VJA Doctor Family: విజయవాడ డాక్టర్ ఫ్యామిలీలో దారుణం, కుటుంబ సభ్యుల్ని హత్య చేసి డాక్టర్ ఆత్మహత్య…
VJA Doctor Family: విజయవాడలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. కుటుంబ సభ్యులను హత్య చేసి వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
VJA Doctor Family: విజయవాడ గురునానక్ కాలనీలో ఘోరం జరిగింది. డాక్టర్ ఫ్యామిలీలో Doctor family ఐదుగురు అనుమానాస్పద స్థితిలో Five killed చనిపోయారు. నగరానికి చెందిన orthopedic Surgeon ఆర్థోపెడిక్ సర్జన్ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల్ని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
గురునానక్ కాలనీలోని ఫ్లాట్ నంబర్ 108లో నివాసం ఉంటున్న ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ నలుగురు కుటుంబ సభ్యుల్ని హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో శ్రీనివాస్ కుటుంబంలోని ఐదుగురు మృతి చెందారు. శ్రీనివాస్ కుటుంబం మృతిపై పోలీసులు తొలుత అనుమానం వ్యక్తం చేశారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించిన తర్వాత హత్యలు చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. ఇంటి ఆవరణలో పిల్లర్‌కు ఉరేసుకున్న స్థితిలో డాక్టర్ శ్రీనివాస్ మృతదేహం ఉంది.
మృతుల్లో శ్రీనివాస్ దంపతులు వారి ఇద్దరు పిల్లలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. మృతుల్ని డాక్టర్ శ్రీనివాస్, ఆయన భార్య ఉషారాణి, కుమార్తె శైలజ, తల్లి రమణమ్మ, కుమారుడు శ్రీ యాన్‌లుగా గుర్తించారు. కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన తర్వాత డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. నిద్రలో ఉండగా సర్జికల్ బ్లేడ్‌తో మెడ నరాలు కత్తిరించి హత్యలకు పాల్పడ్డాడు.
మంగళవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఉదయం శ్రీనివాస్‌ను ఎదురింట్లో వారు చూశామని స్థానికులు తెలిపారు. తెల్లవారు జామున కుటుంబ సభ్యుల్ని హత్య చేసి ఉండొచ్చని బావిస్తున్నారు.
డాక్టర్ శ్రీనివాస్ గత ఏడాది కాలంగా నగరంలో శ్రీజ ఆర్థోపెడిక్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. . శ్రీనివాస్ కుటుంబ సభ్యుల గొంతు కోసి హతమార్చి ఆపై ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోని గదుల్లో రక్తపు మడుగులో మృతదేహాలు పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
ఆర్థిక సమస్యలే కారణం…
శ్రీనివాస్ ప్రారంభించిన ఆస్పత్రి నిర్వహణలో ఇబ్బందులు తలెత్తాయి. ఆర్థిక సమస్యలతో ఆస్పత్రిని నెల క్రితం లీజుకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబ సభ్యుల్ని హతమార్చి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సీపీ రామకృష్ణ పరిశీలించారు. శ్రీనివాస్ బంధువుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
డాక్టర్ శ్రీనివాస్ ఏడాది క్రితం పూజ హాస్పటల్ నగరంలో ఏర్పాటు చేశారు. హాస్పటల్ నిర్వహణ కోసం ప్రతి నెల రూ.30లక్షల ఖర్చు అవుతోందని, దానికి తగ్గట్టుగా ఆదాయం లేదని తాను ఆత్మహత్య తప్ప మరో దారి లేదని స్నేహితులతో వాపోయాడు. స్నేహితుడికి సాయం చేసేందుకే మిత్రులు హాస్పటల్‌లో భాగస్వామ్యం తీసుకున్నారని డాక్టర్ శ్రీనివాస్ స్నేహితులైన వైద్యులు వివరించారు.
1996లో గుంటూరు మెడికల్ కాలేజీలో వైద్య విద్యను పూర్తి చేసిన డాక్టర్ శ్రీనివాస్, ఆ తర్వాత ఆర్థోపెడిక్ లో ఎంఎస్ పూర్తి చేశారు. వైద్యవృత్తిలో సుదీర్ఘ కాలంగా ఉన్నారు. గతంలో పలు ఆస్పత్రుల్లో సర్జన్‌గా పనిచేశారు. సొంత ఆస్పత్రి ఏర్పాటు చేసిన తర్వాత ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడంతో వాటిని ఎదుర్కొలేక సతమతం అయ్యారు. ఏడాదిలో దాదాపు మూడు కోట్లకు రుణాలు పేరుకుపోయినట్లు శ్రీనివాస్ సహచరులైన వైద్యులు వివరించారు.
మిత్రుడి ఆర్ధిక ఇబ్బందులు తెలియడంతోనే మిత్రులు ఆస్పత్రిలో భాగస్వామ్యం తీసుకున్నారని, కుటుంబం మొత్తాన్ని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడతాడని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిత్రులతో కలవడానికి కూడా ఆసక్తి చూపే వాడు కాదని వాట్సప్ గ్రూపుల్లో చేర్చిన బయటకు వెళ్లిపోయేవాడని బ్యాచ్‌మెట్లు వివరించారు.
కొద్ది నెలల క్రితం డాక్టర్ శ్రీనివాస్ ఆర్థిక ఇబ్బందుల గురించి తెలియడంతో మిత్రులు సాయం చేయడానికి అతనితో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పోలీసులకు వివరించారు. అతని మిత్రులు మంచి స్థానాల్లో ఉన్నారని, కష్టాలను తమతో చెప్పినా ఆదుకునే వారిమని ఆవేదన వ్యక్తం చేశారు.