Postal Agents Recruitment : ఏపీలో పోస్టల్ బీమా ఏజెంట్ల నియామకానికి నోటిఫికేషన్, ఈనెల 19న ఇంటర్వ్యూలు
Postal Agents Recruitment : ఏపీలోని విజయవాడ పోస్టల్ డివిజన్ పరిధిలో పోస్టల్ బీమా ఏజెంట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 19న విజయవాడలో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.
ఏపీలో పోస్టల్ బీమా ఏజెంట్లుగా నియామకానికి నోటిఫికేషన్ విడుదల అయింది. దీనికి ఈనెల 19న ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని విజయవాడ పోస్టల్ డివిజన్ కోరింది.
విజయవాడ పోస్టల్ డివిజన్ పరిధిలో పోస్టల్ జీవిత బీమా, గ్రామీణ పోస్టల్ జీవిత బీమా పథకాల్లో డైరెక్ట్ ఏజెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తపాల శాఖ విజయవాడ పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ ఎం. నరసింహస్వామి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చన్నారు.
అర్హతలు
పోస్టల్ జీవిత బీమా, గ్రామీణ పోస్టల్ జీవిత బీమా పథకాల్లో డైరెక్ట్ ఏజెంట్లుగా పని చేయాలనుకునే అభ్యర్థుల విద్యార్హతలు కూడా నిర్ణయించారు. పోస్టల్ జీవిత బీమా ఏజెంట్‌గా నియామకానికి సంబంధించి విద్యార్హత ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గ్రామీణ పోస్టల్ జీవిత బీమా ఏజెంట్‌గా నియామకానికి సంబంధించి విద్యార్హత పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
జీతం
పోస్టల్ జీవిత బీమా, గ్రామీణ పోస్టల్ జీవిత బీమా పథకాల్లో ఏజెంట్లు చేసిన ఇన్సురెన్సును బట్టి వారికి నెలవారీ జీతం ఉంటుంది. కమిషన్ ప్రాతిపదికగానే జీతం ఉంటుంది. నెలవారీ ఫిక్సిడ్ వేతనం ఉండదు. కాబట్టి ప్రతినెల ఒకే విధంగా జీతం ఉండదు. ఒకనెల ఎక్కువ ఉంటుంది. ఒక నెల తక్కువ ఉంటుంది. ఏజెంట్ల సామర్థ్యాన్ని బట్టే జీతం వస్తుంది.
ఇంటర్వ్యూలు ఎక్కడ?
పోస్టల్ జీవిత బీమా, గ్రామీణ పోస్టల్ జీవిత బీమా పథకాల్లో ఏజెంట్ల నియామకాలకు సంబంధించిన ఇంటర్య్వూలు విజయవాడలో జరగనున్నాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈనెల 19న ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీనియర్ సూరింటెండెంట్ పోస్టల్ కార్యాలయంలో హాజరు కావలెను. అయితే ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటాతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలి.
ఎంపికైన వారు రూ.5 వేల బాండ్స్
ఇంటర్వ్యూలో ఎంపిక అయిన అభ్యర్థులు రూ.5,000 వేల పూచీకత్తుగా ఎన్ఎస్‌సీ బాండ్స్ రూపంలో సమర్పించాలి. అప్పుడే ఏజెంట్ల నియామకం పూర్తి అవుతుంది. ఈ రూ.5,000 వారికి హామీగా ఉంటుంది. రూ.5,000 చెల్లించకపోతే ఏజెంట్లగా నియామకం జరగదు.
అదనపు సమచారం కోసం, వివరాల కోసం, అనుమానలను నివృత్తి చేసుకోవడానికి ఫోన్ నెంబర్ 0866-2421515ను సంప్రదించాలి. లేకపోతే విజయవాడలోని సీనియర్ సూరింటెండెంట్ పోస్టల్ కార్యాలయాన్ని కూడా సంప్రదించవచ్చు.
రిపోర్టింగ్ : జగదీశ్వరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం