Indrakeeladri Varalakshmi Vratam : ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతం, ఈ నెల 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ
Indrakeeladri Varalakshmi Vratam : ఈ నెల 23న ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. సామూహిక వరలక్ష్మీ వ్రతానికి ఈనెల 17 నుంచి 21 వరకు దరఖాస్తులు దేవస్థానం స్వీకరించనున్నారు.
Indrakeeladri Varalakshmi Vratam : ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతం ఈనెల 23న జరగనుంది. అలాగే సోమవారం నుంచి వచ్చేనెల 2 వరకు శ్రావణమాస పూజలు జరగనున్నాయి. సామూహిక వరలక్ష్మీ వ్రతానికి ఈనెల 17 నుంచి 21 వరకు దరఖాస్తులు దేవస్థానం స్వీకరిస్తుంది. ఈనెల 18 నుంచి 20 వరకు ఇంద్రకీలాద్రిపై ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను నిలిపివేస్తారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈనెల 23న సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని (ఆర్జిత, ఉచిత) నిర్వహిస్తున్నట్లు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. సోమవారం నుంచి సెప్టెంబర్ 2 వరకు శ్రావణమాస ప్రత్యేక పూజలు నిర్వహిస్తోన్నారు. ఈనెల 16న కనకదుర్గమ్మను వరలక్ష్మీ దేవిగా అలంకరిస్తారు. ఈనెల 17 తేదీన సాయంత్రం 4 గంటలకు ఉదక శాంతిని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈనెల 18 నుంచి 20 వరకు ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను నిలిపివేస్తారు. ఈనెల 18 తేదీన వేకువజామున మూడు గంటలకు సుప్రభాత సేవ, స్నపనాభిషేకం చేస్తారు. అనంతరం మూలవిరాట్‌తో పాటు ఉపాలయాల్లోని విగ్రహాలకు పవిత్ర ధారణ చేస్తారు.
ఈనెల 18 తేదీన ఉదయం తొమ్మిది గంటలకు క్యూ లైన్‌లో వేసి ఉన్న భక్తులకు దేవుని దర్శనానికి అనుమతిస్తారు. ఈనెల 19 తేదీన మూలమంత్ర హవనాలు, వేద పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈనెల 20 తేదీన ఉదయం 8 గంటల నంచి 10 గంటల వరకు మండపారాధన, సర్వప్రాయశ్చిత్త శాంతిపౌష్టిక హోమాలను నిర్వహిస్తారు. ఉదయం 10:30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు చేస్తారు. సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే భక్తుల కోసం ఈనెల 17 నుంచి 21 వరకు దరఖాస్తులను దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం స్వీకరించనుంది. భక్తులు ఆయా తేదీల్లో దరఖారస్తులను పూర్తి చేసి దేవస్థానంలో అందజేయాల్సి ఉంటుంది. ఆర్జిత వరలక్ష్మీ వ్రతానికి టికెట్ ధర రూ.1,500గా నిర్ణయించారు. ఈనెల 23న ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఆర్జిత వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తారు.
అలాగే ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఈనెల 23 తేదీన ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు నిర్వహిస్తారు. భక్తులంతా ఈ వివరాలు తెలుసుకొని ఆ విధంగా దర్శనాలను ఏర్పాటు చేసుకోవాలని, అలాగే వ్రతాలను కూడా షెడ్యూల్ చేసుకోవాలని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం సూచన చేస్తోంది.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం