కూటమి ఎమ్మెల్యేల మధ్య లీజు చిచ్చు- విష్ణుకుమార్ రాజుపై గంటా ఫైర్-visakha film club lease dispute between coalition mlas ganta srinivas fire on vishnu kumar raju ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కూటమి ఎమ్మెల్యేల మధ్య లీజు చిచ్చు- విష్ణుకుమార్ రాజుపై గంటా ఫైర్

కూటమి ఎమ్మెల్యేల మధ్య లీజు చిచ్చు- విష్ణుకుమార్ రాజుపై గంటా ఫైర్

విశాఖ సిటీలో కూటమి ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. ఫిల్మ్ క్లబ్ లీజు వ్యవహారంలో విష్ణుకుమార్ రాజు విశాఖ కలెక్టర్ కు లేఖ రాశారు. ఇది తన నియోజకవర్గ పరిధిలోని విషయమని గంటా శ్రీనివాసరావు ఆయనపై ఫైర్ అయ్యారు.

కూటమి ఎమ్మెల్యేల మధ్య లీజు చిచ్చు- విష్ణుకుమార్ రాజుపై గంటా ఫైర్

విశాఖలో కూటమి ఎమ్మెల్యేలు రోడెక్కారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. శనివారం వీరిద్దరూ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం గంటా శ్రీనివాసరావు కారులో కూర్చొని సీరియస్ గా మాట్లాడుతుంటే, విష్ణు కుమార్ రాజు కారు పక్కనే నిలబడి ఆయనను సముదాయిస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

విష్ణుకుమార్ రాజుపై గంటా ఫైర్

గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు మాటలు వినకుండా కేకలు వేస్తూ వాహనంలో కూర్చొని, ఆగ్రహంతో మాట్లాడడం వీడియోలో కనిపిస్తుంది. పక్కనున్న వారు గంటా శ్రీనివాసరావుకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా, ఆయన అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కలెక్టర్ కు లేఖ

గంటా, విష్ణుకుమార్ రాజు మధ్య వాగ్వాదానికి అసలు కారణం విశాఖ ఫిలింనగర్ క్లబ్ లీజ్ విషయం అని తెలుస్తోంది. ఫిలింనగర్ క్లబ్ లీజు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కలెక్టర్ కు లేఖ రాశారు. అయితే ఆ వ్యవహారం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.

విష్ణుకుమార్ రాజు జోక్యంతో

అయితే తనకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్లారని గంటా విష్ణు కుమార్ పై ఫైర్ అయ్యారు. ఈ లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే సమయంలో మీరు అందుబాటులో లేరని, విష్ణు కుమార్ రాజు గంటా శ్రీనివాస్ కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మనం ఒకే పక్షంలో ఉన్నాం, ప్రతిపక్షంలో లేం అంటూ గంటా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

2014లో ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు

2014లో విశాఖ ఫిల్మ్ క్లబ్ ను ఏర్పాటైంది. సినీ, సాంస్కృతిక కార్యకలాపాల కోసం బీచ్ రోడ్డులో భూమిని ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నారు. ఈ క్లబ్ బీచ్ రోడ్డులో ఉండటంతో రాజకీయ నాయకులు, ఇతర గ్రూపుల కన్నుపడింది. వైసీపీ హయాంలో ఈ కబ్ల్ కు 'వైఎస్ఆర్ లాన్స్' అనే పేరు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పేరును క్లబ్ సభ్యులు తొలగించారు.

ఫిల్మ్ క్లబ్ లీజు వ్యవహారంలో

ఫిల్మ్ క్లబ్ లీజు వ్యవహారంలో అంతర్గతంగా ఏం జరిగిందో కానీ విష్ణుకుమార్ రాజు జోక్యంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఆ క్లబ్ తన నియోజవర్గంలో ఉందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ క్లబ్ ఏర్పాటులో గంటా శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. ఈ విషయంపై విష్ణుకుమార్ రాజు గంటా శ్రీనివాసరావుకు క్షమాపణలు చెప్పడంతో ఈ వ్యవహారంలో ఇంతటితో సద్దుమణిగిపోతుందో? లేదో? చూడాలి.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం