Vijayawada Traffic Diversion : వాహనదారులకు అలర్ట్.. ఈ మార్గంలో రాకపోకలు బంద్.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!
Vijayawada Traffic Diversion : గన్నవరం సమీపంలోని కేసరిపల్లి గ్రామంలో జనవరి 5న.. హైందవ శంఖారావం మహాసభ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. ప్రయాణికులు గమనించి మళ్లించిన రూట్‌లో వెళ్లాలని సూచించారు.
విశాఖపట్నం నుండి చెన్నై వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. కాకినాడ జిల్లా కత్తిపూడి సెంటర్ నుండి వయా కాకినాడ, యానాం, అమలాపురం, రాజోలు, నరసాపురం, మచిలీపట్నం, రేపల్లె, బాపట్ల మీదుగా ఒంగోలు వెళ్లాలి. చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలు ఒంగోలు నుండి త్రోవగుంట, బాపట్ల, రేపల్లి, అవనిగడ్డ, మచిలీపట్నం, లోస్రా బ్రిడ్జి, నరసాపురం, అమలాపురం, కాకినాడ, కత్తిపూడి మీదగా విశాఖపట్నం వైపు వెళ్లాల్సి ఉంటుంది.
విశాఖ వెళ్లేందుకు..
చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు.. బడంపాడు క్రాస్ రోడ్ నుండి.. తెనాలి, పులిగడ్డ, మచిలీపట్నం, లోస్రా బ్రిడ్జ్, నరసాపురం, అమలాపురం, కాకినాడ, కత్తిపూడి మీదగా విశాఖపట్నం వైపు వెళ్లాలి. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు.. తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు, గమాన్ బ్రిడ్జి, దేవరపల్లి, గోపాలపురం, జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, ఖమ్మం మీదుగా సూర్యాపేట వెళ్లాలి.
హైదరాబాద్ వైపు..
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు.. భీమడోలు, ద్వారకాతిరుమల, కామవరపుకోట, చింతలపూడి, ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లాలి. ఏలూరు బైపాస్, జంగారెడ్డిగూడెం, అశ్వరావుపేట, ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్లాలి. ఏలూరు బైపాస్, చింతలపూడి, సత్తుపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.
మరో మార్గం..
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు మరో మర్గాన్ని పోలీసులు సూచించారు. హనుమాన్ జంక్షన్, నూజివీడు, మైలవరం, ఇబ్రహీంపట్నం, నందిగామ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లొచ్చు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు ఎన్టీఆర్ జిల్లా మీదుగా అయితే.. నందిగామ, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, గామన్ బ్రిడ్జి మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లాలి.
ఏలూరు మీదుగా..
మరో మార్గంలో అయితే.. ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరు మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లొచ్చు. అలా కాకుంటే.. రామవరప్పాడు రింగ్, నున్న, పాములు కాలువ, వెలగలేరు, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరు మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లాలి. విజయవాడ, ఎనికెపాడు, 100 అడుగుల రోడ్డు, తాడిగడప, కంకిపాడు, పామర్రు, గుడివాడ, భీమవరం మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లొచ్చు.
ఎయిర్‌పోర్ట్‌కు రావాలంటే..
విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చేవారు.. రామవరప్పాడు ఫ్లైఓవర్ మీదుగా ముస్తాబాద్, సూరంపల్లి, అండర్ పాస్ ద్వారా కొత్త బైపాస్ రోడ్డుకు రావాలి. అక్కడి నుంచి బీబీ గూడెం అండర్ పాస్ ద్వారా.. గన్నవరం చైతన్య స్కూల్ జంక్షన్ వద్ద ఎన్ హెచ్ 16కు రావాలి. అక్కడినుండి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాలి. సంబంధిత పత్రాలు ఉంటేనే ఈ మార్గంలో అనుమతిస్తారు.