్ కు వెళ్తుందనే కేంద్రం తాజా ప్రకటన చేసిందని విశ్లేషకులు అంటున్నారు. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి బీజేపీ అడ్డుకట్ట వేసిందనే ప్రచారం కూడా జరుగుతోంది.

వాట్ నెక్ట్స్?

ప్రైవైటీకరణపై కేంద్రం ట్విస్ట్ తో డిఫెన్స్ లో పడ్డ ప్రతిపక్షాలు... బీజేపీవి ద్వంద్వ విధానాలంటూ ఫైర్ అవుతున్నారు. ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం కొనసాగిస్తామని, కార్మికులకు అండగా ఉంటామని చెబుతున్నాయి. కేంద్రం నిర్ణయం ఏపీ బీజేపీ నేతలను కూడా షాక్ కు గురిచేసింది. క్రెడిట్ గేమ్ లో మేము ఉన్నామని చెప్పుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలకు ఇప్పుడు ఏంచెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది. కేంద్ర మంత్రులను కలిసి, స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ మేమే కృషి చేస్తున్నామని బీజేపీ ఎంపీ జీవీఎల్ చెబుతున్నారు. ఇప్పటికే చాలా సార్లు లేఖలు రాశామని, ఆర్ఐఎన్ఎల్ మూలధనం చేకూర్చాలని కోరుతున్నామన్నారు. అయితే ఇంతలో కేంద్రం ప్రైవేటీకరణపై ముందుకే వెళ్తున్నామని చెప్పడంతో ఏపీ బీజేపీ నేతలు డిఫెన్స్ లో పడ్డారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం