విజయవాడ నగరంలో బాంబు కలకలం రేగింది. రైల్వేస్టేషన్, బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టినట్లు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు..బాంబు స్క్వాడ్ తో రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర లాతూర్ నుంచి ఫోన్ వచ్చినట్టు పోలీసులు నిర్ధారణ చేశారు.
విజయవాడలో బాంబ్ కలకలం రేగింది. బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్ కి అగంతకుడు ఫోన్ కాల్ చేశాడు. దీంతో బాంబు స్క్వాడ్ బీసెంట్ రోడ్డులో తనిఖీ చేస్తున్నారు.
బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసీ భవనానికి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బీసెంట్ రోడ్డులోని దుకాణాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
ఇటీవల శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమై ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ ముమ్మర తనిఖీలు చేసింది. చివరకు బాంబు మెయిల్ ఫేక్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాంబు బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు ఇటీవల ఈ తరహా బాంబు బెదిరింపు ఫేక్ కాల్స్ వస్తున్నారు. ఇటీవల శంషాబాద్ ఎయిర్ పోర్టు, తాజాగా విజయవాడలో బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఆందోళన వాతావరణం నెలకొంటుంది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కదలికలు గుర్తించడంతో తీవ్ర కలకలం రేగింది. హైదరాబాద్ లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు విజయనగరానికి చెందిన వారు కాగా, మరొకరు హైదరాబాద్ లో ఉంటున్నారు.
వీరిద్దరూ తెలుగు రాష్ట్రాల్లో బాంబ్ పేలుళ్లకు కుట్ర చేశారని వార్తలు వస్తున్నాయి. నిందితులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది.
సంబంధిత కథనం