Toilet Photos Duty: టాయ్‌లెట్‌ ఫోటోల అప్‌లోడ్‌ డ్యూటీ టీచర్లకు తీసేసి, సచివాలయ సిబ్బందికి అప్పగింత-uploading of toilet photos duty handed over to the secretariat staff ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Toilet Photos Duty: టాయ్‌లెట్‌ ఫోటోల అప్‌లోడ్‌ డ్యూటీ టీచర్లకు తీసేసి, సచివాలయ సిబ్బందికి అప్పగింత

Toilet Photos Duty: టాయ్‌లెట్‌ ఫోటోల అప్‌లోడ్‌ డ్యూటీ టీచర్లకు తీసేసి, సచివాలయ సిబ్బందికి అప్పగింత

Sarath chandra.B HT Telugu
Aug 20, 2024 07:44 AM IST

Toilet Photos Duty: ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ, పరిశుభ్రంగా ఉంటున్నాయో లేదో పర్యవేక్షించే బాధ్యతను ఉపాధ్యాయుల విధుల నుంచి ఇటీవల తొలగించారు. ఈ భాధ్యతల్ని ఇకపై గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్వర్తించాల్సిందిగా ప్రభుత్వంఆదేశాలు జారీ చేసింది. వారానికి రెండు సార్లు ఫోటోలు అప్‌లోడ్‌ చేయాలి.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు టాయ్‌లెట్‌ ఫోటోల అప్‌లోడ్ డ్యూటీ
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు టాయ్‌లెట్‌ ఫోటోల అప్‌లోడ్ డ్యూటీ

Toilet Photos Duty: ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిశుభ్రత పర్యవేక్షణ బాధ్యతల నుంచి ఉపాధ్యాయులను తప్పించిన ఏపీ ప్రభుత్వం ఆ బాధ్యతల్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింద.ి

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లలో పరిశుభ్రత అమలుకు సంబంధించిన ఫొటోలను తీసి, వాటిని యాప్‌లో అప్‌లోడ్‌ చేసే బాధ్యతలను విద్యాశాఖ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అప్పగించింది.

సచివాలయాల్లో పనిచేసే ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, వార్డు ఎడ్యుకేషన్‌ కార్యదర్శి వారంలో ప్రతి సోమ, గురువారాల్లో పాఠశాలలను సందర్శించి మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సచివాలయ ఉద్యోగులు పాఠశాల మరుగుదొడ్ల ఫోటోలను తీసేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్‌ యాప్‌లో వారికి లాగిన్ సదుపాయం కల్పించారు. పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ఐఎంఎంఎస్‌ యాప్‌లో లాగిన్‌ అయ్యేందుకు ఇకపై సచివాలయ ఉద్యోగులకు అనుమతిస్తారు.

ఇకపై బుధ, గురువారాల్లో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల చైర్మన్‌‌తో పాటు సభ్యులు కూడా ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. ఈ మేరకు సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు ఆదేశాలు జారీచేశారు.

మరుగుదొడ్ల ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్‌ చేసే బాధ్యతను వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు అప్పగించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో పాటు టీచర్లకు టాయ్‌లెట్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు అప్పగించారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాము చదువు చెప్పేందుకు వచ్చామని, మరుగుదొడ్ల ఫొటోలు తీసేందుకు కాదని గగ్గోలు పెట్టినా ఖాతరు చేయలేదు.

ఉపాధ్యాయులతో బలవంతంగా మరుగుదొడ్ల ఫొటోలు తీయించారు. దీనిపై ఎన్నికలకు ముందు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనల నేపథ్యంలో ఆ బాధ్యతలు తొలగిస్తామని కూటమి హామీ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ టాయ్‌లెట్‌ ఫోటోలు తీసే బాధ్యత నుంచి తప్పిస్తున్నట్టు ఎక్స్‌లో ప్రకటించారు.

ఇకపై రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల పరిశుభ్రతకు సంబంధించి ఫొటోలు తీసి, యాప్లో అప్లోడ్ చేసే బాధ్యతలను విద్యా శాఖ గ్రామ, వార్డు సచివాలయాలకు అప్ప గిస్తున్నట్టు సమగ్ర విద్యాశాఖ ప్రకటించింది. సచివాలయాల్లోని ఎడ్యుకే షన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శి ప్రతి సోమ, గురువారాల్లో లో పాఠశా లలను సందర్శించి మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అప్పట్లో ఆందోళన…

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు మరుగుదొడ్ల పర్యవేక్షణకు సంబంధించి 2022లో గుంటూరు జిల్లాలో జారీ చేసిన ఉత్తర్వులు అప్పట్లో వివాదాస్పదం అయ్యాయి. గుంటురూ నగరపాలక సంస్థ జారీ చేసిన ఆదేశాలు తీవ్ర దమారం రేపాయి. నగర పరిధిలోని 5 ప్రాంతాల్లో మరుదొడ్ల నిర్వహణ కాంట్రాక్టు 2022 ఫిబ్రవరి నెలతో ముగిసింది. దీంతో ఈ బాధ్యతను ఆయా ప్రాంతాల్లోని వార్డు కార్యదర్శులు, అడ్మిన్లకు అప్పగిస్తూ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

మరుగుదొడ్ల ఆదాయ లెక్కలు చూసేందుకు మూడు షిఫ్టుల్లో విధులు వేసుకోవాలని ఆదేశించారు. గాందీపార్కు, బండ్ల బజారు. కృష్ణా పిక్చర్ ప్యాలెస్, ఎన్టీఆర్ బ్సటాండ్, కొల్లి శారద కూరగాయా మార్కెట్ల సెంటర్లలో ఉండే మరుగుదొడ్లకు సంబంధించి పర్యవేక్షణల్లో చూడాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

మరుగుదొడ్ల వారీగా రోజువారీ లక్ష్యాలను కూడా నిర్దేశించారు. గాందీపార్కు వద్ద ఉన్న మరుగుదొడ్ల వసూళ్లు రోజుకు రూ.5 వేలు లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ ఆదేశాలను గమనిస్తే.. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు, అడ్మిన్లు మరుగుదొడ్ల వినియోదారుల నుంచి డబ్బులు వసూలు చేయాలని అర్థం వచ్చేలా ఉండటంతో దుమారం రేగింది. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో ఆ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకున్నారు. తాజా ఆదేశాలపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Whats_app_banner