Center Flood Relief Funds : 14 రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం విడుదల- ఏపీకి రూ.1036 కోట్లు, తెలంగాణకు రూ.416 కోట్లు-union home ministry released flood relief fund ap get 1036 crore tg 416 crores ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Center Flood Relief Funds : 14 రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం విడుదల- ఏపీకి రూ.1036 కోట్లు, తెలంగాణకు రూ.416 కోట్లు

Center Flood Relief Funds : 14 రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం విడుదల- ఏపీకి రూ.1036 కోట్లు, తెలంగాణకు రూ.416 కోట్లు

Bandaru Satyaprasad HT Telugu
Oct 01, 2024 10:13 PM IST

Center Flood Relief Funds : దేశవ్యాప్తంగా 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ రూ.5858.60 కోట్లు తక్షణ సాయంగా విడుదల చేసింది. ఏపీకి రూ.1036 కోట్లు, తెలంగాణకు రూ.416.80 కోట్లు మంజూరు చేసింది. అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1492 కోట్లు ప్రకటించింది.

14 రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం విడుదల- ఏపీకి రూ.1036 కోట్లు, తెలంగాణకు రూ.416 కోట్లు
14 రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం విడుదల- ఏపీకి రూ.1036 కోట్లు, తెలంగాణకు రూ.416 కోట్లు

Center Flood Relief Funds : దేశ వ్యాప్తంగా 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ తక్షణసాయంగా రూ.5858.60 కోట్లు విడుదల చేశారు. ఇటీవల వరదలకు ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో కేంద్ర బృందాలు వరద ప్రభావిత రాష్ట్రాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి కేంద్ర హోంశాఖకు నివేదిక అందించాయి. ఈ మేరకు కేంద్రహోంశాఖ తక్షణ సాయంగా ఈ నిధులు విడుదల చేసింది.

ఏపీ, తెలంగాణకు ఎంతంటే?

14 వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అడ్వాన్స్‌ నుంచి రూ.5858 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర బృందాలు పూర్తిస్థాయి నివేదిక అందించిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేస్తామని కేంద్ర హోంశాఖ పేర్కొంది. తాజా నిధుల్లో ఏపీకి రూ.1036 కోట్లు, తెలంగాణకు రూ.416.80 కోట్లు మంజూరు చేసింది. అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1492 కోట్లు ప్రకటించింది.

ఏ రాష్ట్రానికి ఎంత

  • ఆంధ్రప్రదేశ్ - రూ.1036 కోట్లు
  • తెలంగాణ - రూ.416.80 కోట్లు
  • మహారాష్ట్ర - రూ.1492 కోట్లు
  • అస్సాం - రూ. 716 కోట్లు
  • బిహార్‌ - రూ.655.60 కోట్లు
  • గుజరాత్‌ -రూ.600 కోట్లు
  • హిమాచల్‌ ప్రదేశ్‌ - రూ.189.20 కోట్లు
  • కేరళ -రూ. 145.60 కోట్లు
  • మణిపుర్‌ -రూ. 50 కోట్లు
  • మిజోరం-రూ. 21.60 కోట్లు
  • నాగాలాండ్‌ -రూ. 19.20 కోట్లు
  • సిక్కిం -రూ. 23.60 కోట్లు
  • త్రిపుర-రూ. 25 కోట్లు
  • పశ్చిమ బెంగాల్‌ -రూ. 468 కోట్లు