CID On Skill Case : 13 చోట్ల చంద్రబాబు సంతకాలు, కేబినెట్ అనుమతి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు- సీఐడీ చీఫ్-vijayawada ap cid chief sanjay says 241 crore shifted to shell companies on chandrababu influence ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cid On Skill Case : 13 చోట్ల చంద్రబాబు సంతకాలు, కేబినెట్ అనుమతి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు- సీఐడీ చీఫ్

CID On Skill Case : 13 చోట్ల చంద్రబాబు సంతకాలు, కేబినెట్ అనుమతి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు- సీఐడీ చీఫ్

Bandaru Satyaprasad HT Telugu
Sep 13, 2023 08:47 PM IST

CID On Skill Case : కేబినెట్ ఆమోదం లేకుండా కేవలం జీవోతో స్కిల్ కార్పొరేషన్ ను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు. ఈ స్కామ్ లో రూ.241 కోట్లు నేరుగా షెల్ కంపెనీలకు వెళ్లాయన్నారు.

ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్
ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్

CID On Skill Case : కేబినెట్ అనుమతి లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసారని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. అమరావతిలో సీఐడీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. టీడీపీకి సుదీర్ఘ కాలం సేవలందించిన ఆడిటర్‌ను కార్పొరేషన్‌కు ఆడిటర్‌గా నియమించారన్నారు. కేబినెట్‌ ఆమోదం లేకుండా కేవలం జీవోతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారన్నారు. ఈ స్కామ్ లో రూ.241 కోట్లు నేరుగా షెల్‌ కంపెనీలకు వెళ్లాయన్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్‌ యాజమాన్యం కూడా ఈ ఘటనపై స్పందించిందన్నారు. తమ ఇండియా ఉద్యోగులు వాస్తవాలు చెప్పకుండా వ్యవహరించారని సీమెన్స్‌ తెలిపిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ ఏర్పాటులో విధి విధినాలు పాటించలేదన్నారు. ప్రైవేట్‌ వ్యక్తి గంటా సుబ్బారావుకు మూడు కీలక బాధ్యతలు అప్పగించారన్నారు. జీవోలో 13 చోట్ల చంద్రబాబు చేసిన సంతకాలున్నాయన్నారు. బడ్జెట్‌ అనుమతి, కౌన్సిల్‌ సమావేశానికి కూడా చంద్రబాబు సంతకం ఉందన్నారు.

చంద్రబాబు ప్రోద్బలంతోనే

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ తర్వాత కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. ఆ కార్పొరేషన్ ద్వారా హవాలా మార్గంలో నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థల ద్వారా నిధుల దారి మళ్లాయని తెలిసిందన్నారు. ఇదంతా చంద్రబాబు ప్రోద్బలంతోనే జరిగిందన్నారు. నిధులు విడుదలకు సంబంధించి చంద్రబాబు సంతకం పెట్టిన ఆధారాలు ఉన్నాయన్నారు. చార్టెడ్ అకౌంటెంట్‌ నియామకంలోనూ చంద్రబాబు సంతకం ఉందన్నారు. డిప్యూటీ సీఈవో అపర్ణ నియామకంలోనూ చంద్రబాబు సంతకం ఉందన్నారు. ఎంవోయూకు సంబంధించిన జీవోలో 90:10 శాతం అని చెప్పారని, కానీ ఒప్పందంలో 90 శాతం ప్రస్తావన లేదన్నారు.

రూ.241 కోట్లు దారిమళ్లింపు

డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్విల్ కార్‌ను ఈడీ, సీఐడీ గతంలోనే అరెస్ట్ చేసినట్లు సంజయ్ తెలిపారు. సీమెన్స్ సంస్థ తాము డబ్బు పెట్టలేదని సీఐడీకి మెయిల్ పంపిందన్నారు. ఎండీ సుమన్ బోస్ షెల్ కంపెనీలతో చేతులు కలిపారని, తమ విచారణలో తేలిందని సీమెన్స్ సంస్థ చెప్పిందన్నారు. ఏసీబీ కోర్టు ఈ ఆధారాలను పరిశీలించాకే చంద్రబాబుకు రిమాండ్ విధించిందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ వేశామన్నారు. జీవోలకు సంబంధించిన నోట్ ఫైల్స్ ను కూడా కొన్ని లేకుండా చేశారని ఆరోపించారు. సీఎం, సీఎస్ చెప్పడంతోనే నిధులు విడుదల చేశామని పీవీ రమేష్ గతంలో స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. ఐదుచోట్ల అచ్చెన్నాయుడు సంతకాలు ఉన్నాయన్నారు. సీమెన్స్ యాజమాన్యానికి కేవలం 58 కోట్లు మాత్రమే ఇచ్చారని మేజిస్ట్రేట్ ముందు చెప్పారన్నారు. ఈ స్కామ్ లో రూ.371 కోట్లను విడుదల చేసి నేరుగా రూ. 241 కోట్లను షెల్ కంపెనీకి దారిమళ్లించారని అభియోగించారు. ముందుగా నిధులు విడుదల చేయడానికి వీలు లేదని నోట్ ఫైల్‌లో రాసినా నిధులు ఇచ్చారని సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు.

Whats_app_banner