Indrakeeladri Giri Pradakshina : రేపు విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ, రూట్ మ్యాప్ ఇలా-vijayawada indrakeeladri giri pradakshina on august 19th route map released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Indrakeeladri Giri Pradakshina : రేపు విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ, రూట్ మ్యాప్ ఇలా

Indrakeeladri Giri Pradakshina : రేపు విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ, రూట్ మ్యాప్ ఇలా

Bandaru Satyaprasad HT Telugu
Aug 18, 2024 03:47 PM IST

Indrakeeladri Giri Pradakshina : రేపు విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉదయం 5.55 గంటలకు దుర్గమ్మ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ జరగనుంది. సోమవారం ఉదయం 5.55 గంటలకు ఘాట్ రోడ్డులోని శ్రీ కామథేను ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుంది.

రేపు విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ, రూట్ మ్యాప్ ఇలా
రేపు విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ, రూట్ మ్యాప్ ఇలా

Indrakeeladri Giri Pradakshina : రేపు(ఆగస్టు 19న) విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా దుర్గమ్మ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 5.55 గంటలకు ఘాట్ రోడ్డులోని శ్రీ కామథేను ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుంది. కుమ్మరిపాలెం, విద్యాధరపురం, నాలుగు స్తంభాలు, సితార జంక్షన్, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్ రావునగర్, చిట్టినగర్, కేటీ రోడ్డు, బ్రాహ్మణ వీధి మీదుగా ఈ గిరి ప్రదక్షిణ జరగనుంది. స్వామి, అమ్మవార్ల రథాన్ని భక్తులు అనుసరిస్తూ ప్రదక్షిణ చేస్తుంటారు. సుమారు 7 కిలోమీటర్ల మేర ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ నిర్వహిస్తుంటారు. లోకకల్యాణార్థం జరుగుతున్న గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని దుర్గగుడి పాలకమండలి కోరింది. ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గిరిప్రదక్షిణ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేసే అవకాశం ఉంది. భక్తులకు తాగునీరు, ఆహారం ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నెల 23న దుర్గగుడిలో సామూహిక వరలక్ష్మీ వ్రతం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయంలో ఈ నెల 23న సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు దుర్గగుడి ఈవో రామరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు రూ.1500 ఆర్జితసేవా టికెట్‌ ఉన్న భక్తులతో వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉన్న భక్తులు ముందస్తు దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. ఈ నెల 17 నుంచి 21 వరకు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.

సెప్టెంబర్ 2 వరకు శ్రావణమాస ప్రత్యేక పూజలు

విజ‌య‌వాడ ఇంద్రకీలాద్రిపై శ్రావ‌ణ మాసాన్ని పురస్కరించుకొని ఈనెల 23న సామూహిక వ‌ర‌ల‌క్ష్మీ వ్రతాన్ని (ఆర్జిత‌, ఉచిత‌) నిర్వహిస్తున్నట్లు దుర్గామ‌ల్లేశ్వర స్వామి దేవ‌స్థానం ఈవో రామారావు తెలిపారు. సెప్టెంబ‌ర్ 2 వ‌ర‌కు శ్రావ‌ణమాస ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల‌ 18 నుంచి 20 వ‌ర‌కు ఇంద్రకీలాద్రిపై ప‌విత్రోత్సవాలను పుర‌స్కరించుకొని ప్రత్యక్ష, ప‌రోక్ష ఆర్జిత సేవ‌ల‌ను నిలిపివేశారు. ఇవాళ వేకువ‌జామున మూడు గంట‌ల‌కు సుప్రభాత సేవ‌, స్నప‌నాభిషేకం చేశారు. అనంత‌రం మూల‌విరాట్‌తో పాటు ఉపాల‌యాల్లోని విగ్రహాల‌కు పవిత్ర ధార‌ణ చేశారు. 19న మూల‌మంత్ర హవ‌నాలు, వేద పారాయ‌ణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈనెల 20 తేదీన ఉద‌యం 8 గంట‌ల నంచి 10 గంట‌ల వ‌ర‌కు మండ‌పారాధ‌న‌, స‌ర్వప్రాయ‌శ్చిత్త శాంతిపౌష్టిక హోమాల‌ను నిర్వహిస్తారు. ఉద‌యం 10:30 గంట‌ల‌కు పూర్ణాహుతితో ప‌విత్రోత్సవాలు చేస్తారు. సామూహిక వ‌ర‌ల‌క్ష్మీ వ్రతంలో పాల్గొనే భ‌క్తుల కోసం ఈనెల 17 నుంచి 21 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను దుర్గామ‌ల్లేశ్వర స్వామి దేవ‌స్థానం స్వీక‌రించ‌నుంది. భ‌క్తులు ఆయా తేదీల్లో ద‌ర‌ఖాస్తుల‌ను పూర్తి చేసి దేవ‌స్థానంలో అంద‌జేయాల్సి ఉంటుంది. ఆర్జిత వ‌ర‌లక్ష్మీ వ్రతానికి టికెట్ ధ‌ర రూ.1,500గా నిర్ణయించారు. ఈనెల 23న ఉద‌యం 7 గంట‌ల నుంచి 9 గంట‌ల వ‌ర‌కు ఆర్జిత వ‌ర‌ల‌క్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తారు

సంబంధిత కథనం