APRJC Phase II Results : ఏపీఆర్జేసీ ఫేజ్-2 ఫలితాలు విడుదల, ఈ లింక్ లో చెక్ చేసుకోండి!
APRJC Phase II Results : ఏపీలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్జేసీ ఫేజ్-2 ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
APRJC Phase II Results : ఆంధ్రప్రదేశ్‌లోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్ష ఫేజ్-2 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న నిర్వహించారు. మే 14న మొదటి ఫేజ్ ఫలితాలు విడుదల అయ్యాయి. రెండో ఫేజ్ సంబంధించి ఫలితాలు బుధవారం విడుదల చేశారు. ఈ ఫలితాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్, ఏపీఆర్ఐసీ సొసైటీ కార్యదర్శి నరసింహారావు విడుదల చేశారు. ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://aprs.apcfss.in/ లో చెక్ చేసుకోవచ్చు.
సీట్లు ఎలా కేటాయిస్తారు?
రెసిడెన్షియల్ స్కూల్స్, డిగ్రీ, ఇంటర్మీడియట్ కళాశాలల్లో సీట్లను మార్కులు, రిజర్వేషన్లు, స్పెషల్ కేటగిరీ, స్థానికత ఆధారంగా కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీలకు వెళ్లి చేరాల్సి ఉంటుంది.
ఫలితాలు పొందడానికి ఏం చేయాలి?
ఏపీఆర్జేసీ ఫలితాలు పొందడానికి విద్యార్థులు ఏం చేయాలి. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు https://aprs.apcfss.in/ వెబ్‌సైట్ లోకి వెళ్లి, క్యాండిడేట్ ఐడీ, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
విద్యార్థులు ఏ గ్రూప్‌ల్లో ప్రవేశం
ఏపీఆర్జేసీ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులు రెసిడెన్షియల్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపుల్లో ప్రవేశం జరుగుతుంది. ఈ ఏడాది ఏపీఆర్జేసీ-2024 ప్రవేశ పరీక్షను మొత్తం 49,308 మంది విద్యార్థులు రాశారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చిలో విడుదల అయింది. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రక్రియ మార్చి 1 ప్రారంభమై, ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మే 14న మొదటి ఫేజ్ ఫలితాలు విడుదల చేశారు. రెండో ఫేజ్ ఫలితాలు నేడు విడుదల అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ పరీక్షలు ఉంటాయి. ఏపీఆర్జీసీ పరీక్ష ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరేందుకు, ఏపీఆర్డీసీ పరీక్ష డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహిస్తారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు