AP DME Notification : ఏపీలో 480 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, నెలకు జీతం రూ.70 వేలు
AP DME Notification : ఏపీలో 480 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 23న వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
AP DME Notification : ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(AP DME) పరిధిలో 480 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో మొత్తం 21 స్పెషాలిటీల్లో 480 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ట్రెండింగ్ వార్తలు
- వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ : నవంబర్ 23
- వయో పరిమితి : 44 సంవత్సరాలు, నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది.
- అర్హత- మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ MD/MS/DNB
వాక్-ఇన్ ఇంటర్వ్యూ
అర్హతగల అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో స్వీయ ధృవీకరణ పత్రాలు, ఒరిజినల్ ధృవీకరణ పత్రాలు, దరఖాస్తు ఫారమ్‌తో పాటు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ నవంబర్ 23న విజయవాడ హనుమాన్ పేటలోని పాత జీజీహెచ్ క్యాంపస్ DME కార్యాలయంలో నిర్వహిస్తారు.
21 స్పెషలైజేషన్ లో ఖాళీలు
అనాటమీ, ఫిజియాలజీ, సైకియాట్రీ, బయోకెమిస్ట్రీ, జనరల్ సర్జరీ, ఫార్మకాలజీ, డీవీఎల్, ఆర్థోపెడిక్స్, పాథాలజీ, ఓటోరినోలారింగాలజీ, ఆప్తల్మాలజీ, ఓబీజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, పీడియాట్రిక్స్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, రెస్పిరేటరీ మెడిసిన్, అనెస్తీషియాలజీ, రేడియోడయాగ్నోసిస్, ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలైజేషన్‌లో మొత్తం 480 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ అంటే ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీలో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నా.
అప్లికేషన్ ఫీజు
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కింద ఓసీ అభ్యర్థులు రూ.500, బీసీ,ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంది. పోస్టు గ్రాడ్యుయేషన్ తుది పరీక్షల మెరిట్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత తుది ఎంపిక ఉంటుందని వెల్లడించారు. ఎంపికైన వారికి నెలకు రూ.70,000 చొప్పున జీతం ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు సంబంధిత వైద్య కళాశాలల్లో పని చేయాల్సి ఉంటుంది.