AP Vidyakanuka Kits : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, జూన్ 12 నాటికి విద్యాకానుక కిట్ల పంపిణీ!
AP Vidyakanuka Kits : ఏపీ విద్యార్థులకు ఏటా పంపిణీ చేసే విద్యాకానుక కిట్ల పంపిణీకి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. జూన్ 5 నాటికి పాఠశాలలకు కిట్లు చేరేలా చూడాలని ఆదేశించింది. జూన్ 12 నాటికి పంపిణీ చేయాలని సూచించింది.
AP Vidyakanuka Kits : ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థలకు ఏటా అందించే కిట్లు జూన్ 12 నాటికే పాఠాశాలలకు పంపిణీ చేయనున్నారు. అనంతరం పాఠశాల్లో విద్యార్థులకు కిట్లు పంపిణీ చేస్తారు. ఈ విషయాన్ని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. అందుకనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే అన్ని పాఠశాలలకు దిశానిర్దేశం చేశారు.
జూన్ 12 నాటికి విద్యార్థులకు పంపిణీ
రాష్ట్రంలో విద్యాకానుకను 2021 ఆగస్టు 16న ప్రారంభించారు. ఈ పథకం కింద ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఎనిమిది ఐటమ్స్ తో కిట్లు ఇస్తారు. రెండు జతల స్కూల్ యూనిఫాం (స్టీచింగ్ ఛార్జీలుతో సహా), పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, తెలుగు-ఇంగ్లిష్ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ, స్కూల్ బ్యాగ్, బెల్టు, రెండు జతల నలుపు షూస్, రెండు జతల సాక్సులతో కూడిన కిట్లు ప్రతి విద్యార్థికి అందజేస్తారు. ఈ కిట్లు జూన్ 5 నాటికి అన్ని స్కూల్స్ కు షూస్ రవాణా పూర్తి చేయనున్నారు. జూన్ 12 నాటికి పాఠశాలలు తెరుస్తారు. అప్పటి విద్యార్థులందరికీ స్కూల్ కిట్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే స్కూల్ బ్యాగ్ లు తయారీ చేసే ఫ్యాక్టరీలు, షూస్ తయారీ చేసే ఫ్యాక్టరీలను సందర్శించారు. ఫ్యాక్టరీల యాజమాన్యానికి కూడా గడువులోపు ఇచ్చే విధంగా ఆదేశించారు.
నాణ్యమైన షూస్
షూస్ 16 సెంటీ మీటర్లు నుంచి 30 సెంటీ మీటర్ల పరిమాణానికి అనుగుణంగా ఉండాలని షూస్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి సూచించారు. షూస్ పైభాగం 1.8 ఏంఏం ప్లస్ 0.22 మిల్లీమీటర్లు దలసరిగా ఉండేలా పాలివినైల్ క్లోరైడ్ మెటీరియల్ తో తయారు చేయాలని, క్వాలటీలో ఎక్కడా రాజీ పడకూడదని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. అదే విధంగా 0.85 ప్లస్ 0.10 గ్రాములు, సెంటీమీటర్ల సాంద్రత కలిగిన పదార్థంతో సోల్ భాగాన్ని తయారు చేసేలా చర్యలు తీసుకోవాలి. షూస్ నాణ్యత, సరఫరాలో ఎటువంటి లోపం ఉండకూడదని, ఒకవేళ ఉంటే ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. షూస్, బ్యాగులు తయారీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపారు.
విద్యాకానుక కిట్ల పంపిణీకి చర్యలు
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 44,57,441 మంది ఉన్నారు. వీరందరికీ విద్యా కనుక కిట్లును ఇవ్వనున్నారు. ఎవ్వరికీ లోటు లేకుండా అందరికీ కిట్లు అందేటట్లు చర్యలు చేపడుతున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కిట్లు పంపిణీలో కూడా ఎటువంటి పొరపాట్లు జరగనివ్వమని అంటున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం