సినిమా కథకు సరిపోయే కథ ఒకటి.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి.. ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. మెుదటి భార్యే ఈ పెళ్లి జరిపించింది. దగ్గర ఉండి మరీ.. పెళ్లి చేయించింది. ఫస్ట్ లవర్ కోసం త్యాగం చేసేసింది. దీంతో భర్త హ్యాపీ అయ్యాడు. చెల్లెలు కూడా సంబరపడిపోతుంది. ఈ ట్రయంగిల్ లవ్ స్టోరీ తిరుపతిలో జరిగింది.,తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఈ ట్రయంగిల్ లవ్ స్టోరీని చూసి.. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. భార్యతో హ్యాపిగా ఉంటున్నాడు. అయితే గత జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. కానీ పెళ్లి అయిపోయింది. కుటుంబాన్ని చూసుకోవాలి. అదే ధ్యాసలో ఉన్నాడు. ఇదే సమయంలో అతడి ఇంటికి ఓ అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది.,భార్య ఎవరు నువ్వు అని అడిగింది. వచ్చిన అమ్మాయి స్టోరీ చెప్పడం మెుదలపెట్టింది. మీ భర్త నేను ఒకప్పుడు లవర్స్. టిక్ టాక్ లో ఎన్నో రీల్స్ చేశాం. మా డ్యూయేట్లు చూసి.. జనాలు కుళ్లుకునేవారు. ప్రేమించుకున్నాం.. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ విధి వెక్కిరించి దూరమయ్యాం. కానీ ఆయన జ్ఞాపకాలు మరిచిపోలేకపోతున్నా అని చెప్పింది. నిజమేనా అని భర్త వైపు చూసింది భార్య. అతడు కూడా నిజమే అన్నట్టుగా తల ఊపాడు.,ఏం చేయాలా అని బాగా ఆలోచించింది భార్య. భర్తకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. వెంటనే ముహూర్తం ఫిక్స్ చేయించింది. తనకొ చెల్లి దొరికిందని సంబరపడిపోయింది. ఇప్పుడు వీళ్లు ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉంటారట. ఇక దొరకడు అనుకున్న మాజీ ప్రేమికుడు దొరికిపోయేసరికి సంబరపడిపోతుంది ప్రేమికురాలు. ఈ త్యాగం వెలకట్టలేనిదని.. తిరుపతిలో గుసగుసలు చెప్పుకొంటున్నారు. ఇక్కడ వరకు ఒక కథ. అసలు స్టోరీ ఇంకోటి ఉంది.,మరో ట్విస్ట్ ఏంటంటే?,ఈ కథలో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే.. మెుదటి భార్య కూడా టిక్ టాక్ ద్వారా పరిచమైన వ్యక్తే. అంబేద్కర్ నగర్‌కు చెందిన టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ కళ్యాణ్, సోషల్ మీడియాలో పరిచయమైన కడప జిల్లాకు చెందిన విమల అనే వ్యక్తిని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వివాహానికి ముందే విశాఖపట్నానికి చెందిన టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన మరో మహిళ నిత్యశ్రీతో సంబంధం ఉంది. కొన్ని సమస్యల కారణంగా ఆమె నుండి విడిపోయాడు.,కళ్యాణ్, విమల కలిసి అంబేద్కర్ నగర్‌లో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. నిత్యశ్రీ కొన్ని రోజుల క్రితం తన మాజీ ప్రేమికుడిని చూడటానికి వచ్చింది. వారి వివాహం గురించి తెలుసుకున్న తర్వాత కూడా, నిత్యశ్రీ కళ్యాణ్‌ని పెళ్లి చేసుకోమని వేడుకుంది. విషయాన్ని కళ్యాణ్ భార్యకు కూడా చెప్పింది. గ్రామంలోనే ఉండిపోయింది. ఆమె ప్రతిపాదనను అంగీకరించమని విమలని ఒప్పించే ప్రయత్నం చేసింది.,కళ్యాణ్, నిత్యశ్రీల మధ్య చెడిపోయిన బంధాన్ని తెలుసుకున్న మాజీ భార్య వాస్తవాన్ని అంగీకరించి ఎవరూ ఊహించని విధంగా చేసింది. మాజీ లవర్స్ ను వివాహం చేసుకునేందుకు అనుమతినిచ్చింది. గ్రామంలోని ఓ గుడిలో తన మొదటి భార్య సమక్షంలో బుధవారం నిత్యశ్రీని పెళ్లి చేసుకున్నాడు కళ్యాణ్. ఇది అసలు స్టోరీ. చూస్తే.. సినిమాకు కథ ఏ మాత్రం తగ్గనట్టుగా ఉంది కదా.