Trains Information : విజయవాడ డివిజన్ పరిధిలో ప‌ది రైళ్లు ర‌ద్దు, పలు రైళ్లు రీషెడ్యూల్-vijayawada division railway works 10 trains cancelled some trains rescheduled ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Trains Information : విజయవాడ డివిజన్ పరిధిలో ప‌ది రైళ్లు ర‌ద్దు, పలు రైళ్లు రీషెడ్యూల్

Trains Information : విజయవాడ డివిజన్ పరిధిలో ప‌ది రైళ్లు ర‌ద్దు, పలు రైళ్లు రీషెడ్యూల్

HT Telugu Desk HT Telugu
Jul 10, 2024 08:26 PM IST

Trains Information : విజయవాడ డివిజన్ పరిధిలో మరమ్మతుల కారణంగా పది రైళ్లు రద్దయ్యాయి. అలాగే భద్రతా పనుల కారణంగా ప‌లు రైళ్లు రీషెడ్యూల్ చేశారు.

విజయవాడ డివిజన్ పరిధిలో ప‌ది రైళ్లు ర‌ద్దు, పలు రైళ్లు రీషెడ్యూల్
విజయవాడ డివిజన్ పరిధిలో ప‌ది రైళ్లు ర‌ద్దు, పలు రైళ్లు రీషెడ్యూల్

Trains Information : విజ‌య‌వాడ డివిజ‌న్ ప‌రిధిలోని వివిధ మ‌ర‌మ్మతుల ప‌నులు, ఆధునీకీక‌ర‌ణ ప‌నులు కార‌ణంగా ప‌ది రైళ్లు రద్దు అయ్యాయి. అందులో ఎనిమిది రైళ్ల ద‌క్షిణ రైల్వే ప‌రిధిలోనివి కాగా, రెండు రైళ్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌దిధిలోనివి. అలాగే భద్రతా పనుల కారణంగా ప‌లు రైళ్లు రీషెడ్యూల్ చేశారు. విజ‌య‌వాడ-చెన్నై సెంట్రల్ పినాకినీ ఎక్స్‌ప్రెస్ (12711) రైలును 2024 ఆగ‌స్టు 5 నుంచి 2024 ఆగ‌స్టు 10 వ‌ర‌కు ర‌ద్దు చేశారు. చెన్నై సెంట్రల్-విజ‌య‌వాడ పినాకినీ ఎక్స్‌ప్రెస్ (12712) రైలును 2024 ఆగ‌స్టు 5 నుంచి 2024 ఆగ‌స్టు 10 వ‌ర‌కు ర‌ద్దు చేశారు. విజ‌య‌వాడ-ఎంజీఆర్ చెన్నైసెంట్రల్ జ‌న‌శ‌తాబ్ది ఎక్స్‌ప్రెస్ (12078) రైలును 2024 ఆగ‌స్టు 5 నుంచి 2024 ఆగ‌స్టు 10 వ‌ర‌కు ర‌ద్దు చేశారు. ఎంజీఆర్ చెన్నైసెంట్రల్-విజ‌య‌వాడ సెంట్రల్ జ‌న‌శ‌తాబ్ది ఎక్స్‌ప్రెస్ (12077) రైలును 2024 ఆగ‌స్టు 5 నుంచి 2024 ఆగ‌స్టు 10 వ‌ర‌కు ర‌ద్దు చేశారు. బిట్రగుంట‌-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (17237) రైలును 2024 ఆగ‌స్టు 4 నుంచి 2024 ఆగ‌స్టు 11 వ‌ర‌కు ర‌ద్దు చేశారు. చెన్నై సెంట్రల్-బిట్రగుంట ఎక్స్‌ప్రెస్ (17238) రైలును 2024 ఆగ‌స్టు 4 నుంచి 2024 ఆగ‌స్టు 11 వ‌ర‌కు ర‌ద్దు చేశారు.

yearly horoscope entry point

విశాఖ‌ప‌ట్నం నుంచి బ‌య‌లుదేరే విశాఖ‌ప‌ట్నం-క‌డ‌ప తిరుమ‌ల ఎక్స్‌ప్రెస్, క‌డ‌ప నుంచి బ‌య‌లుదేరే క‌డ‌ప‌-విశాఖ‌ప‌ట్నం తిరుమ‌ల ఎక్స్‌ప్రెస్ రైళ్లను ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ర‌ద్దు చేసింది. విశాఖపట్నం-కడప తిరుమల ఎక్స్‌ప్రెస్ (17488) రైలును 2024 ఆగ‌స్టు 5 నుంచి 2024 ఆగ‌స్టు 10 వ‌ర‌కు ర‌ద్దు చేసింది. క‌డ‌ప నుంచి బ‌య‌లుదేరే కడప-విశాఖపట్నం తిరుమల ఎక్స్‌ప్రెస్ (17487) ఆగ‌స్టు 6 నుంచి ఆగ‌స్టు 11 వ‌ర‌కు ర‌ద్దు చేసింది.

హైద‌రాబాద్‌లో సాయంత్రం 6 గంట‌ల‌కు బ‌య‌లుదేరే హైద‌రాబాద్‌-తాంబ‌రం ఎక్స్‌ప్రెస్ (12760) రైలును 2024 ఆగ‌స్టు 2 నుంచి 2024 ఆగ‌స్టు 10 వ‌ర‌కు వ‌రంగ‌ల్‌, మ‌హ‌బూబాబాద్‌, డోర్నక‌ల్‌, ఖ‌మ్మం, విజ‌య‌వాడ‌కు బ‌దులుగా ప‌గిడిప‌ల్లి, గుంటూరు, తెనాలి మీదుగా మ‌ళ్లిస్తారు. అయితే ఈ రైలుకు గుంటూరు, న‌ల్గొండ‌లో అద‌న‌పు హాల్ట్‌లు ఉంటాయి. తాంబ‌రంలో సాయంత్రం 5.30 గంట‌ల‌కు బ‌య‌లుదేరే తాంబ‌రం-హైద‌రాబాద్ ఎక్స్‌ప్రెస్ (12759) రైలును 2024 ఆగ‌స్టు 2 నుంచి 2024 ఆగ‌స్టు 10 వ‌ర‌కు వ‌రంగ‌ల్‌, మ‌హ‌బూబాబాద్‌, డోర్నక‌ల్‌, ఖ‌మ్మం, విజ‌య‌వాడ‌కు బ‌దులుగా ప‌గిడిప‌ల్లి, గుంటూరు, తెనాలి మీదుగా మ‌ళ్లిస్తారు. అయితే ఈ రైలుకు గుంటూరు, న‌ల్గొండ‌లో అద‌న‌పు హాల్ట్‌లు ఉంటాయి.

పూరి రథయాత్రకు రెండు ప్రత్యేక రైళ్లు

పూరిలో జ‌గ‌న్నాథ‌స్వామి రథయాత్రకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి వ‌చ్చాయి. రథయాత్ర సమయంలో ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి అన్‌రిజర్వ్‌డ్ ప్యాసింజర్ ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించిందని ఈస్ట్ కోస్టు రైల్వే వాల్తేర్ డివిజ‌న్ సీనియ‌ర్ డివిజ‌న‌ల్ క‌మ‌ర్షియ‌ల్ మేనేజ‌ర్ కె. సందీప్ తెలిపారు. నౌపడ-పూరీ (08333) ప్ర‌త్యేక రైలు అందుబాటులోకి వ‌చ్చింది. హరిపూర్‌గ్రామ్, అర్గుల్ మీదుగా నౌపడా నుంచి జులై 15, 16 తేదీల్లో ఉద‌యం 04.00 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు మ‌ధ్యాహ్నం 12ః05 గంటలకు పూరీ చేరుకుంటుంది. పూరీ-నౌపడ (08334) ప్రత్యేక రైలు అందుబాటులోకి వ‌చ్చింది. జులై 15, 17 తేదీల్లో రాత్రి 11.00 గంట‌ల‌కు పూరీలో ఈ రైలు బ‌య‌లుదేరుతుంది. మ‌రుస‌టి ర‌జు ఉద‌యం 06ః40 గంట‌ల‌కు నౌప‌డ చేరుకుంటుంది. నౌప‌డ-పూరీ మ‌ధ్య అన్ని స్టేష‌న్లలో రైళ్లు ఆగుతాయి.

భద్రతా పనుల కారణంగా రైళ్లు రీషెడ్యూల్‌

జులై 11 నుంచి 13 వ‌ర‌కు వాల్తేర్ డివిజన్‌లోని పుండి - నౌపడ సెక్షన్‌లో భద్రతకు సంబంధించిన ఆధునికీకరణ పనులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో రైళ్లు రీషెడ్యూల్ చేశారు. భువనేశ్వర్ - ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (12830) జులై 11న మ‌ధ్యాహ్నం 12.10 గంట‌ల‌కు భువ‌నేశ్వర్‌లో బ‌య‌లుదేరాల్సి ఉంది. అయితే 45 నిమిషాలు ఆలస్యంగా మధ్యాహ్నం 12:55 గంటలకు బయలుదేరుతుంది. పూరీ - గాంధీధామ్ సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (22974) జులై 13న ఉద‌యం 11:15 గంటలకు పూరీ నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే 1ః30 గంట‌ల ఆల‌స్యంగా మ‌ధ్యాహ్నం 12:45 గంటలకు బయలుదేరుతుంది. భువనేశ్వర్ - తిరుపతి సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (22879) జులై 13 మ‌ధ్యాహ్నం 12:10 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరాల్సి ఉంది. అయితే 45 నిమిషాలు ఆలస్యంగా మధ్యాహ్నం 12:55 గంటలకు బయలుదేరుతుంది.

రైళ్ల షార్ట్ టర్మినేట్

జులై 11, 13 తేదీలలో విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం - పలాస మెము(07470 ) మేము శ్రీకాకుళం రోడ్డులో షార్ట్ టర్మినేట్ చేస్తారు. పలాస - విశాఖపట్నం మెము (07471 ) పలాసకు బదులుగా శ్రీకాకుళం రోడ్ నుంచి బయలుదేరుతుంది.

రైళ్ల నియంత్రణ

విజయవాడ డివిజన్ మీదుగా అప్పికట్ల - నిడుబ్రోలు - సుందూరు స్టేషన్ల మధ్య మూడో లైన్‌ను ప్రారంభించేందుకు సంబంధించి నాన్ ఇంటర్ లాకింగ్ / ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా కొన్ని రైలు సర్వీసులు నియంత్రించారు. పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్ (17479) జులై 22న సాయంత్రం 6:30 గంటలకు పూరి నుంచి బయలుదేరే మార్గంలో 02.10 గంట‌ల‌ పాటు నియంత్రించారు. పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్ (17479) జులై 29న సాయంత్రం 6:30 గంటలకు పూరి నుంచి బయలుదేరే మార్గంలో 01.20 గంట‌ల‌ పాటు నియంత్రించారు.

బిలాస్పూర్ డివిజన్‌లో షార్ట్ టెర్మినేషన్

అకల్తారా వద్ద కేఎస్‌కే సైడింగ్ లైన్ కనెక్టివిటీకి సంబంధించి నాన్ ఇంటర్ లాకింగ్ / ఇంటర్ లాకింగ్ వర్క్స్, అకల్తారా నుంచి బిలాస్పూర్ డివిజన్ మీదుగా జాంగీర్నైలా వరకు ఆటో సిగ్నలింగ్ సిస్టమ్ కారణంగా రైలు సర్వీసులు షార్ట్ టెర్మినేటెడ్, షార్ట్ ఆర్జిజినేట్ చేశారు.

షార్ట్ టెర్మినేటెడ్

విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం - కోర్బా ఎక్స్‌ప్రెస్ (18518)ను జులై 11 నుంచి 15 వ‌ర‌కు బిలాస్‌పూర్‌లో షార్ట్ టర్మినేట్ చేస్తారు. జులై 12 నుంచి 16 వ‌ర‌కు కోర్బా - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18517)ను కోర్బాకు బ‌దులుగా బిలాస్‌పూర్ నుంచి బ‌య‌లుదేరుతుంది. ప్రజలు ఈ మార్పులను గమనించి తదనుగుణంగా ప్ర‌యాణాలు చేయాల‌ని, జరిగిన అసౌకర్యానికి ప్రగాఢ విచారం వ్యక్తం చేస్తున్నామ‌ని సందీప్ తెలిపారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం