Special Trains : పూరీ ర‌థ‌యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, 8 ప్రత్యేక రైళ్లు నడపనున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే-visakhapatnam east coast railway announced 8 special trains to puri jagannath rath yatra ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Special Trains : పూరీ ర‌థ‌యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, 8 ప్రత్యేక రైళ్లు నడపనున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే

Special Trains : పూరీ ర‌థ‌యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, 8 ప్రత్యేక రైళ్లు నడపనున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే

HT Telugu Desk HT Telugu
Jul 02, 2024 04:09 PM IST

Special Trains : పూరీ రథయాత్రకు వెళ్లే భక్తులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. విశాఖ, పలాస, గుణుపూర్, జగదల్‌పూర్ నుంచి ప్రత్యేక పాసింజర్లు నడపనున్నారు.

పూరీ ర‌థ‌యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, 8 ప్రత్యేక రైళ్లు నడపనున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే
పూరీ ర‌థ‌యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, 8 ప్రత్యేక రైళ్లు నడపనున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే

Special Trains : పూరీ రథయాత్రకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. గుండిచా యాత్ర, బహుద యాత్ర, సునాబేషాపై అన్‌రిజర్వ్డ్ ప్యాసింజర్ ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. మొత్తం ఎనిమిది ప్యాసింజ‌ర్ రైళ్లను న‌డుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పలాస-పూరీ స్పెష‌ల్‌ (08331) హరిపూర్‌గ్రామ్, అర్గుల్ మీదుగా పలాస నుంచి జులై 7, జులై 15, జులై 17న మూడు రోజుల పాటు ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఇది ప‌లాస (శ్రీ‌కాకుళం)లో రాత్రి 12.15కి బ‌య‌లుదేరుతుంది. అదే రోజు ఉద‌యం 05.35 గంటలకు పూరీ చేరుకుంటుంది.

yearly horoscope entry point

పూరీ-పలాస స్పెషల్ (08332 ) జులై 8, జులై 16, జులై 18 తేదీల్లో మూడు రోజుల‌ పాటు పూరీ నుంచి బ‌య‌లుదేరుతుంది. పూరీలో ఉద‌యం 04.00 గంటలకు బయలుదేరి, అదే రోజు ఉద‌యం 10.05 గంటలకు పలాస చేరుకుంటుంది. ఈ రైళ్లు పలాస-పూరీ మధ్య ప్యాసింజర్ హాల్ట్‌లు ఉన్న అన్ని స్టేష‌న్లలో ఆగుతాయి.

విశాఖపట్నం-పూరీ ప్రత్యేక రైలు (08347) హరిపూర్‌గ్రామ్, అర్గుల్ మీదుగా విశాఖపట్నం నుంచి జులై 6, జులై 14, జులై 16 తేదీల్లో మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విశాఖ‌ప‌ట్నంలో మ‌ధ్యాహ్నం 02.00 గంటలకు బయలుదేరుతుంది. ఇది అదే రోజు రాత్రి 10.45 గంటలకు పూరీకి చేరుకుంటుంది.

పూరీ-విశాఖపట్నం ప్రత్యేక రైలు (08348) జులై 8, జులై 16, జులై 18 తేదీల్లో మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఆయా తేదీల్లో పూరీలో తెల్లవారుజామున 01.45 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు ఉద‌యం 10.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైళ్లు కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, సిగడాం, పొందూరు, శ్రీకాకుళం రోడ్, తిలారు, కోటబొమ్మాళి, నౌపడ, పలాస, మందస, సోంపేట, ఇచ్ఛాపురం, బ్రహ్మాపూర్, చత్రాపూర్, గంజాం, ఖల్లికోటే, బాలుగావ్, కలుపరఘాట్, నిరాకార్‌పూర్ స్టేష‌న్లలో ఆగుతాయి.

గుణుపూర్-పూరీ స్పెషల్ రైలు (08345) హరిపూర్‌గ్రామ్, అర్గుల్ మీదుగా జులై 6, జులై 14, జులై 16 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇది గుణుపూర్‌లో ఆయా తేదీలలో రాత్రి 11.00 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు ఉద‌యం 04.15 గంటలకు పూరీకి చేరుకుంటుంది.

పూరీ-గుణుపూర్ (08346) స్పెష‌ల్ రైలు జులై 7, జులై 15, జులై 17 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు పూరీలో రాత్రి 09.20 బ‌య‌లుదేరుతుంది. మరుస‌టి రోజు ఉద‌యం 07.30 గంట‌ల‌కు గుణుపూర్ చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు గుణుపూర్-పూరి మధ్య ప్యాసింజర్ హాల్ట్‌ల్లో ఆగుతాయి. ఏపీలోని పాత‌ప‌ట్నం, టెక్కలి, నౌపడ, పుండి, పలాస, మందస, సోంపేట, ఇచ్ఛాపురం త‌దిత‌ర స్టేష‌న్లు ఆగనున్నాయి.

జగదల్‌పూర్-పూరీ స్పెషల్ (08349) రైలు హరిపూర్‌గ్రామ్, అర్గుల్ జగదల్‌పూర్ నుండి జూలై 6, జూలై 14, జూలై 16 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు జ‌గ‌ద‌ల్‌పూర్‌లో ఉద‌యం 10.45 గంటలకు బయలుదేరుతుంది. ఇది అర్ధరాత్రి 00.45 గంటలకు పూరీకి చేరుకుంటుంది.

పూరీ-జగ‌ద‌ల్‌పూర్ స్పెషల్ (08350) రైలు జులై 8, జులై 16, జులై 18 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు పూరీ నుంచి అర్ధరాత్రి 12.15 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు మ‌ధ్యాహ్నం 03.10 గంటలకు జగదల్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైళ్లు కోట్‌పర్ రోడ్, జేపూర్, కోరాపుట్, దమంజోడి, లక్ష్మీపూర్ రోడ్, టికిరి, రాయగడ, పార్వతీపురం టౌన్, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, చీపురుపల్లి, సిగడాం, పొందూరు, శ్రీకాకుళం రోడ్, తిలారు, కోటబొమ్మాళి, నౌపడ, పలాస, మందస, సొంపే, బ్రహ్మపూర్, చత్రపూర్, గంజాం, ఖల్లికోట్, బాలుగావ్, కలుపరఘాట్, నిరాకర్‌పూర్, కైపదర్ రోడ్, అర్గుల్ స్టేష‌న్లలో ఆగుతాయి.

నాలుగు స్పెష‌ల్ రైళ్లు రెండు నెలల పాటు పొడిగింపు

రైల్వే ప్రయాణికుల‌కు శుభ‌వార్త అందింది. నాలుగు రైళ్లను మ‌రో రెండు నెల‌ల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-అగర్తల-సికింద్రాబాద్, సికింద్రాబాద్-సంత్రగచ్చి-సికింద్రాబాద్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్ల రాకపోక‌ల‌ను పొడిగించాల‌ని వాల్తేరు డివిజ‌న్‌ నిర్ణయించింది. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని, అద‌న‌పు ర‌ద్దీని త‌గ్గించ‌డానికి నాలుగు రైళ్ల షెడ్యూల్‌ను పొడిగించింది.

సికింద్రాబాద్ - అగర్తల - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు:

ప్రతి సోమవారం న‌డిచే సికింద్రాబాద్ - అగర్తల (07030) స్పెషల్ రైలును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. 2024 జులై 1 నుంచి 2024 సెప్టెంబర్ 30 వరకు సికింద్రాబాద్ నుండి అగర్తల (త్రిపుర)కు వారానికి ఒక‌సారి ఈ ప్రత్యేక రైలు ప్రయాణించ‌నుంది. ఈ ప్రత్యేక‌ రైలు మొత్తం 14 వారాలు పాటు అందుబాటులో ఉంటుంది. ప్రతి శుక్రవారం న‌డిచే తిరిగి అగర్తల - సికింద్రాబాద్ (07029) ప్రత్యేక రైలును అక్టోబ‌ర్ 4 వ‌ర‌కు పొడిగించింది. ఈ రైలు అగ‌ర్తల‌లో ప్రతి శుక్రవారం ఉద‌యం 06.20 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. ఈ ప్రత్యేక‌ రైలు మొత్తం 14 వారాలు పాటు అందుబాటులో ఉంటుంది.

సికింద్రాబాద్ - సంత్రాగచ్చి - సికింద్రాబాద్ బై వీక్లీ ప్రత్యేక రైళ్లు

ప్రతి మంగ‌ళ‌వారం, శ‌నివారాల్లో న‌డిచే సికింద్రాబాద్ - సంత్రాగచ్చి సమ్మర్ స్పెషల్ రైలు (07221) స్పెషల్ రైలును సెప్టెంబర్ 29 వరకు పొడిగించింది. జులై 2 నుంచి సెప్టెంబర్ 29 వరకు సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చి (ప‌శ్చిమ బెంగాల్‌)కు వారానికి రెండుసార్లు ఈ ప్రత్యేక రైలు ప్రయాణించ‌నుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో ప్రతి మంగ‌ళ‌వారం, ప్రతి శ‌నివారం ఉద‌యం 6.45 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. అదే రోజు రాత్రి దువ్వాడ‌కు 07.55 గంట‌ల‌కు చేరుకుని, 07. 57 గంట‌ల‌కు అక్కడి నుంచి బ‌య‌లు దేరుతుంది. మరుస‌టి రోజు ఉద‌యం 10.25 గంట‌ల‌కు సంత్రాగచ్చి చేరుకుంటుంది.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం