US Citizenship Rules: ట్రంప్ ఎఫెక్ట్.. యూఎస్ పౌరసత్వ నిబంధనలు కఠినతరం…అమెరికాలో పుట్టినా ఇక కష్టమే..
US Citizenship Rules: అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక సంస్కరణలు చేపట్టారు. అమెరికా పౌరసత్వ నిబంధనల్లో కీలక మార్పులు చేపడుతూ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. తాజా నిర్ణయంతో ఇకపై అమెరికా పౌరసత్వం లభించడం మరింత సంక్లిష్టం కానుంది.
US Citizenship Rules: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ పౌరసత్వం విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే పలు కీలక నిర్ణయాలపై ట్రంప్ సంతకాలు చేశారు. మాజీ అధ్యక్షుడు జో బైడాన్ నిర్ణయాలను రద్దు చేశారు. ట్రంప్ నిర్ణయాల్లో యూఎస్ పౌరసత్వంపై కఠిన ఆంక్షలు విధించారు.
అమెరికా పౌరసత్వ జారీ చేయడానికి ఉన్న విధివిధానాల్లో కూడా మార్పులు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకాలు చేశారు. తాజా నిర్ణయంతో ఇకపై అమెరికా పౌరసత్వం లభించడం సంక్లిష్టం కానుంది. అమెరికాలో శాశ్వతంగా స్థిరపడటం కఠినం కానుంది. తాజా నిర్ణయం ప్రకారం అమెరికాలో జన్మించే వారి తల్లిదండ్రులకు చట్టబద్దమైన పౌరసత్వం లేకపోతే ఆ సంతానానికి కూడా పౌరసత్వం లభించదు. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ప్రవాస భారతీయులపై ఎఫెక్ట్ చూపనుంది.
నల్లజాతి పౌరులకు అమెరికా పౌరసత్వం కల్పించే విషయంలో చేసిన చట్ట సవరణను తప్పుగా అన్వయించుకున్నట్టు పేర్కొన్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎక్కడ జన్మించినా వారంతా అమెరికా పౌరులుగా గుర్తిస్తూ అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణలో పేర్కొన్నారు. 1857లొ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారికి పౌరసత్వాన్ని కల్పించే విషయంలో అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ సవరణ చేపట్టారు.
అయితే 14వ అమెరికా రాజ్యాంగ సవరణ ఆఫ్రికాలో స్థిరపడిన వారి కోసం నిర్విచించారని, అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఆ సవరణ వర్తింప చేయాలనే ఉద్దేశం అందులో లేదని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సవరణ ప్రకారం "యునైటెడ్ స్టేట్స్‌లో జన్మించిన లేదా ప్రకృతిసిద్ధంగా పొందిన అన్ని వ్యక్తులు మరియు దాని పరిధికి లోబడి ఉంటారు, అమెరికా సంయుక్త రాష్ట్రాల పౌరులు మరియు వారు నివసిస్తున్న రాష్ట్రాల్లో అమెరికా పౌరులై ఉంటారని రాజ్యాంగ సవరణలో పేర్కొన్నారు.
పద్నాలుగవ రాజ్యాంగ సవరణలో అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికీ పుట్టుకతోనే పౌరసత్వం విస్తరించేలా అర్థాన్నిచ్చేలా లేదని తాజా నిర్ణయంలో పేర్కొన్నారు. పద్నాలుగవ సవరణలో "అమెరికా పరిధికి లోబడి లేకుండా" అమెరికాలో జన్మించిన వ్యక్తులను పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం నుండి మినహాయించినట్టు పేర్కొన్నారు.
ఈ నిర్ణయం ప్రకారం "అమెరికాలో జన్మించిన వారు, దాని పరిధికి లోబడి ఉండే వ్యక్తులకు జన్మించినప్పుడు మాత్రమే అక్కడే పుట్టే వారికి అమెరికా జాతీయత లభిస్తుంది. పద్నాలుగవ రాజ్యాంగ సవరణను తప్పుగా అన్వయించుకున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇకపై అమెరికాలో జన్మించినా, అమెరికా పరిధికి లోబడి లేని వ్యక్తులు, వర్గాలు, జాతీయులకు అమెరికాలో జన్మించిన సంతానానికి ఇకపై స్వయంచాలకంగా పౌరసత్వం లభించదు. గతంలో అమెరికాలో పుట్టిన వారికి వారి తల్లిదండ్రులతో సంబంధం లేకుండా పౌరసత్వం లభించేది. పౌరసత్వం కోసమే అమెరికా వెళ్లి పిల్లల్ని కన్న వారి ఉదంతాలు కూడా ఉన్నాయి. అమెరికా జాతీయులకే అవకాశాలు పేరుతో ఎన్నికల్లో ట్రంప్ విస్తృత ప్రచారం చేశారు. దానికి అనుగుణంగా తాజా నిర్ణయం తీసుకున్నారు.
- అమెరికాలో జన్మించిన వారి తల్లి చట్టబద్దంగా నివాసం ఉంటున్నా, శాశ్వత నివాసం లేకపోయినా పిల్లలకు పౌరసత్వం లభించదు.
- అమెరికాలో జన్మించిన పిల్లల తల్లి అక్రమంగా నివసిస్తున్నా, తండ్రి అమెరికా పౌరుడు కాకపోయినా ఆ సంతానానికి పౌరసత్వం దక్కదు.
- శిశువు తల్లి అమెరికాలో చట్టబద్దంగా ఉంటున్నా, టూరిస్ట్, స్టూడెంట్, వర్క్ పర్మిట్ ఉంటూ అమెరికా పౌరుడు కాని తండ్రికి జన్మించినా వారికి పౌరసత్వం దక్కదు.
- తాాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఇలాంటి వారికి అమెరికా పౌరసత్వ ధృవీకరణలు మంజూరు చేయకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇకపై అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇకపై పౌరసత్వ ధృవీకరణ పత్రాలను జారీ చేయకూడదని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- తాజా ఉత్తర్వులపై 30రోజుల్లోగా సంబంధిత శాఖలు ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఉత్తర్వుల్లో తల్లిదండ్రులకు సంబంధించిన నిర్వచనాలను కూడా స్పష్టం చేశారు.
- అమెరికాలో చట్టబద్ధమైన శాశ్వత నివాసితుల పిల్లలు సహా ఇతర వ్యక్తుల అమెరికా పౌరసత్వం పత్రాలను పొందే హక్కును తాజా నిర్ణయం ప్రభావితం చేయదని ఉత్తర్వులల్లో స్పష్టం చేశారు.
- తాజా నిర్ణయంతో అమెరికాలో స్థిరపడాలని భావించే వారి ఆశలపై నీళ్లు చల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏటా లక్షలాది మంది ఉద్యోగం ఉపాధి అవకాశాల కోసం అమెరికా వెళుతున్నారు. ఇకపై వారికి అమెరికాలో శాశ్వత నివాసం లభించడం కష్టం కానుంది.
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీచేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను ఈ లింకు ద్వారా చూడండి…. https://www.whitehouse.gov/presidential-actions/2025/01/protecting-the-meaning-and-value-of-american-citizenship/
సంబంధిత కథనం