Venkateswara Kalyanam : యూకే, యూరోప్‌లలో ముగిసిన కళ్యాణోత్సవాలు….-venkateswara kalyanam conducted in uk and european countries ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Venkateswara Kalyanam Conducted In Uk And European Countries

Venkateswara Kalyanam : యూకే, యూరోప్‌లలో ముగిసిన కళ్యాణోత్సవాలు….

HT Telugu Desk HT Telugu
Nov 19, 2022 06:07 AM IST

Venkateswara Kalyanam యూకే మరియు యూరప్ దేశాలలో న దేవదేవుడి కల్యాణోత్సవాలు ఘనంగా ముగిసినట్లు ఏపీఎన్‌ఆర్టీఎస్‌ ప్రకటించింది. యూకే,యూరోప్‌‌లలోని పలు దేశాల్లో మలయప్ప స్వామి కళ్యాణోత్సవాలను ఏపీఎన్నార్టీఎస్‌ భాగస్వామ్యంతో టీటీడీ వేద పండితులు వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు.

యూరోప్‌‌లో వైభవంగా దేవదేవుడి కళ్యాణోత్సవాలు
యూరోప్‌‌లో వైభవంగా దేవదేవుడి కళ్యాణోత్సవాలు

Venkateswara Kalyanam యూకే మరియు యూరోప్ లలోని వివిధ దేశాలలో శ్రీ మలయప్ప స్వామి వారి కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ మేడపాటి తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

యూకే, యూరప్ దేశాలలో స్థిరపడిన తెలుగు భారతీయుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో అక్టోబర్ 15 నుండి నవంబర్ 13వ తేదీ వరకు పదకొండు నగరాల్లో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీనివాస కళ్యాణోత్సవాలను నిర్వహించారు. వైఖానస ఆగమం ప్రకారం తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేదపండితులు ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.

అన్ని నగరాల్లో శ్రీవారి కళ్యాణోత్సవానికి అశేసంఖ్యలో భక్తులు హాజరై, స్వామి వారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి భక్తి పులకితులయ్యారు. ఈ కల్యాణోత్సవాలకు ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయ సహకారం అందించింది.

తితిదే చైర్మన్ వై.వీ. సుబ్బారెడ్డి సమన్వయ సూచనలతో బేసింగ్ స్టోక్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంగ్లాండ్‌లోని బేసింగ్ స్టోక్ తెలుగు సంఘం, మాంచెస్టర్‌లోని శ్రీ వైకుంఠమ్, నార్త్ ఐర్లాండ్ లో బెల్ఫాస్ట్ నార్త్ ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్, డబ్లిన్ – ఐర్లాండ్, ఇండో-ఐరిష్ తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్, స్విట్జర్లాండ్ లో జురిక్‌లో స్విస్ వేదిక్ భక్తీ ఫౌండేషన్, నెదర్లాండ్స్ లో SVK, నవంబర్ ౩వ తేదీన జర్మనీ లోని మునిక్, 5వ తేదీన ఫ్రాంక్ఫర్ట్, 6వ తేదీన ఫ్రాన్స్ లోని పారిస్, 12వ తేదీన ఇంగ్లాండ్ లోని లండన్ మరియు 13 వ తేదీన స్కాట్లాండ్ లోని ఎడిన్ బర్గ్ నగరాలలో తెలుగు, భారతీయ సంస్థల సహకారంతో మలయప్ప స్వామివారి కళ్యాణం కన్నులపండుగగా నిర్వహించారు.

11 నగరాలలో శ్రీవారి కళ్యాణం నిర్వహించడానికి దాదాపు 15వేల కిలోమీటర్లకు పైగా బస్సు ప్రయాణం చేసిన తితిదే అర్చకులు, వేదపండితులు ప్రతి కల్యాణాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఐండ్ హోవెన్ లో జరిగిన శ్రీవారి కళ్యాణానికి ది హేగ్, నెదర్లాండ్స్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం అంబాసిడర్ రీనత్ సంధు, సత్య పినిశెట్టి, సెక్రటరీ ఎకనామిక్స్ & కామర్స్, బెల్జియం భారత రాయబార కార్యాలయం నుండి అధికారులు హాజరయ్యారు. ఫ్రాంక్ఫర్ట్ లో జరిగిన శ్రీవారి కళ్యాణంలో జర్మనీ లో భారత రాయబార కార్యాలయం అంబాసిడర్ పర్వతనేని హరీష్ దంపతులు, స్థానిక మేయర్ పాల్గొన్నారు. పారిస్ లో జరిగిన కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో తమిళ, పాండిచ్చేరి భక్తులు హాజరయ్యారు. 11 నగరాలలోని కల్యాణోత్సవాల్లో తెలుగు, భారతీయ భక్తులతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న వారుకూడా అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణ ఘట్టాన్ని వీక్షించి ఆశీర్వాదాలు అందుకున్నారు.

11 నగరాలలోని కల్యాణోత్సవాల్లో ఆయా నగరాల్లోని తెలుగు, భారతీయ, ధార్మిక సేవా సంస్థలు భక్తులకు ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసారు. ప్రతి ఏటా ప్రపంచంలోని వివిధ దేశాలలో శ్రీ మలయప్పస్వామి వారి కల్యాణం నిర్వహించాలని భక్తులు, తెలుగు మరియు భారతీయ సంస్థలు ముందుకువస్తే ఆయా దేశాలలో శ్రీవారి కల్యాణం నిర్వహించడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని మేడపాటి వెంకట్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తితిదే సిద్ధంగా ఉన్నాయని, దీనికి ఏపీఎన్ఆర్టీఎస్ తమ వంతు సహకారం అందిస్తుందని తెలిపారు.

IPL_Entry_Point

టాపిక్