వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు రిమాండ్ పొడిగించింది. వచ్చేనెల 4 వరకు రిమాండ్ పొడిగించింది. వంశీతో పాటు మరో నలుగురికి కూడా రిమాండ్ పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. సీఐడీ కోర్టు తీర్పును ఈ నెల 27కు రిజర్వ్ చేసింది.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేశారంటూ వంశీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో వంశీతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో సత్యవర్ధన్ ఫిర్యాదుతో వంశీ తోపాటు 87 మంది నిందితులపైనా అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
ఈ కేసులో వల్లభనేని వంశీని పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి గన్నవరం కోర్టులో ఆత్కూరు పోలీసులు హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను విజయవాడకు తరలించారు. ప్రస్తుతం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ 11 మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. వల్లభనేని వంశీ వ్యక్తిగత సహాయకుడు రాజా సహా 11 మందిని వారి ఇళ్ల వద్ద అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన సత్యవర్థన్.. కేసు వెనక్కు తీసుకుంటున్నట్లు అఫిడవిట్ దాఖలు చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన తనపై పోలీసులే ఒత్తిడి తెచ్చి కేసును నమోదు చేయించారన్నాడు. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న సత్యవర్ధన్.. తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదని పేర్కొన్నాడు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని 3 రోజుల పాటు సీఐడీ కస్టడీకి తీసుకుంటూ.. ఇటీవల విజయవాడ సీఐడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో వంశీ 71వ నిందితుడిగా ఉన్నారు. వంశీ ఆదేశాలతోనే దాడి జరిగిందని, దాడి కేసు కుట్రను తెలుసుకునేందుకు విచారించాలని సీఐడీ తరుపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన ఆదేశాలు లేకుండా అక్కడ ఏదీ జరిగే అవకాశం లేదని ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించి వంశీని మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇచ్చేందుకు అంగీకరించింది.
సంబంధిత కథనం