AP Agri Drones: ఇక ఏపీలో వ్యవసాయ డ్రోన్‌లతో గ్రామ స్థాయి యాంత్రీకరణ కేంద్రాలు, వ్యవసాయ బృందాలకు సబ్సిడీపై సరఫరా
AP Agri Drones: ఏపీలో వ్యవసాయ పెట్టుబడులను తగ్గించడానికి సకాలంలొ పురుగు మందులు మరియు సూక్ష్మ ఎరువులను పంటలకు అందించడానికి వ్యవసాయ డ్రోన్ పరికరాలను వినియోగించేలా సబ్సిడీపై వాటిని ప్రభుత్వం సరఫరా చేయనుంది.
AP Agri Drones: ఏపీలో వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2024-25 సంవత్సరంలో రాష్ట్రంలోని 875 గ్రామాల్లో రూ.10.00 లక్షలు యూనిట్ విలువతో 80% వరకు సబ్సిడీపై , 50% బ్యాంకు ఋణ సహాయంతో వ్యవసాయ డ్రోన్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ స్టాయి వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలను రు. 70 కోట్ల రాయితీ సొమ్ముతో ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు.

ఈ కేంద్రాలను అన్ని జిల్లాల్లోని వాణిజ్య పంటలు, పిచికారీ ఎక్కువగా అవసరం అయ్యే పంటలు, ఒకే పంట ఎక్కువగా పండించే మండలాల్లో ప్రాధాన్యత అనుసరించి ఎంపిక చేసిన రైతు సేవా కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో భూమి ఉండి, వ్యవసాయం చేసే రైతులు ఈ కేంద్రాల ద్వారా అద్దె రూపంలో యంత్ర సేవల్ని వినియోగించుకోవచ్చు.
వీటి ద్వారా ఆదాయం సంపాదించడానికి ఉత్సుకత కలిగిన 4-5 రైతులతో రైతుసంఘాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. రైతులకు ఈ డ్రోన్లు కొనుగోలుకు ఆర్ధిక సహాయం కోసం ఋణ సదుపాయను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆచార్య NGరంగా విశ్వవిద్యాలయం (ANGRAU), కార్యక్రమం అమలుకు అవసరమైన సాంకేతిక సహాయం అందిస్తోంది.
రైతులకు అందించే డ్రోన్లను క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యమైన మరియు స్థిరంగా పనిచేసే డ్రోన్ లను రైతులకు అందజేయడానికి ప్రభుత్వం వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలొ రాష్ట్ర స్థాయి కమిటీని ఎర్పాటు చేసింది. ఈ కమిటి నాణ్యమైన డ్రోన్ యూనిట్లను రైతులకు అందించనుంది. దీనిలో బాగంగా అర్హత కలిగిన కంపనీలు DGCA దృవీకరించిన డ్రోన్ మోడల్స్ ను వ్యవసాయ శాఖ పరీక్షల కోసం ఆహ్వానించింది.
వచ్చిన డ్రోన్లను - వ్యవసాయ శాఖ అధికారులు, ANGRAU శాస్రవేత్తలు, డ్రోన్ కార్పొరేషన్ సాంకేతిక అధికారులతో కూడిన సాంకేతిక కమిటీ గుంటూరు జిల్లాలో లామ్‌లో ఉన్న పరిశోధన కేంద్రాల్లో పరీక్షలు జరుపుతోంది.
డ్రోన్లకు భారత ప్రభుత్వ (DGCA) జారీ చేసిన ప్రతేక గుర్తింపు సంఖ్యతో పాటు TYPE సర్టిఫికేట్ ప్రకారం వివిధ ప్రామాణికాలను, బ్యాటరీలను, ఇన్సూరెన్స్ వివరాలు పరిశీలిస్తున్నారు. పొలం లో వుండే వివిధ పరిస్థితులలో డ్రోన్ పిచికారీ చేసే పనితీరు క్షుణ్ణంగా పరిశీలించి కమిటీ నివేదిక ఇస్తుంది.
పంట మీది నుంచి రెండు అడుగుల మరియు మూడు అడుగుల ఎత్తులో స్థిరంగా పిచికారీ చేయడం, పొలాల్లో చెట్లు, కరెంటు పోల్స్ , కరెంటు తీగలు మొదలగు అడ్డంకులు వున్నప్పుడు వాటి పనితీరు, పొలంలో పిచికారీ కొరకు మాప్పింగ్ చేసే విధానం, మాప్పింగ్ పరిధిలో పిచికారీ చేసే విధానం, ఒక బ్యాటరీ చార్జింగ్ తో ఎన్ని ఎకరాలు పిచికారీ చేస్తోందనే వివరాలు, బ్యాటరీ, నీళ్లు అయిపోయిన పరిస్థితులలో యధాస్థితికి తనంతట తానే వచ్చి ల్యాండ్ అయ్యే విధానం పరీక్షిస్తున్నారు.
పది లీటర్ల ద్రావకంతో ఎకరం పొలాన్ని పిచికారీ చేయగలిగే విధానం, పంట మీద స్థిరమైన ఎత్తులో సమానంగా ప్రయాణం చేసి ఏక రీతిగా మందు పిచికారి చేసే విధానం, ఒక రోజులో కనీసం 20 ఎకరాలు పిచికారీ చేసే సామర్ధ్యం వంటి ప్రామాణికాలను పరీక్షించి, పరిశీలించిన తర్వాత కమిటీ డ్రోన్లను ఎంపిక చేస్తుంది.
స్థిరంగా ఎక్కువ కాలం పనిచేసే నాణ్యమైన డ్రోన్లను గుర్తించి వాటిని రైతు గ్రూపులకు వారు కోరుకున్న డ్రోన్ మోడల్ ను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసుకోవడానికి వీలు కల్పిస్తారు. తద్వారా వ్యవసాయ డ్రోన్ పరికరాలు ఉపయోగించి వ్యవసాయ పెట్టుబడులను తగ్గించి సకాలంలొ పురుగు మందులు మరియు సూక్ష్మ ఎరువులను పంటలకు అందించేందుకు వీలవుతుంది.