అన్నీ కేసుల్లోనూ వంశీకి బెయిల్..! సుప్రీంకోర్టులోనూ ఊరట - జైలు నుంచి విడుదల-vallabhaneni vamssi gets relief in supreme court ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అన్నీ కేసుల్లోనూ వంశీకి బెయిల్..! సుప్రీంకోర్టులోనూ ఊరట - జైలు నుంచి విడుదల

అన్నీ కేసుల్లోనూ వంశీకి బెయిల్..! సుప్రీంకోర్టులోనూ ఊరట - జైలు నుంచి విడుదల

సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట దక్కింది. వంశీ బెయిల్ రద్దుకు నిరాకరించింది. అక్రమ మైనింగ్ కేసులో వాల్యూషన్ నివేదిక వచ్చాక చూస్తామని తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది. ఇప్పటికే వంశీకి అన్నికేసుల్లోనూ బెయిల్ లభించింది. దీంతో ఆయన ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు.

వల్లభనేని వంశీకి ఊరట

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీ బెయిల్‌ రద్దు చేసేందుకు నిరాకరించింది. మైనింగ్ వాల్యూయేషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది. దీంతో వంశీ బెయిల్ విషయంలో అప్పీల్ కు వెళ్లిన ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

అన్ని కేసుల్లోనూ బెయిల్…

వల్లభనేని వంశీకి ఏలూరు జిల్లా నూజివీడులోని 15వ అదనపు జిల్లా జడ్జి కోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. నకిలీ ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారంటూ అ పెట్టిన అక్రమ కేసులో వంశీ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో బెయిల్‌ కోసం వంశీ పిటిషన్‌ దాఖలు చేయగా.. 4 రోజుల క్రితం వాదనలు ముగిశాయి. ఇరువైపు వాదనలు విన్న కోర్టు…. మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ లభించినట్లు అయింది.

ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీ ఉన్నారు. గత నెలలో రెండు కేసుల్లో వంశీకి బెయిల్‌ మంజూరు అయ్యాయి. తాజాగా ఇళ్ల పట్టాల కేసులో బెయిల్‌ మంజూరైంది. దాంతో వంశీపై పెట్టిన కేసులన్నింటిల్లోనూ బెయిల్‌ మంజూరైంది. వంశీకి వచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా… అక్కడ కూడా వంశీకి ఊరట లభించింది.

అన్ని కేసుల్లో బెయిల్ రావటంతో వల్లభనేని వంశీ ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. పలు కేసుల్లో భాగంగా 137 రోజులపాటు వంశీ సబ్‌జైల్‌లో ఉన్నారు. ఫిబ్రవరి 16న హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకోగా… మొత్తం వంశీపై 11 కేసులు నమోదయ్యాయి. వీటననింటిలో బెయిల్ రావటంతో… ఇవాళ జైలు నుంచి బయటికి వచ్చారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.